వెల్దుర్తి, నవంబర్ 1 : దుకాణాల్లో విక్రయించే వస్తువుల ప్యాకింగ్‌పై తయారు చేసే కంపెనీల వివరాలు లేకుండా వినియోగదారులకు విక్రయిస్తే చర్యలు తప్పవని జిల్లా తూనికల, కొలతల అధికారి సుధాకర్ హెచ్చరించారు. మంగళవా రం మండల కేంద్రమైన వెల్దుర్తిలో బట్టల షాపులు, కిరాణా దుకాణాల్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. బట్టల దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. దుస్తుల కవర్లు, ప్యా కింగ్ బాక్సులపై తయారు చేసే కంపెనీల వివరాలు, చిరునా మా లేకపోవడం, ఇష్టానుసారంగా ధరలకు విక్రయిస్తుండడంతో మూడు షాపుల యజమానులకు జరిమానా విధించారు. అనంతరం కిరాణ దుకాణంలో నిషేధిత విదేశి సిగరెట్లను విక్రయిస్తుండడంతో పది సిగరెట్ బాక్సులను స్వాధీ నం చేసుకున్నారు. తనిఖీల అనంతరం తూనికల, కొలతల అధికారి సుధాకర్ మాట్లాడుతూ.. దుకాణాల్లో విక్రయించే ప్రతి వస్తువుపై తయారీ కంపెనీ చిరునామా, వివరాలు, త యారీ తేదీ, ఎమ్మార్పీ ధర, ఎన్ని వస్తువులు ఉన్నాయో? త దితర పూర్తి వివరాలు ఉండాలన్నారు. అలా కాకుండా కేవ లం ప్యాకింగ్ కవర్లు మాత్రమే ఉంటే.. ఆ వస్తువులను వినియోగదారులు తీసుకోవద్దని, వస్తువులను అధిక ధరలకు వి క్రయించినా అధికారులతోపాటు వినియోగదారుల ఫోరం సంప్రదించాలని సూచించారు. కిరాణ దుకాణాల్లో తూకం వేసే మిషన్ల సీల్ తొలిగించి ఉండడంతో దుకాణం యజమానులపై జిల్లా అధికారి సుధాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.