వెల్దుర్తి/ నిజాంపేట/ హవేళీఘనపూర్, నవంబర్ 9 : ప్రతి ఊరిలో మత్స్య విప్లవం రావాలని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పిలు పునిచ్చారు. ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న చేప పిల్లలతో గంగపుత్రులు, ముదిరాజ్‌లకు ఆర్థిక భరోసా కల్పిస్తుందని అన్నారు. ప్రభుత్వం పంపిణీ చేసిన చేప పిల్లలు, రొయ్యలను బుధవారం మాసాయిపేట మండలం హక్కీంపేట గ్రామశివారులో ఉన్న హల్దీప్రాజెక్టులో స్థానిక నేతలతో కలిసి వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమృద్ధిగా వర్షాలు కురవడంతోపాటు గోదావరి జలాలతో హల్దీ ప్రాజెక్టు, హల్దీవాగుపై ఉన్న చెక్‌డ్యాంలు ఇప్పటికీ అలుగు పారుతున్నట్లు పేర్కొన్నారు. నిండుకుండలా ఉన్న హల్దీప్రాజెక్టుతోపాటు చె రువులు, కుంటల్లో చేపల పెంపకానికి ప్రభుత్వం కోట్లాది రూ పాయలను వెచ్చించి చేపపిల్లలు, రొయ్యలను పంపిణీ చేస్తు న్నదన్నారు. చేపల పెంపకంతో గంగపుత్రులు, ముదిరాజు కుల స్తులకు చేతినిండి పని దొరుకుతున్నదన్నారు. కుటుంబ పోషణతోపాటు ఆర్థిక భరోసా కలుగుతుందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కులవృత్తులకు పూర్వవైభవం తేవడంతో పాటు గ్రామాల్లోనే స్వయం ఉపాధి కల్పిస్తూ వలసలను నిరోధిస్తుందన్నారు. చేపలను పట్టుకొని విక్రయించడానికి ప్రభుత్వం సబ్సిడీపై వాహనాలను అందజేస్తున్నదన్నారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని గంగపుత్రులు, ముదిరాజ్ కులస్తులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. కార్యక్రమం లో మత్య్సశాఖ డీడీ సుజాత, ఏడీ రజిని, ఎంపీపీ స్వరూప, జడ్పీటీసీ రమేశ్‌గౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు, మాసాయిపేట సర్పంచ్ మధుసూదన్‌రెడ్డి, సర్పంచ్‌లు విఠల్, గోపి, ఎంపీటీసీ సోనీ, నాయకులు నరేందర్‌రెడ్డి, సిద్ధిరాములుగౌడ్, స్టేషన్ శ్రీను, అచ్చంపేట శ్రీను, తహసీల్దార్ మాలతి, ఆర్ఐ ధన్సింగ్, గంగపుత్రులు, మత్స్యకారులు పాల్గొన్నారు.
చేపపిల్లలను సంరక్షించుకుని మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలని నిజాంపేట ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు అన్నారు. నిజాంపేట మండలం చల్మెడలోని సోమయ్య చెరువు, బ్రా హ్మణ చెరువుల్లో మూడు రకాలు (కట్ల-66,660, రోహు-83,250, మ్రిగాల-16,650) మొత్తం 1.70 లక్షల చేపపిల్లలను మత్స్యశాఖ ఏడీ రజినితో కలిసి వదిలారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ మత్స్యకారుల అభివృద్ధే లక్ష్యం గా ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేస్తున్నదన్నా రు. కార్యక్రమంలో సర్పంచ్ నర్సింహారెడ్డి, ఎంపీటీసీ బాల్‌రెడ్డి, ఉప సర్పంచ్ రమేశ్, గంగపుత్ర సంఘం సభ్యులు శ్రీనివాస్, హనుమంత్, భిక్షపతి, అశోక్, స్వామి, తిరుమలయ్య, పంచాయతీ కార్యదర్శి నర్పింహారెడ్డి, ఫీల్డ్‌మన్ భరత్,కంప్యూటర్ ఆపరేటర్ శ్రవణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మత్స్యకారుల అభివృద్ధ్దికి ప్రభుత్వం కృషి చేస్తుందని హవేళీఘనపూర్ ఎంపీపీ శేరి నారాయణరెడ్డి అన్నారు. హవేళీఘనపూర్ పెద్దచెరువులో చేపపిల్లలను వదిలారు. ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేయడంతోపాటు చేపల వలలు, బైకు లను సబ్సిడీపై ఇస్తున్నట్లు, ఈ అవకాశాన్ని మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మత్స్యకారు ల సంఘం సభ్యులు సిద్దయ్య, రమేశ్ పాల్గొన్నారు.