చిలిపిచెడ్/ చేగుంట/ శివ్వంపేట, నవంబర్ 9 : కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర లభిస్తుందని తహసీల్దార్ ఆదర్శకుమార్ అన్నారు. చిలిపిచెడ్ మండలంలోని చండూర్, చిట్కుల్ గ్రామాల్లో బుధవారం సోమక్కపేట పీఏసీఎస్ ఆధ్వర్యలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆర్ఐ నాగరాజు, పీఏసీఎస్ సీఈవో పోచయ్యతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ రైతులు ధాన్యంలో తాలు, మట్టి, పొల్లు లేకుండా కొనుగోలు కేంద్రాలకు తీసుకుని రావాలన్నారు. ధాన్యాన్ని ప్యాడీ క్లీనర్‌లో ఆరబెట్టాలని సూచించారు. ధాన్యం తరలింపులో లారీల కొరత లేకుండా చూస్తామన్నారు. రైతులు ధాన్యాన్ని అమ్మిన వెంటనే పట్టాపాస్‌బుక్, ఆధార్‌కార్డు, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్‌లను ఇవ్వాలన్నారు.
రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, పంటను కొనుగోలు చేసేందుకు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధర ఇస్తున్నదని రాంపూర్ సర్పంచ్ కాశబోయిన భాస్కర్, కరీంనగర్ సర్పంచ్ ఊరడి మహిపాల్, ఎంపీటీసీ బింగి గణేశ్ పేర్కొన్నారు. చేగుంట మండలం రాంపూర్‌లో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నాయకులతో కలిసి ప్రా రంభించారు. రైతులు ధాన్యాన్ని పూర్తిగా ఆరబెట్టాలని సూచిం చారు. కార్యక్రమంలో సోమ్లాలోక్యతాండ సర్పంచ్ జానకి, ఉప సర్పంచ్‌లు స్వామి, యదగిరి, వార్డుసభ్యురాలు నర్సమ్మ, నాయకులు బిస్కి సాయికుమార్, శ్రీనివాస్, కిష్టయ్య, పోచ య్య, భిబిక్యా, మహేశ్, అశోక్, ఐకేపీ సీసీ శ్వేత పాల్గొన్నారు.
రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, పీఏసీఎస్ చైర్మన్ వెంకటరాంరెడ్డి అన్నారు. శివ్వంపేట మండలంలోని బొజ్యతండా, ఉసిరికపల్లి గ్రామాల్లో పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాలను సర్పంచ్‌లతో కలిసి ప్రారం భించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి, మద్దతుధర పొందాలని సూచించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ వైస్ చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమణాగౌడ్, సర్పంచ్ పోతరాజు బాబూరావు, పీఏసీఎస్ సీఈవో మధు, నాయకులు సిలివేరు వీరేశం, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు ఉన్నారు.
కొల్చారం, నవంబర్ 9 : రైస్‌మిల్లర్ల యజమానుల తీరుపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ రాస్తారోకో చేపట్టిన ఘటన కొల్చారం మండలంలోని రంగంపేటలో చోటు చేసుకుంది. రంగంపేటలో పీఏసీఎస్ కొనుగోలు కేంద్రం వద్ద లారీల కొరతతో తూకం వేసిన ధాన్యం నిలిచిపోయింది. దీంతో ట్రాక్టర్లలో ధాన్యం తీసుకువస్తామని రైతులు తెలుపగా, రైస్‌మిల్లర్లు ఇం దుకు అంగీకరించలేదు. ఈ మేరకు రైతులు మెదక్-సంగారెడ్డి ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. వీరికి ఎమ్మార్పీఎస్ నాయకులు సంఘీభావం తెలిపారు. రాస్తారొకోతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ఎస్సై శ్రీనివాస్‌గౌడ్, డిప్యూటీ తహసీల్దార్ కిశోర్, ఆర్ఐ శ్రీహరి అక్కడికి చేరుకుని రైతులతో పాటు డీసీఎంఎస్ వైస్ చైర్మన్ అరిగె రమేశ్‌తో మాట్లాడి, రైస్‌మిల్లర్లను ఒప్పించారు. దీంతో రైతులు రాస్తారోకో విరమించారు. కార్యక్రమంలో టీఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు పుర్ర ప్రభాకర్, నాయకులు, రైతులు పాల్గొన్నారు.