రామాయంపేట, నవంబర్ 2 : సీఎం కేసీఆర్ రైతన్నల సంక్షేమానికి కృషి చేస్తున్నారని, ఇందులో భాగంగా దళారుల వద్దకు వెళ్లకుండా గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు కేంద్రాల ను ఏర్పాటు చేస్తున్నారని పీఏసీఎస్ చైర్మన్ చంద్రం న్నారు. బుధవారం రామాయంపేట మార్కెట్ యార్డులో ధాన్యం కొ నుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ఇబ్బందులు పడకూడదనే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. రైతు లు కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి, మద్దతు ధర పొందాల ని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్‌గౌడ్, వైస్ చైర్పర్సన్ విజయలక్ష్మి, ఏఎంసీ చైర్మన్ యాదగిరి, ఎంపీపీ భిక్షపతి, వైస్ ఎంపీపీ రాజిరెడ్డి, కౌన్సిలర్లు యా దగిరి, అనిల్, మున్సిపల్ కమిషనర్ ఉమాదేవి, ఏడీఏ వసం తసుగుణ, తహసీల్దార్ మన్నన్, ఆర్ఐ రాజు, ఏవో రాజ్‌నారాయణ సీఈవో నర్సింహులు, ఏఎంసీ కార్యదర్శి జ్ఞానేశ్వర్, సూపర్వైజర్లు హనుమాడ్లు, శ్రీనివాస్ పాల్గొన్నారు.
రామాయంపేట మండలం కోనాపూర్‌లో పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ భిక్షపతి, సర్పంచ్ చంద్రకళ ప్రారంభించారు. కార్యక్రమంలో సీఈవో మల్లారెడ్డి, మాజీ ఎంపీటీసీ సంజీవరెడ్డి, సర్పంచ్ కుతాడి భిక్షపతి, డైరెక్టర్లు, నాయ కులు ఇమ్మానియేల్, విద్యాసాగర్ తదితరులు ఉన్నారు.
రైతులకు అండగా ప్రభుత్వం : ఎంపీపీ సిద్ధిరాములు
నిజాంపేట, నవంబర్ 2 : రైతులకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తూ అండగా నిలుస్తున్నదని ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు అన్నారు. నిజాంపేట మండలం వెంకటాపూర్(కె) గ్రామంలో ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కొ నుగోలు కేంద్రాల ఏర్పాటుతో దళారుల వ్యవస్థ పూర్తిగా కనుమరుగైందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ అనిల్‌కుమార్, ఏపీఎం వెంకటస్వామి, మండల కోఆప్షన్ సభ్యుడు గౌస్, నాయకులు దయాకర్, నందు పాల్గొన్నారు.
దళారులకు విక్రయించొద్దు : చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి
చిన్నశంకరంపేట, నవంబర్ 2 : రైతులు ఆరుగాలం కష్టిం చి పండించిన పంటను దళారులకు విక్రయించి మోసపోవద్దని జంగారాయి పీఏసీఎస్ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. జంగరాయి సొసైటీ ఆధ్వర్యంలో చందాపూర్, జంగరాయి, గవ్వలపల్లి, కొర్విపల్లి, అంబాజిపేట గ్రామాల్లో ఏర్పాటు చే సిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. మడూర్ సొసైటీ ఆధ్వర్యంలో మడూర్, టి.మందాపూర్, గజగట్లపల్లి, ఎస్.కొండాపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు. చిన్నశంకరంపేట సహకార సంఘం ఆధ్వర్యంలో మల్లుపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తహసీల్దార్ రాజేశ్వర్‌రావు, ఎంపీడీవో గణేశ్‌రెడ్డి, చైర్మన్ అంజిరెడ్డి ప్రారంభించారు. పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు జ్యోతి, రమాదేవి, లక్ష్మి, మంగాదేవి, పద్మ, ఏవో శ్రీనివాస్ ఉన్నారు.
రైతు సంక్షేమమే ధ్యేయం : మార్కెట్ చైర్మన్ జగపతి
హవేళీఘనపూర్, నవంబర్ 2 : రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మెదక్ మార్కెట్ క మిటీ చైర్మన్ జగపతి అన్నారు. తొగిట, బి.తిమ్మాయిపల్లి, లిం గ్సాన్పల్లి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ శేరి నారాయణరెడ్డి ప్రారంభించారు. రైతులకు మద్దతు ధర కల్పించాలనే ప్రభుత్వం కొనుగోలు కేం ద్రాలను ఏర్పాటు చేస్తుందన్నా రు. కార్యక్రమంలో మెదక్ పీఎసీఎస్ చైర్మన్ హన్మంత్‌రెడ్డి, ఎం పీటీసీ మాణిక్యరెడ్డి, సర్పంచ్‌లు మహిపాల్‌రెడ్డి, శ్రీహరి, దేవమ్మ, టీఆర్ఎస్ మండలాధ్యక్షు డు శ్రీనివాస్‌రెడ్డి, నేతలు నరేందర్‌రెడ్డి, సాయిలు ఉన్నారు.
సద్వినియోగం చేసుకోవాలి : చైర్మన్ త్యార్ల రమేశ్
పాపన్నపేట, నవంబర్ 2 : కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని రైతు సహకార సంఘం చైర్మన్ త్యార్ల రమేశ్ సూచించారు. ఆరెపల్లి, యూసూఫ్‌పేట గ్రామా ల్లో కొత్తపల్లి రైతుసేవా సహకార సంఘం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కార్యక్రమంలో ఆరెపల్లి సర్పంచ్ శ్రీనాథ్‌రావు, యూసూఫ్‌పేట సర్పంచ్ దాస య్య, ఎంపీటీసీ నీరుడి జ్యోతీసాయిలు, తహసీల్దార్ మహేందర్, ఏడుపాయల ఆలయ మాజీ చైర్మన్ బాలకృష్ణారెడ్డి, స్థా నిక నాయకుడు వెంకటేశ్వర్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు.
రైతుకు మద్దతు ధర : ఎంపీపీ, జడ్పీటీసీ
వెల్దుర్తి, నవంబర్ 2 : రైతన్నలకు మద్దతు ధర కల్పించడా నికే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తు న్నదని ఎంపీపీ స్వరూపానరేందర్రెడ్డి, జడ్పీటీసీ రమేశ్‌గౌడ్, సహకార సంఘం చైర్మన్ అనంతరెడ్డి పేర్కొన్నారు. మాసాయిపేటతోపాటు నాగ్సాన్పల్లి, కొప్పులపల్లి, వెల్దుర్తి మండలంలో హస్తాల్పూర్, నెల్లూర్, చర్లపల్లి, కుకునూర్, ధర్మారం, దామరంచ, అందుగులపల్లి, మానేపల్లి, మంగళపర్తి, యశ్వంతరావుపేట, మన్నెవారి జలాల్పూర్లో పీఏసీఎస్ కేంద్రాలను ప్రారంభించారు. బొమ్మారం, శేరీ, మహ్మద్నగర్తండాల్లో ఐకేపీ కేంద్రాలను టీఆర్ఎస్ మాసాయిపేట మండలాధ్యక్షు డు, సర్పంచ్ మధుసూదన్‌రెడ్డి ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో సర్పంచ్‌లు భాగ్యమ్మ, అశోక్‌రెడ్డి, ప్రీతి, లత, వెంకటలక్ష్మి, ఎంపీటీసీలు కృష్ణారెడ్డి, నవనీతాశ్రీను, బాబు, సొసైటీ డైరెక్టర్లు నర్సింహులు, రమేశ్చందర్, వెంకట్‌రెడ్డి, నాయకులు నరేందర్‌రెడ్డి, ఆంజనేయులు, సిద్ధ్దిరాములుగౌడ్, మ హేందర్‌రెడ్డి, కృష్ణ, శ్రీనివాస్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు.
నేడు వెల్దుర్తికి రానున్న అదనపు కలెక్టర్
నేడు వెల్దుర్తి మండలకేంద్రంలో పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ రమేశ్ ప్రారంభించనున్నారని సంఘం చైర్మన్ అనంతరెడ్డి తెలిపారు.
వారం రోజుల్లో నగదు జమ : చైర్మన్ కొండల్‌రెడ్డి
చేగుంట, నవంబర్ 2 : ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి వారం రోజుల్లో నగదు జమ చేస్తున్నదని నార్సింగి ఎం పీపీ సబిత, జడ్పీటీసీ కృష్ణారెడ్డి, ఇబ్రహీంపూర్ సొసైటీ చైర్మన్ కొండల్‌రెడ్డి అన్నారు. నార్సింగి మండలం సంకాపూర్, జప్తిశివునూర్, చేగుంట మండలం పోతాన్‌పల్లి, చిట్టోజిపల్లి, కరీంనగర్ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ తానీషా, సర్పంచ్‌లు సం తోష, మహిపాల్, ప్రవళిక, లక్ష్మీనారాయణ, సిద్ధ్దిరాము లు, గణేశ్, సంజీవరెడ్డి, హరిప్రసాద్, జగన్‌గౌడ్, అంజిరెడ్డి, మాధవరెడ్డి, నారాయణరెడ్డి, స్వామి, నేతలు మైలరాం బాబు, లింగారెడ్డి, రాజేందర్‌రెడ్డి, యోగి, తౌర్యానాయక్, యాదగిరి, షరీఫ్, రుక్మొద్దీన్, తహసీల్దార్ సత్యనారాయణ ఉన్నారు.