మెదక్ మున్సిపాలిటీ, నవంబర్ 3: మనఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ బడులకు మంచి రోజులు వస్తున్నాయి. విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ముందుకెళ్తున్నది. సర్కార్ బడులకు సకల హంగులు కల్పించి కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ‘మనఊరు-మనబడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పాఠశాలల్లో పనులు చేపట్టేందుకు విద్యాశాఖ అధికారులు ప్రణాళికను రూపొందించి ప్రభుత్వానికి నివేదిక అందజేయడంతో రూ. 5కోట్లు నిధులు జిల్లాకు మం జూరు చేసింది . జిల్లాలోని 21 మండలాల పరిధిలో 898 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా ఇందులో ప్రాథమిక పాఠశాలలు 128, ప్రాథమికోన్నత పాఠశాలలు 624, ఉన్నత పాఠశాలలు 146 ఉన్నాయి. తొలి విడతలో 313పాఠశాలలను ఎంపిక చేసింది. ఎంపికైన పాఠశాలలను మౌలిక సదుపాయల కల్పనకు సంబంధించి అవసరమైన ప్రతిపాదనలతో అంచనా నివేదికలు సమర్పించడంతో పనులు ప్రారంభించారు. అవసరమైన మౌలిక సదుపాయల కల్పనకు సంబంధించిన పనులను చేపడుతున్నారు. నిధులను ఆయా పాఠశాలల బ్యాంకు ఖాతాల్లో జమ చేసే ప్రకియ పూర్తి చేశారు. రానున్న మూడేండ్లలో ప్రతి ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు పూర్తిగా మార్చేలా ప్రభుత్వం ప్రగతి ప్రణాళికను సిద్ధం చేసింది. మొదటి విడుతలో జిల్లా వ్యాప్తంగా గల ప్రభుత్వ పాఠశాలల్లో ఎంపిక చేసిన 33శాతం పాఠశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయలను వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం లోగా పూర్తి చేయనున్నారు.
12 రకాల మౌలిక వసతులు..
విద్యాశాఖ ఎంపిక చేసిన పాఠశాలల్లో 12 రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నారు. కార్పొరేట్‌స్థాయి పాఠశాల భవనాలను తలదన్నేలా తీర్చిదిద్దేందుకు ఇంజినీరింగ్ అధికారులు ప్రతిపాదనలు తయారు చేశారు. జిల్లాలో తొలి విడు త లో ఎక్కువ మంది (700 నుంచి వెయ్యి వరకు) విద్యార్థులు ఉండి సరైన వసతు లు లేని పాఠశాలలను ఎంపిక చేయడం జరిగింది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రారంభించడంతో పాటు మౌలిక వసతులు కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
సదుపాయాలు
‘మనఊరు-మనబడి’ పథకం కింద ఎంపిక చేసిన పాఠశాలల్లో ముఖ్యంగా నీటి వసతితో కూడిన మరుగుదొడ్లు, విద్యుత్, తాగునీటి సౌకర్యం, అవసరమైన ఫర్నిచర్, పెయింటింగ్, మరమ్మతులు, గ్రీన్ చాక్ బోర్డులు, ప్రహరీ, వంటగది, అదనపు తరగతి గదులు, ఉన్నత పాఠశాలల్లో డ్రైనింగ్ హాల్, డిజిటల్ విద్య అమలుకు అవసరమైన పాఠశాలల్లో చేపడుతున్నారు.
240 పాఠశాలల్లో పనులు ప్రారంభం..
విద్యశాఖలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిన సీఎం కేసీఆర్ ఆ దిశగా చర్యలను ముమ్మరం చేసింది. మనఊరు-మనబడి కార్యక్రమం కింద మొదటి విడతలో 33శాతం పాఠశాలలను ఎంపిక చేయగా, మరో రెండేండ్లలో మిగతా అన్ని ప్రభు త్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నది. మొదటి విడుతలో జిల్లాలో ఎంపికైన 313 పాఠశాలల్లో ప్రాథమిక పాఠశాలలు 44, ప్రాథమికోన్నత పాఠశాలలు 180, ఉన్నత పాఠశాలలు 89ఉన్నాయి. విద్యార్థులు ఎక్కువగా గల పాఠశాలలను పరిగణలోకి తీసుకొని తొలి విడుతలో ఎంపిక చేశారు. వీటిలో 240 పాఠశాలల్లో పనులు ప్రారంభించారు. 100పాఠశాలల్లో పనులు పూర్తి చేసినంత వరకు బిల్లులు సైతం చెల్లించారన్నారు.
ఎంపిక చేసిన పాఠశాలల ప్రధానోపాధ్యాయుల నుంచి సదుపాయాల వివరాలు సేకరించిన తరువాతనే పనులు ప్రారంభించారు. మౌలిక సదుపాయాల కల్పన పనులను సర్వశిక్షా అభియాన్ ఆధ్వర్యంలో చేపడుతున్నారు. రాను న్న విద్యా సంవత్సరంలో మిగతా 585పాఠశాలలకు సంబధించి ఎంత బడ్జెట్ అవసర మో దానిపై జిల్లా విద్యాశాఖ అధికారులు అంచనా తయారు చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.
త్వరలో పనులు పూర్తి చేస్తాం
మనఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో ప నులు త్వరలో పూర్తి చేస్తాం. తొలి విడుతలో 313 పాఠశాలలు ఎంపి క కాగా జిల్లాకు రూ.5కోట్ల నిధు లు ప్రభుత్వం విడుదల చేసింది. ఎంపికైనా పాఠశాలలకు అవసరమయ్యే నిధులను ఆయా పాఠశాలల బ్యాంకుల ఖాతాల్లో జమ చేశారు. 240పాఠశాలల్లో పనులు జరుగుతున్నాయి. 50శాతానికి పైగా పనులు పూర్తి చేసిన పాఠశాలల్లో బిల్లులు చెల్లించాం. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా కార్పొరేట్ తరహాలో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోంది.
– రమేశ్‌కుమార్, డీఈవో మెదక్