జిల్లా న్యాయ సేవా సాధికార సంస్థ కార్యదర్శి హనుమంతరావు
పటాన్చెరు, నవంబర్9: యువత చట్టాలపై అవగాన కల్పించుకోవాలని జిల్లా న్యాయ సేవా సాధికార సంస్థ కార్యదర్శి జే హనుమంతరావు అన్నారు. బుధవారం పటాన్చెరు మండలం రుద్రారం గ్రామ పరిధిలో గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం హైదరాబాద్ క్యాంపస్‌లో చట్టపరమైన అవగాహన ద్వారా పౌరుల సాధికారత, వారికి చేరువకావడం- దేశవ్యాప్త ప్రచారం అనే అంశంపై విద్యార్థులతో ముఖాముకి నిర్వహించారు.
ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ బాలలు, మహిళలు, అణగారిన వర్గాల హక్కులు, వారి రక్షణ కోసం ప్రభుత్వం తీసుకుని వచ్చిన పలు చట్టాలు, చట్టఫరమైన భద్రతల గురించి జిల్లా న్యాయమూర్తి చర్చించారు. ఏదైన వివాదంలో కోర్టును ఆశ్రయించేవారు, ఒక అవగాహనతో కేసును సత్వరం పరిష్కరించుకోవాలనుకుంటే, పైసా ఖర్చులేకుండా న్యాయ సేవా సాధికర సంస్థ రాజీ కుదురుస్తుందని చెప్పారు.
ఉభయపక్షం అంగీకారంతో ఒక అవగాహనకు వచ్చేలా చేస్తుందన్నారు. కుటుంబ తగాదాలు, ఆస్తి తగాదాలు, విడాకుల కేసులు ఏవైన సత్వర పరిష్కారం కోసం ప్రోత్సహిస్తామన్నారు. కార్యక్రమంలో స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ డైరక్టర్ ప్రొఫెసర్ ఎస్ సునీల్‌కుమార్, స్కూల్ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఎస్ కుమార్ పాల్గొన్నారు.