మెదక్ మున్సిపాలిటీ, అక్టోబర్ 31: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని మెదక్ మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి అన్నారు. సోమవారం పట్టణంలోని దయార, పిల్లికోటాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ హన్మంత్‌రెడ్డి, వైస్ చైర్మన్ కాస సూర్యతేజలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ వ్యవసాయరంగానిక పెద్దపీట వేశారన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
కొల్చారం, అక్టోబర్ 31: రైతులకు మద్దతు ధర చెల్లించడానికే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు కొల్చారం జడ్పీటీసీ ముత్యంగారి మేఘమాల అన్నారు. పోతంశెట్‌పల్లి, వెంకటాపూర్, వసురాంతండాలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం ఆయా గ్రామాల సర్పంచ్‌లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి గింజ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దన్నారు. రాంపూర్‌లో ఫ్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ పర్సన్ ఇన్చార్జి శంకర్, సీఈవో రవితతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమం లో డీసీఎంఎస్ మాజీ వైస్‌చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, ఎంపీ డీవో ప్రవీణ్‌కుమార్, ఐకెపీ ఏపీఎం, ఆయా గ్రామాల సర్పంచ్‌లు నాగరాణి నర్సింహులు, నెల్లి కిష్టయ్య, లంబాడి మోతి పాం డునాయక్, ఎంపీటీసీ భాగ్యలక్ష్మి సిద్ధిరాములు, ఏడుపాయ ల డైరెక్టర్ కొమ్ముల యాదాగౌడ్, ఏఈవో వినీత, ఐకేపీ సిబ్బంది వెంకటేశం, సబిత, నర్సింహులు, యాదగిరి, కవిత, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
హవేళీఘనపూర్, అక్టోబర్ 31: ధాన్యం కొనుగోలు కేం ద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధరను పొందాలని ఎంపీపీ శేరి నారాయణరెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని కూచన్‌పల్లి, మద్దుల్వాయితో పాటు ఆయా గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, మెదక్ సొసైటీ చైర్మన్ నారాయణరెడ్డితో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో మెదక్ పీఏసీఎస్ చైర్మ న్ హన్మంత్‌రెడ్డి, కూచన్‌పల్లి సర్పంచ్ దేవాగౌడ్, ఏవో నాగమాధురి, ఏఈవో విజృంభన పాల్గొన్నారు.
మెదక్‌రూరల్ అక్టోబర్ 31: రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదని మెదక్ పీఏసీఎస్ చైర్మన్ చిలుముల హనుమంత్‌రెడ్డి రాయిన్‌పల్లి సర్పంచ్ సిద్ధగౌడ్ అన్నారు. సోమవారం మెదక్ మండలంలోని రాయిన్పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ సిద్ధగౌడ్తో కలిసి ప్రా రంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు వడ్లు ఆరబోసి తాలు లేకుండా 17శాతం తేమ వచ్చేలా ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు.
టేక్మాల్, అక్టోబర్ 31: మండలంలోని ఎలకుర్తిలోకొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ శ్వేతాచంద్రశేఖర్రెడ్డి ప్రారంభించారు. ఏ-గ్రేడ్ రకానికి రూ. 2060, సాధారణ రకం రూ. 2040 మద్దతు ధరగా నిర్ణయించారు. కార్యక్రమంలో రైతు సయన్వయ సమితి అధ్యక్షుడు శ్రీధర్‌చారి, అధ్యక్షుడు సత్యాగౌడ్, జిల్లా కో-ఆప్షన్ సభ్యుడు యూసుఫ్, ఏపీఎం రామకృష్ణ సెంటర్ ఇన్చార్జి స్వరూప, రైతులు పాల్గొన్నారు.