మెదక్ అర్బన్, నవంబర్6: ఆర్టీసీ చైర్మన్‌గా గోవర్దన్ రెడ్డి, ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రైవేట్‌కు దీటుగా ఆర్టీసీ సంస్థ దూసుకుపోతున్నది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు నూతనంగా ఆలోచించి మరింత చేరువవుతున్నది. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, ఇప్పుడు ఆన్లైన్ పే మెంట్‌కూడా చేయవచ్చు. ఆర్టీసీ సంస్థ ప్రయాణికుల సౌకర్యర్థం ఫోన్ పే, గూగుల్ పే ద్వారా టికెట్ బుకింగ్ చేసుకునే అవకాశాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. మెదక్ డిపోలో మెదక్ నుంచి తిరుపతి వెళ్లే సూపర్ లగ్జరీ బస్సుల్లో ఆన్లైన్ బుకింగ్‌తో పాటు ప్రయాణికులు బస్సు ఎక్కేటప్పుడు కూడా ఆర్టీసీ ఐ-టీమ్ మిషన్‌లో క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడంతో టికెట్ బుకిం గ్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. మెదక్ నుంచి తిరుపతికి ఒక ప్రయాణికుడికి రూ.1190 కాగా, కొండపై వెంకన్న దర్శనంతో కూడా కలిపి రూ.1800 తీసుకుంటున్నారు. క్యూఆర్ కోడ్ ద్వారా ఈ టికెట్‌కు పే మెంట్ చేయవచ్చు. ఈ అవకాశం మెదక్ ఆర్టీసీ డిపోలోని మెదక్ నుంచి తిరుపతి, తిరుపతి నుంచి మెదక్ వచ్చే బస్సుల్లో కల్పించారు. దీంతో ప్రయాణికులకు చిల్లర కష్టాలు తీరాయి.
ప్రయాణికులకు మంచి అవకాశం..సద్వినియోగం చేసుకోవాలి
మెదక్ నుంచి తిరుపతి, తిరుపతి నుంచి మెదక్ వచ్చే ప్రయాణికులకు ఐ-టిమ్ మిషన్‌లోని క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి స్మార్ట్ ఫోన్ ద్వారా ఫోన్-పే, గూగుల్-పే ద్వారా టికెట్ బుకింగ్ చేసుకునే అవకాశం ఆర్టీసీ సంస్థ మెదక్ డిపో కల్పించింది. దీంతో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తమ టికెట్ బుకింగ్ చేసుకుని ప్రయాణించవచ్చు. -రవిచందర్, ఆర్టీసీ డిపో మేనేజర్, మెదక్