సంగారెడ్డి అక్టోబర్ 6(నమస్తే తెలంగాణ): మునుగోడులో టీఆర్ఎస్ విజయం ఖాయమైన వెంటనే సంగారెడ్డి జిల్లాలో సంబురాలు మొదలయ్యాయి. మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి 10వేలపై చిలుకు మెజార్టీతో విజయదుందుభి మోగించడంతో సంగారెడ్డి జిల్లాలోని టీఆర్ఎస్ శ్రేణులు సంబురాల్లో మునిగిపోయాయి. మునుగోడులో టీఆర్ఎస్ విజయానికి వ్యూహారచన చేసిన సీఎం కేసీఆర్‌కు టీఆర్ఎస్ నాయకులు జేజేలు కొట్టారు. కేసీఆర్ జిందాబాద్, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) జిందాబాద్ అంటూ వేడుకల్లో పాల్గొన్న నాయకులు భారీగా నినాదాలు చేశారు. మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలు ఆదివారం రాత్రి వెలువడింది. టీఆర్ఎస్ విజయం ఖాయమైందని తెలిసిన వెంటనే టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పటాకులు కాల్చి, మిఠాయిలు పంచిపెడుతూ సంబురాలు చేసుకున్నారు. జోగిపేటలో విజయోత్సవాల్లో స్థానిక ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌తోపాటు వేడుకల్లో ఎంపీపీ బాలయ్య, వైస్ ఎంపీపీ మహేశ్వర్‌రెడ్డి, మున్సిపల్‌వైస్‌చైర్మన్ ప్రవీణ్, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. రాయికోడ్, వట్పల్లి మండల కేంద్రాల్లో టీఆర్ఎస్ నాయకులు సంబురాలు నిర్వహించారు. పటాన్చెరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద నాయకులు నిర్వహించిన సంబురాలు అంబరాన్నంటాయి. ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పార్టీ నాయకులతో కలిసి పటాకులు కాల్చుతూ, స్వీట్లు పంచిపెట్టారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పటాన్‌చెరులోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన వేడుకల్లో కార్పొరేటర్ మెట్టుకుమార్‌యాదవ్, నాయకులు గడీల కుమార్‌గౌడ్, శ్రీధర్‌చారి పాల్గొన్నారు. రామచంద్రాపురంలో కార్పొరేటర్లు పుష్పనగేశ్, సింధు ఆదర్శ్‌రెడ్డి ఆధ్వర్యంలో సంబురాలు జరిగాయి. పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామంలో నిర్వహించిన వేడుకల్లో రాష్ట్ర నాయకుడు నీలం మధు ముదిరాజ్ పాల్గొన్నారు. జిన్నారం, బొల్లారంలో టీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో టీఆర్ఎస్ సంబరాలు అంబరాన్నంటాయి. టీఆర్ఎస్ నాయకులు పట్టణంలోని ప్రభుత్వ అతిథి గృహం ఎదుట విజయోత్సవ సంబురాలు జరుపుకొన్నారు. కార్యక్రమంలో నాయకులు బీరయ్యయాదవ్, ఆర్.వెంకటేశ్వర్లు, నక్కనాగరాజుగౌడ్, నర్సింలు, ప్రభుగౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, ఎస్కే.రశీద్, శ్రావణ్‌రెడ్డి పాల్గొన్నారు. నారాయణఖేడ్‌లోని రాజీవ్‌చౌక్ వద్ద టీఆర్ఎస్ విజయోత్సవాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు పరమేశ్వర్, నజీబ్, మున్సిపల్‌వైస్‌చైర్మన్ పరశురాం, మార్కెట్ వైస్‌చైర్మన్ విజయ్‌బుజ్జి, కౌన్సిలర్లు పాల్గొన్నారు. సిర్గాపూర్, కంగ్టి, నాగల్గిద్ద ఘనంగా సంబురాలు నిర్వహించారు. జహీరాబాద్‌లో టీఆర్ఎస్ నాయకుడు మోయినోద్దిన్ ఆధ్వర్యంలో , న్యాల్కల్, ఝరాసంగం, కోహీర్ మండల కేంద్రాల్లో సంబురాలు అంబరాన్నంటాయి.