మెదక్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ) : టీఆర్ఎస్ సర్కారు వైద్య రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నది. రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు అవసరమైన సౌకర్యాలు, పరికరాలతోపాటు మందులను అందుబాటులో ఉంచింది. మెదక్ జిల్లా కేంద్రంలో మాతా శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రం (ఎంసీహెచ్)లో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. జిల్లాతో పాటు పొరుగు జిల్లాలకు చెందిన గర్భిణులు సైతం ఇక్కడికి ప్రసవాల కోసం వస్తున్నారు. రోజుకు 200కి పైగా ఓపీ,(గర్భిణులు) కేసులు నమోదవుతుండగా, 15 వరకు ప్రసవాలు చేస్తున్నారు.
ఏడు నెలలు.. 2323 ప్రసవాలు..
మెదక్ జిల్లా కేంద్రంలో మాతాశిశు సంరక్షణ కేం ద్రం లో ఏప్రిల్ 2022 నుంచి అక్టోబర్ వరకు 2323 ప్రసవాలు జరిగాయి. ప్రతినెలా 300కు పైగా ప్రసవాలు చేశా రు. ఏప్రిల్ నెలలో 186 నార్మల్ డెలివరీలు కాగా, 151 సీ సెక్షన్లు అయ్యాయి. మే నెలలో 163 నార్మల్ డెలివరీలు కాగా, 140 సీ సెక్షన్లు అయ్యాయి. జూన్ నెలలో 146 నార్మల్ కాన్పులు కాగా, 130 సీ సెక్షన్లు అయ్యాయి. జూలై నెలలో 152 నార్మల్ డెలివరీలు కాగా, 156 సెక్షన్లు అయ్యాయి. ఆగస్టు నెలలో 199 నార్మల్ డెలివరీలు కాగా, 139 సీ సెక్షన్లు అయ్యాయి. సెప్టెంబర్ నెలలో 211 నార్మల్ కాన్పులు కాగా, 166 సీ సెక్షన్లు అయ్యాయి. అక్టోబర్ నెలలో 208 నార్మల్ డెలివరీలు కాగా, సీ సెక్షన్లో 176 అయ్యాయి. ఏడు నెలల్లో మొత్తం 1265 నార్మల్ డెలివరీలు కాగా, 1058 సీ సెక్షన్లు అయ్యాయి. మొత్తంగా 2323 కాన్పులు జరిగాయి.
అక్టోబర్‌లో రికార్డు…
ఎంసీహెచ్ అక్టోబర్ నెలలో 384 ప్రసవాలు జరిగి జిల్లా చరిత్రలో రికార్డు సృష్టించింది. ఎంసీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ పర్యవేక్షణలో గైనిక్, చిన్న పిల్లల వైద్యులు, సివిల్ అసిస్టెంట్ సర్జన్ల ఆధ్వర్యంలో మెరుగైన సేవలందిస్తూ నెలకు 300 నుంచి 370 కాన్పులు చేస్తున్నారు.
కార్పొరేట్ సేవలు…
బరువు తక్కువగా, శ్వాస సంబంధిత సమస్యలు, పసిరికలు, ఇన్ఫెక్షన్, ఆయాసం, ఫిట్స్ ఉన్న నవజాత శిశువుల(అప్పుడే జన్మించిన) కోసం ఎస్ఎన్సీయూ వార్డు ఏర్పా టు చేశారు. ఇందులో ఇంక్యుబేటర్లు, వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయి. చిన్న పిల్లల వైద్యులతో పాటు సిబ్బం ది పర్యవేక్షణ 24 గంటల పాటు ఉంటుంది. క్రిటికల్, ఆక్సిజన్ అందని సమయంలో సీ-పాస్ పరికరంతో శ్వాస అం దిస్తూ ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
కేసీఆర్ కిట్.. హిట్..
షాదీముబారక్, కల్యాణలక్ష్మి పథకాలతో పేదింటి కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గించిన రాష్ట్ర ప్రభుత్వం కాన్పులు సైతం సర్కారు దవాఖానల్లో చేసుకునే విధంగా శ్రీకారం చుట్టింది. ఈ మేరకు 2017 జూన్ 2న రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ కిట్ పథకానికి శ్రీకారం చుట్టింది. సర్కారు దవాఖానలో డెలివరీ అయితే ఆడబిడ్డ పుడితే రూ.13వేలు, మగబిడ్డ జన్మిస్తే రూ.12వేలతో పాటు కేసీఆర్ కిట్ అందజేస్తున్నారు. దీంతో నెలకు నెలకు పది కాన్పులు కూడా చేయని పరిస్థితి నుంచి వందల సంఖ్యకు పెరిగాయి.
సురక్షితంగా గమ్యానికి చేర్చడమే లక్ష్యం..
ఎంసీహెచ్ నుంచి డిశ్చార్జ్ అయిన బాలింత, పసిబిడ్డను ఇంటి వద్దకు సురక్షితంగా చేర్చడమే లక్ష్యంగా 102 వాహనాల ద్వారా సేవలు అందిస్తున్నారు. మెదక్ ఎంసీహెచ్‌లో ప్రసవ సేవలు పొంది, డిశ్చార్జ్ అయ్యే వారి వివరాలు 102 టీమ్‌కు చేరుతాయి. 24 గంటలు 108 వాహనం అందుబాటులో ఉంచారు. అత్యవసరమైతే వాహనంలోనే సుఖ ప్రసవం అయ్యేలా అన్ని సౌకర్యాలు కల్పించారు. ప్రసవం తర్వాత దవాఖాన నుంచి తల్లీబిడ్డను క్షేమంగా ఇంటికి చేరేలా 102 వాహనాన్ని అందుబాటులోకి ప్రభుత్వం తీసుకువచ్చింది.
క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణానికి రూ.23.75 కోట్లు
జిల్లా కేంద్రం మెదక్‌లోని ప్రభుత్వ దవాఖానలో క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.23.75 కోట్లు మంజూరు చేసింది. ఇప్పటికే జిల్లా దవాఖానలో ఐసీయూ, డయాలసిస్, నవజాత శిశు కేంద్రం, డయాగ్నోస్టిక్-హబ్, రక్తనిధి వంటి సౌకర్యాలు సమకూర్చారు. ప్రస్తుతం రూ.80 లక్షలతో రేడియాలజీ విభాగాన్ని నిర్మిస్తున్నారు.
పేద ప్రజలకు వరం మాతా శిశు సంరక్షణ కేంద్రం
మెదక్ జిల్లా కేంద్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ పేద ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ వైద్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారు. జిల్లా కేం ద్రంలో నిర్మించిన మాతా శిశు సంరక్షణ కేంద్రంలో ప్రతినెలా 350 నుంచి 400 వరకు ప్రసవాలు జరగడం సంతోషం. రూ.20 కోట్లతో అధునాతన వైద్య పరికరాలు, డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో ఉండి పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు. సర్కారు దవాఖానలో ప్రసవాల్లో రికార్డులు నెలకొల్పుతున్నాయి. ఎంసీహెచ్‌లో ఏడు నెలల వ్యవధిలోనే 2323 కాన్పులు జరిగి జిల్లా చరిత్రలో రికార్డు సృష్టించారు. ఎంసీహెచ్‌లో డెలివరీ అయిన బాలింతలకు కేసీఆర్ కిట్‌ను అందజేస్తున్నారు.
-పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే, మెదక్
నెలకు 400 ప్రసవాలు టార్గెట్
మెదక్‌లోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో నెలకు 400 వరకు ప్రసవాలు చేయాలనే లక్ష్యంతో రాష్ట్రం లో మొదటి స్థానంలో నిలుపాలనే ప్రయత్నం చేస్తు న్నాం. అక్టోబర్ నెలలో 384 ప్రసవాలతో మెదక్ జిల్లా చరిత్రలో రికార్డు సృష్టించాం. వైద్యులు, సిబ్బం ది సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. పేద కుటుంబాలు ప్రైవేట్ దవాఖానలో ఫీజులు భరించే పరిస్థితి లేకపోవడంతో ప్రసవాల కోసం ఇక్కడికి వచ్చే గర్భిణులకు మెరుగైన సేవలందిస్తున్నాం.
-డాక్టర్ చంద్రశేఖర్, సూపరింటెండెంట్, ఎంసీహెచ్