పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ భరోసా ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి
హవేళీఘనపూర్/ రామాయంపేట, ఫిబ్రవరి 27 : పేదలు అ నారోగ్యంతో వైద్యచికిత్సకు ఆర్థికంగా పడుతున్న ఇబ్బందులను గుర్తించి, వైద్యఖర్చుల నిమిత్తం సీఎం సహాయనిధిలో భారీగా నిధులు మంజూరు చేసి, సీఎం కేసీఆర్ ఆపద్బాంధవుడిగా మా రారని ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం కూచన్పల్లిలోని క్యాంపు ఆపీస్లో ఆయా మండలాలకు చెందిన లబ్ధిదారు లకు మొత్తం రూ.50.72లక్షల సంబంధించిన 135 చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీలు నారాయణరెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, జడ్పీటీసీ విజయ్‌కుమార్, సర్పంచ్‌లు యామిరెడ్డి, రాజేందర్‌రెడ్డి, దేవాగౌడ్, ఉప సర్పంచ్ బయ్యన్న ఉన్నారు.
మెదక్ జిల్లాకేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో రామాయంపేటకు చెందిన 9 మందికి రూ.8లక్షలు, నిజాంపేట మండలానికి చెందిన 15 మందికి రూ.15 లక్షల విలువైన సీఎంఆర్ ఎఫ్ చెక్కులను అందజేశారు. సీఎం కేసీఆర్ పేదల పక్షపాతి అని కొనియాడారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేయడంపై నిజాంపేట జడ్పీటీసీ విజయ్‌కుమార్, రామయంపేట మండలం దామరచెరువు సర్పంచ్ శివప్రసాదరావు హర్షం వ్యక్తం చేశారు.
ఆపదలో ఆసరా : ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి
పెద్దశంకరంపేట, ఫిబ్రవరి 27 : ఆపద సమయంలో పేదలకు సీఎంఆర్ఎఫ్ ఆసరాగా నిలుస్తుందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు. మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో శివాయపల్లి గ్రామానికి చెందిన లక్ష్మణ్ రూ. 40 వేలు, బుజ్రాన్‌పల్లికి చెందిన లక్ష్మి రూ.30 వేలు, ఉత్తులూరుకు చెందిన అనిల్‌గౌడ్ రూ.1 లక్ష విలువైన చెక్కును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో రైతుబంధు సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి, జడ్పీటీసీ విజయారామరాజు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మురళీపంతులు, వైస్ ఎంపీపీ లక్ష్మీరమేశ్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు సురేశ్‌గౌడ్, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు కుంట్ల రాములు, ఎంపీటీసీ వీణాసుభాశ్గౌడ్ తదితరులు ఉన్నారు.
పేదలకు వరం : మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి
నర్సాపూర్, ఫిబ్రవరి 27 : మున్సిపల్లో తన నివాసంలో బాధిత కుటుంబ సభ్యుడికి సీఎంఆర్ఎఫ్ చెక్కును రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి అందజేశారు. మూసాపేట పంచాయతీలోని జైరాంతాండాకు చెందిన హస్లీ కరోనా బారీన పడి చికిత్స పొందుతూ ఇటీవల మృతి చెందాడు. ఈ మేరకు మృతుడిడి కుటుంబానికి మంజూరైన రూ.75వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును మృతురాలి భర్తకు అందజేశారు. పేదలకుసీఎం సహా యనిధి వరమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నయీమొద్దీన్, టీఆర్ఎస్ బ్రాహ్మణపల్లి గ్రామాధ్యక్షుడు వంజరి శ్రీనివాస్, ఏఎంసీ డైరెక్టర్ సూరారం నర్సింహులు, టీఆర్ఎస్ నాయకులు సత్యంగౌడ్, నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.