పెద్దశంకరంపేట/ అల్లాదుర్గం/ రేగోడ్, నవంబర్ 2 : గ్రామీ ణ ప్రాంతాల్లో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రజలకు మెరుగైన సేవలను వైద్య, ఆరోగ్య సిబ్బందిని జిల్లా వైద్యాధికారిని విజయనిర్మల ఆదేశించారు. పెద్దశంకరంపేట ప్రభుత్వ దవాఖానను బుధవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేసి, రికార్డులను పరిశీలించారు. దవాఖానలోని ప్రసూతిగది, వ్యా క్సిన్ గది, ల్యాబ్, నూతన భవనాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి విజయనిర్మల మాట్లాడారు. సబ్సెంటర్లలో ప్రజలకు అవసరమైన మందులు అందుబాటు లో ఉన్నాయా? అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
పెద్దశంకరంపేట మండల వైద్యాధికారిపై ఫిర్యాదులు రావడంతో చిన్నశంకరంపేట మండల వైద్యాధికారిని ఇన్చార్జిగా నియమిం చినట్లు పేర్కొన్నారు. పెద్దశంకరంపేట మండలానికి త్వలోనే నూతన వైద్యాధికారిని నియమిస్తామన్నారు. పెద్దశంకరంపేట పట్టణ పీహెచ్సీ దవాఖానలో ప్రసవాల సంఖ్య మెరుగ్గా ఉం దని, దవాఖానకు వచ్చిన రోగులకు నాణ్యమైన సేవలు అందిస్తున్నారని వైద్యసిబ్బందిని అభినందించారు. జిల్లా వైద్యాధికారి తర్వాత తొలిసారిగా పెద్దశంకరంపేటకు రావడంతో వైద్య సిబ్బంది సన్మానించారు. కార్యక్రమంలో పోగ్రాం ఆఫీసర్ నవీన్‌కుమార్, వైద్యాధికారి సారిక, సిబ్బంది భూమయ్య, సాయిలు, రామ్మోహన్, వెంకటేశం, శివప్రసాద్, సంపూర్ణ, శ్రీదేవి, కమల ఉన్నారు.
సమయపాలన పాటించాలి
ప్రభుత్వ దవాఖానకు వచ్చే రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని జిల్లా వైద్యాధికారి విజయనిర్మల అన్నారు. అల్లాదుర్గం ప్రాథమిక ఆరోగ్యకేంద్రా న్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దవాఖానలోని రికార్డులు, వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. దవాఖాన కు వచ్చే రోగులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఆరోగ్య సిబ్బంది సమయ పాలన పాటిస్తూ రోగులకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఆమె వెంట వైద్యాధికారి దివ్యజ్యోతి ఉన్నారు.
ప్రజలకు నిరంతర వైద్యసేవలు
రేగోడ్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో రోగులకు నిరంతరం వైద్యసేవలు అందించాలని సిబ్బందికి జిల్లా వైద్యాధికారి విజయనిర్మల సూచించారు. ఆరోగ్యకేంద్రంలో రికార్డులను పరిశీలించి, ఇన్ పేషంట్ వివరాలు తెలుసుకున్నారు. ఆమె వెంట వైద్యులు సబితాపాటిల్, శ్వేత, సిబ్బంది ఈశ్వర్ ఉన్నారు.