రేగోడ్, నవంబర్ 8: మండలంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్యెల్యే క్రాంతికిరణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్యెల్యే మాట్లాడుతూ రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని సూచించా రు. సీఎం కేసీఆర్ మాత్రమే రైతుల పక్షపాతిగా వ్యవహరించారని రైతుల కోసం ప్రత్యేకంగా రైతుబీమా, రైతుబంధు పథకాలను అమలు చేసి అండగా నిలిచారన్నారు. కార్యక్ర మం లో తహసీల్దార్ లక్ష్మణ్, పీఏసీఎస్ చైర్మన్ రాజు యాదవ్, వైస్ చైర్మన్ రాధాకిషన్ ఉన్నారు.
టీఆర్ఎస్ రైతు ప్రభుత్వం
సీఎం కెసీఆర్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నా రు. మండలంలోని బొడ్మట్‌పల్లిలో ఐకేపీ ఆధ్వర్యంలో ధా న్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు మద్దతు ధర కల్పించడం కోసమే కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నారని, రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేస్తున్నట్లు తెలిపా రు. కార్యక్రమంలో ఎంపీపీ చింత స్వప్న రవి, సర్పంచ్‌లు సుప్రజాభాస్కర్, స్వరూప, సాయిలు, నారాయణ, యాద య్య, సత్యనారాయణ, ఏఎంసీ డైరెక్డర్ శ్రీనివాస్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వీరప్ప, ప్రధాన కార్యదర్శి అవినాష్ పాల్గొన్నారు.
రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
రైతు సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ఇబ్రహీంపూర్ సొసైటీ చైర్మన్ వంటరి కొండల్‌రెడ్డి, రైతుబంధు జిల్లా డైరెక్టర్ చేర్యాల మోహన్‌రెడ్డి, ఎంపీటీసీ బింగి గణేశ్ పేర్కొన్నారు. మండలంలోని ఇబ్రహీంపూర్ సొసైటీలోని గొల్లపల్లి లో మంగళవారం ధాన్యం కొ నుగోలు కేంద్రాన్ని స్థానిక నా యకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు పం డించిన పంటకు ప్రభుత్వం మద్దతు ధర కల్పించి వారి అభివృద్ధికి కృషి చేస్తున్నదన్నారు. ఆర బెట్టిన ధాన్యాన్ని కేం ద్రాలకు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ఎల్లారెడ్డి, సొసైటీ వైస్ చైర్మన్ పట్నం తానిషా, డైరెక్టర్ చెర్యాల సం జీవరెడ్డి, ఉప సర్పంచ్ వెంకటస్వామి, వార్డు సభ్యులు అంజ య్య, స్వామి, బాల్‌రెడ్డి ఉన్నారు.
కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. మండలంలోని గడిపెద్దాపూర్, ముస్లాపూర్‌లో ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధా న్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఎమెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ గ్రేడ్ ధా న్యానికి రూ. 2060, బీ గ్రేడ్ ధాన్యానికి రూ. 2040 ప్రభు త్వం మద్దతు ధర నిర్ణయించిందన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులకు సరిపడా సంచులు, టార్పలిన్లు, తేమ నియంత్రణ యంత్రాలను సిద్ధంగా ఉంచాలన్నారు. కొనుగోలు కేంద్రంలో రైతులు వచ్చి ధాన్యం అమ్మిన వెంటనే రైతు వివరాలు, బ్యాంకు అకౌంట్ నంబరు, అమ్మిన ధాన్యం తూకం వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఏవైనా ఇబ్బందులు ఉంటే అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కాశీనాథ్, పీఏసీఎస్ చైర్మన్ దుర్గారెడ్డి, ఏపీఎమ్ నాగరాజు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నర్సింహులు, ఎంపీడీవో విజయభాస్కర్‌రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నదని ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, పీఏసీఎస్ చైర్మన్ వెంకటరాంరెడ్డి అన్నారు. మండలంలోని పిల్లు ట్ల, కొత్తంపేట, లింగోజిగూడ, రూప్లతండా గ్రామాల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధరను పొందాలన్నారు. కార్యక్రమంలో ఆత్మకమిటీ చైర్మన్ గొర్రె వెంకట్‌రెడ్డి, వైస్ ఎంపీపీ రమాకాంత్‌రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల కోశాధికారి బండారి గంగాధర్, సర్పంచ్‌లు పెద్దపులి రవి, రవినాయక్, జిల్లా రైతుబంధు సమితి డైరెక్టర్ రవినాయక్, సీనియర్ నాయకులు చింతస్వామి, ఏవో మౌనిక, పీఏసీఎస్ సీఈవో మధు ఉన్నారు.