బాదె చంద్రంరామాయంపేట, నవంబర్ 7: రైతులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ ఊరూరా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నారని రామాయంపేట పీఏసీఎన్ చైర్మన్ బాదె చంద్రం, సర్పంచ్ పంబాల జ్యోతి అన్నా రు. సోమవారం ఝాన్సిలింగాపూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించి మాట్లాడారు. రైతులకు గిట్టుబాటు ధర ను కల్పించేందు కోసమే కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నామన్నారు. అనంతరం పట్టణంలోని హరిజన కాలనీలో ఉన్న కొనుగోలు కేంద్రాన్ని చైర్మన్‌తో పాటు మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్‌గౌడ్, ఏఎంసీ చైర్మన్ సరాఫ్ యాదగిరి పరిశీలించారు. కార్యక్రమంలో రైతుబంధు అధ్యక్షుడు నర్సారెడ్డి, మాజీ సర్పంచ్ రామకిష్టయ్య, వార్డు సభ్యులు మానెగల్ల వెం కటి, పోచయ్య, సాలెమన్, సీఈవో నర్సింహులు, శ్రీనివాస్, సభ్యులు పాల్గొన్నారు.
మనోహరాబాద్, నవంబర్ 7 : సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి అని మెదక్ జడ్పీ చైర్పర్సన్ ర్యాకల హేమలతాశేఖర్‌గౌడ్ అన్నారు. సోమవారం మండలంలోని పోతారంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పురం మహేశ్ ముదిరాజ్, రాజరమణగౌడ్, శివ్వంపేట పీఏసీఎస్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి, ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, వైస్ ఎంపీపీ విఠల్‌రెడ్డి, సర్పంచ్‌లు మాధవరెడ్డి, పూల అర్జున్, నాగభూషణం, ఉప సర్పంచ్ వీరే శ్, నాయకులు వెంకటేశ్‌గౌడ్, భిక్షపతి, పురం రవి, ఇర్ఫాన్ పాల్గొన్నారు.
నర్సాపూర్, నవంబర్7: కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి రైతులు మద్ధతు ధర పొందాలని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి సూచించారు. మండలంలోని ఖాజీపేట్, మంతూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రా రంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి పండించిన పంటను దళారులకు విక్రయించి మోసపోవద్దన్నారు. రైతులు ఎలాంటి ఆందోళ న చెందవద్దని, చివరి గింజ వరకు కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. రైతులు సంయమనం పాటించి ధాన్యా న్ని విక్రయించాలని సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు అశోక్‌గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ నయీమొద్దీన్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు భిక్షపతి, నాయకులు మదన్మోహన్, నగేశ్, ఆంజనేయులుగౌడ్ పాల్గొన్నారు.
పెద్దశంకరంపేట, నవంబర్ 7: గ్రామాల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఏవో రాజేశ్ అన్నారు. సోమవారం మండలంలోని రామోజిపల్లి, వీరోజిపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు.రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చే సమయంలో ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతా జిరాక్స్ కాఫీలను తీసుకరావాలన్నారు. ధాన్యాన్ని దళారులకు విక్రయించకుం డా ప్రభత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలన్నారు.
మెదక్ మున్సిపాలిటీ, నవంబర్ 7: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించి రైతులు మద్దతు ధర పొందాలని పీఏసీఎస్ చైర్మన్ హనుమంత్‌రెడ్డి, మున్సిపల్ వైస్‌చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్ అన్నారు. సోమవా రం పట్టణంలోని నవాబుపేట వీధిలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారన్నారు. రైతుల పండించిన పంటకు మద్దతు ధర కల్పించి రైతుల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ లక్ష్మి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
తూప్రాన్, నవంబర్ 7: రైతులకు కనీస మద్దతు ధరను అందించేందుకే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని ఘనపూర్, యావాపూర్, నర్సంపల్లి, కిష్టాపూర్, వెంకటాయపల్లి, గుండ్రెడ్డిపల్లి, దాతర్పల్లి, ఇస్లాంపూర్, వట్టూర్లలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ గడ్డి స్వప్న వెంకటేష్ యాదవ్, జడ్పీటీసీ రాణి సత్యనారాయణగౌడ్, మండల అధ్యక్షుడు బాబుల్‌రెడ్డి, సర్పంచుల ఫో రం వర్కింగ్ ప్రెసిడెంట్ మహిపాల్‌రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.
చేగుంట, నవంబర్ 7: ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని చందాయిపేట సర్పం చ్ స్వర్ణలత పేర్కొన్నారు. మండలంలోని చందాయిపేటలో సోమవారం ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
చిలిపిచెడ్, నవంబర్ 7: కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర లభిస్తున్నదని ఏఈవో కృష్ణవేణి అన్నారు. మండలంలోని చండూర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఏఈవో మాట్లాడుతూ రైతు లు ధాన్యంలో తాలు, మట్టి, పొలు లేకుండా కొనుగోలు కేంద్రాలకు తీసుకరావాలన్నారు. కార్యక్రమంలో సోమక్కపేట పీఎసీఎస్ డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, రైతులు ఉన్నారు.