రామచంద్రాపురం/రేగోడ్, నవంబర్7: రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందిన ఘటన ఆర్సీపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని డీమార్ట్ సమీపంలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. రేగోడ్ మండలం ప్యారారం గ్రామానికి చెందిన రేషన్ డీలర్ విఠల్ పెద్ద కుమారుడు ప్రేమ్‌కుమార్ (25) ఆర్సీపురం డివిజన్లోని శ్రీనివాస్‌నగర్‌కాలనీలో నివాసం ఉంటు న్నాడు.
స్థానిక బైక్ షోరూంలో సేల్స్ ఎగ్జిక్యూటీవ్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో అతను తన పల్సర్ (టీఎస్35 ఎఫ్7017)పై ఆర్సీపురానికి వస్తున్న క్రమంలో డీమార్ట్ సమీపంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ప్రేమ్‌కుమార్ తలకు తీవ్రగాయమైంది. స్థానికు లు అతడిని పటాన్చెరు ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అక్కడి డాక్టర్లు పరిశీలించి అతడు మృతి చెందినట్లు వెల్లడించారు. ఈ మేరకు మృతుడి తండ్రి విఠల్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నర్సాపూర్, నవంబర్7: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన నర్సాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొండాపూర్ గ్రామ సమీపంలో సోమవారం జరిగింది. ఎస్సై గంగరాజు కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లా కారంచెడు మండలం, కొండనలి వారిపాలెం గ్రామానికి చెందిన చిరుమల వీరేశ్(26) హైదరాబాద్‌లోని జీడిమెట్లలో ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆదివారం తన తోటి ఉద్యోగులతో కలిసి ఏడుపాయల వనదుర్గామాతను దర్శించుకోడానికి వచ్చారు.
అక్కడ నుంచి తిరుగు ప్రయాణం చేస్తుండగా నర్సాపూర్ మండలం కొండాపూర్ బస్టాండ్ సమీపంలో ఎదురుగా వస్తున్న స్కార్పియో (ఏపీ 31 బీజే 6747)ను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో వీరేశ్‌కు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ప్రయాణిస్తున్న తోటి ఉద్యోగులు రాజ్‌కుమార్, సాయిలు, శ్రీకాంత్‌కు తీవ్రగాయాలయ్యాయి. మెదక్ జిల్లా, నార్సింగి గ్రామానికి చెందిన బాలకృష్ణ ఈ ప్రమాదానికి కారకుడు. అతడిపై చర్యలు తీసుకోవాలని మృతుడి తండ్రి సుగుణరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
గుమ్మడిదల, నవంబర్7: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన గుమ్మడిదల పోలీస్‌స్టేషన్ పరిధిలోని నల్లవల్లి అటవీ ప్రాంతంలో జరిగింది. ఏఎస్సై డీఎస్ రాజు కథనం ప్రకారం.. కుత్బుల్లాపూర్‌కు చెంది న పల్లెపోలు రామకృష్ణ (52), అతని సన్నిహితుడు భిక్షపతితో కలిసి సోమవారం పచ్చకామెర్ల మందుకోసం బైక్‌పై కుత్బుల్లాపూర్ నుంచి పిట్లం గ్రామానికి బయలు దేరారు. ఉదయం 9:30 గంటల సమయంలో గుమ్మడిదల మండలం మీదుగా నల్లవల్లి అటవీ ప్రాంతం వద్దకు చేరుకోగా మోటర్‌సైకిల్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న రోలింగ్‌ను ఢీకొట్టారు. రామకృష్ణ తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందా రు. భిక్షపతికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో క్షతగ్రాతుడిని స్థానిక దవాఖానకు తరలించారు. మృతుడి కుమారుడు నిఖిల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు.