పటాన్చెరు టౌన్/ పటాన్చెరు, అక్టోబర్ 30 : ఉత్తర భారతదేశంలో భక్తిశ్రద్ధలతో చేసే ఛఠ్ పూజలకు పటాన్చెరులో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. సాకీ చెరువు వద్ద పూజలు నిర్వహించడానికి, మైత్రీ మైదానంలో ప్రముఖ భోజ్‌పూరి నటుడు కేసరీలాల్ యాదవ్ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించ నున్నారు. ఆదివారం పటాన్చెరు సాకీ చెరువు కట్టవద్ద ఏర్పాట్లను కార్పొరేటర్ మెట్టు కుమార్‌యాదవ్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గూడెం మధుసూదన్‌రెడ్డి పరిశీలించారు. ఈ సం దర్భంగా కార్పొరేటర్‌ను ఛఠ్ పూజా నిర్వాహక కమిటీ సత్కరించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఛఠ్ పూజలను 15 ఏండ్లుగా పటాన్చెరులో ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఏడాది ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సహకారంతో పండుగను మరింత గొప్పగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఛఠ్ పూజలకు హైదరాబాద్, సికింద్రాబాద్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలనుంచి భారీగా ప్రజలు వస్తున్నారన్నారు. సాయంత్రం 6గంటలకు మైత్రీ మైదానం లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్‌కుమార్, సందీప్‌షా, సంజయ్‌సింగ్, సంతోష్, లల్లూ, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
భిన్నమైన సంస్కృతులను గౌరవిస్తున్నాం
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి
భిన్న సంస్కృతులను గౌరవించే సంస్కృతి తెలంగాణలో ఉందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. పటాన్చెరులో ఛఠ్ పూజల సందర్భంగా చెరుకు గడలను ప్రజలకు అందజేశారు. భక్తిశ్రద్ధలతో పండుగను నిర్వహించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. పటాన్చెరు పట్టణంలో ప్రత్యేకం గా ఛఠ్ పూజలు నిర్వహించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. పటాన్చెరు మినీ ఇండియాగా ఎమ్మెల్యే పేర్కొ న్నారు. సాకీ చెరువు కట్టవద్ద ఏర్పాట్లు చేశామని, సోమవారం సాయంత్రం మైత్రీ మైదానంలో భారీ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కుమార్‌యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్, టీఆర్ఎస్ నాయకులు గూడెం మధుసూదన్‌రెడ్డి, ధనరాజ్‌గౌడ్, జైకిషన్ పాల్గొన్నారు.
బొంతపల్లిలో కన్నుల పండువగా ఛఠ్ పూజలు
గుమ్మడిదల, అక్టోబర్ 30 : మండలంలోని బొంతపల్లి పరిధిలోని వీరభద్రనగర్ కాలనీలో బీహార్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ర్టాలకు చెందిన ప్రజలు ఛఠ్ పూజ నిర్వహించారు. సర్పంచ్ నవీనాశ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ నేతలు విజయభాస్కర్‌రెడ్డి, చక్రపాణి, వినోద్‌గౌడ్ పూజల్లో పాల్గొన్నారు.
ఛఠ్ పూజలకు చెరుకుగడల పంపిణీ
బొంతపల్లిలో నివసిస్తున్న బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ర్టాల ప్ర జలకు ఛత్ పూజలకు వినియోగించే చెరుకుగడలను ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి పంపించారు. వీటిని టీఆర్ఎస్ నేతలు, సర్పం చ్తో కలికిసి ఉప సర్పంచ్ సంజీవరెడ్డి అందజేశారు. ఛఠ్ పూ జా ఘాట్‌ను ప్రత్యేకంగా అలంకరించినట్లు తెలిపారు.