మెదక్‌రూరల్, నవంబర్ 10 : ధాన్యం కొనుగోలు చేసేముందు అధికారులు సూచించిన నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ తూకం చేయాలని మెదక్ ఏవో శ్రీనివాస్ అన్నా రు. గురువారం మండలంలోని అవుసులపల్లి పాతూరు, ఆయా గ్రామాల్లో ధ్యానం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొ నుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఈవో రాజశేఖర్, రైతులు ఉన్నారు.
కొనుగోలు కేంద్రం పరిశీలన
శివ్వంపేట, నవంబర్ 10: మండలంలోని చండీ గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జడ్పీటీసీ మహేశ్‌గుప్తా పరిశీలించారు. తూకం వేస్తున్న విధానం పరిశీలించారు. వడ్లు తరలించడానికి ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అవుతున్నదని తెలుపగా సమస్య ను వెంటనే ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమం లో పీఏసీఎస్ డైరెక్టర్ బల్వంత్‌రెడ్డి, నాయకులు ముత్యంరెడ్డి, గౌరీశంకర్, భాస్కర్‌నాయక్, రైతులు ఉన్నారు.
కొనుగోలు కేంద్రం ప్రారంభం
తూప్రాన్, నవంబర్ 10: ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మండలంలోని మల్కాపూర్‌లో సర్పంచ్ మహాదేవి నవీన్‌తో కలిసి ఎంపీడీవో అరుంధతి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో అరుంధతి మాట్లాడుతూ రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని సర్పంచ్ మహాదేవి నవీన్ కోరారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ పంజాల ఆంజనేయులుగౌడ్, ఐకేపీ ఏపీఎం రుక్మిణీ, పంచాయతీ కార్యదర్శి మహేందర్‌రెడ్డి, గ్రామ సమైక్య అధ్యక్షురాలు చంద్రకళ, కో-ఆర్డినేటర్ గోవింద్, వీఏవో సంతోష పాల్గొన్నారు.
లారీలు రావడం లేదంటు రాస్తారోకో..
పాపన్నపేట్, నవంబర్ 10 : పాపన్నపేట ధాన్యం కొనుగోలు కేంద్రానికి లారీలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆరోపిస్తూ రైతులు మెదక్-బొడ్మట్‌పల్లి రహదారిపై కొద్ది సేపు రాస్తారోకో చేశారు. ఆరు రోజులుగా పాపన్నపేట లారీలు రాకపోవడంతో తూకం వేసిన ధాన్యం అలాగే ఉండిపోతున్నదని వారు ఆరోపించారు. రైతులు రాస్తారోకో చేస్తున్న విషయం తెలుసుకొని పాపన్నపేట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని రైతులకు నచ్చజెప్పి రాస్తారోకో విరమింప చేశారు.