జహీరాబాద్, నవంబర్ 2 : కర్ణాటక, మహారాష్ట్రకు సమీపంలో ఉన్న జహీరాబాద్ రైల్వే స్టేషన్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రతి రోజూ జహీరాబాద్ రైల్వే స్టేషన్ నుంచి వందలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన నేరాస్తులు, జహీరాబాద్ ప్రాంతంలో నేరాలు చేసి తప్పించుకుంటున్నారని, వారిని గుర్తించేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని రైల్వే శాఖకు పోలీసు అధికారులు లేఖ రాయడంతో వారు స్పందించారు.
రాష్ట్ర సరిహద్దులో ఉన్న రైల్వే స్టేషన్ నుంచి పలు రాష్ర్టాలకు రైలు రాకపోకలు సాగిస్తాయి. రైల్వేస్టేషన్లో సీసీ కెమెరాలు లేకపోవడంతో దొంగలను గుర్తించేందుకు పోలీసులకు సరైన సమాచారం ఉండటం లేదు. దీంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో నేరాస్తులను గుర్తించే ఆవకాశముందని పోలీసులు భావించారు. ఒక సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానంగా పోలీసులు భవిస్తారు. రైల్వే స్టేషన్‌కు నాలుగు వైపులా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేశారు. సీసీ కెమెరాలను డీఎస్పీ రఘు ప్రారంభించారు.
పోలీసు శాఖ ఆధ్వర్యంలో ..
జహీరాబాద్ పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో నాలుగు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, రైల్వే స్టేషన్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. రైల్వే శాఖ ఆధ్వర్యంలో ఆరు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు స్టేషన్ మాస్టర్ మాధవకృష్ణ ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించారు. రైల్వే శాఖ అధికారుల నుంచి ఆనుమతులు రాగానే కొత్తగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని రైల్వే అధికారులు తెలిపారు. స్టేషన్ ఎదుట భా గంతో పాటు స్టేషన్ లోపల ఇరువైపులా కెమెరాలు ఏర్పాటు చేశారు. రైల్వేస్టేషన్‌కు వచ్చే ప్రధాన వైపులా కెమెరాలు ఏర్పాటు చేయడంతో నేరాలు నివారించే వీలుందని పోలీసులు భావిస్తున్నారు. జహీరాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రతి రోజూ కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలకు రైలు రాకపోకలు సాగిస్తాయి.
సీసీ కెమెరాలతో ఎంతో ఉపయోగం..
రైల్వేస్టేషన్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో నేరాస్తులను గుర్తించే అవకాశమున్నది. జహీరాబాద్ ప్రాంత్రానికి ఎక్కువగా ఇతర రాష్ట్రాల ప్రజలు జీవనోపాధి కోసం వస్తున్నారు. దొంగతనాలు జరిగిన సమయంలో కొంత మంది దొంగలు గతంలో రైలులో ప్రయాణం చేసిన సంఘటనలు ఉన్నాయి. నేరాస్తులను గుర్తించేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదం చేస్తాయి.
-శ్రీకాంత్, ఎస్సై, జహీరాబాద్
ఆరు కెమెరాలు ఏర్పాటు చేస్తాం..
రైల్వే శాఖ ద్వారా ఆరు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు అధికారులకు ప్రతిపాదనలు పంపించాం. ఉన్నతాధికారుల నుంచి అనుమతి రాగానే కొత్తగా కెమెరాలు ఏర్పాటు చేస్తాం. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో రైల్వేస్టేషన్లో భద్రత పెరిగింది. ప్రయాణికుల విలువైన వస్తువులు దొంగతనం చేసిన దొంగలను గుర్తించే అవకాశమున్నది. జహీరాబాద్ పోలీసుల సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం.
-మాధవకృష్ణ,స్టేషన్ మాస్టర్, జహీరాబాద్