రామచంద్రాపురం, నవంబర్10: మిషన్ భగీరథతో ఇం టింటికీ స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేస్తామని ఎ మ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. గురువారం తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ఉస్మాన్‌నగర్‌లో రూ.30 కోట్లతో నిర్మించనున్న తాగునీటి రిజర్వాయర్‌కు 11వ వార్డు కౌన్సిలర్ చిట్టి ఉమేశ్వర్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెల్లాపూర్ మున్సిపాలిటీ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని, వందల కాలనీలు ఈ ప్రాంతంలో ఏర్పడుతున్నాయన్నారు. తెల్లాపూర్, ఉస్మాన్‌నగర్‌లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం రూ.30 కోట్లతో 60 లక్షల లీటర్ల సామర్థ్యంతో నూతన రిజర్వాయర్‌ను నిర్మించుకుంటాయన్నారు.
రిజర్వాయర్ ఏర్పాటుతో తెల్లాపూర్, ఉస్మాన్‌నగర్ గ్రామాల్లో ఉన్న అన్ని కాలనీలకు ప్రతి రోజూ తాగునీటిని అందింస్తామన్నారు. రిజర్వాయర్, ట్యాంక్ పనులను శరవేగంగా పూర్తి చేయించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. 40 లక్షల లీటర్ల సామర్థ్యంతో సంపు, 20 లక్షల లీటర్ల సామర్థ్యంతో ఓవర్‌హెడ్ ట్యాంక్‌ను నిర్మిస్తున్నట్లు చెప్పారు. సుమారుగా 22 కిలోమీటర్ల మేర పైప్లైన్లను ఏర్పాటు చేస్తామన్నారు. మెట్రో వాటర్ వర్క్స్ ఆధ్వర్యంలో రిజర్వాయర్ పనులను ప్రారంభించినట్లు తెలిపారు. మిషన్‌భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందుతుందన్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రిజర్వాయర్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో ఉన్న సమస్యలను ప్రణాళికాబద్ధంగా పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ రాములుగౌడ్, ఏఎంసీ వైస్‌చైర్మన్ మల్లారెడ్డి, కౌన్సిలర్లు శ్రీశైలం, రాజు, మున్సిపల్ అధ్యక్షుడు దేవేందర్‌యాదవ్, కమిషనర్ శ్రీనివాస్, వాటర్ వర్క్స్ జీఎం నారాయణ, డీజీఎం చంద్రశేఖర్, టీనా అధ్యక్షుడు రమణ, మాజీ సర్పంచ్ సోమిరెడ్డి, నాయకులు శ్రీకాంత్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, ప్రేమ్, సాగర్, ఇందిరారెడ్డి పాల్గొన్నారు.