హవేళీఘనపూర్/ చిన్నశంకరంపేట/ గుమ్మడిదల/ జిన్నారం, అక్టోబర్ 28;అన్నివిధాలుగా అండగా ఉంటూ రైతులను సీఎం కేసీఆర్ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారని, రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజనూ ప్రభుత్వపరంగా కొనుగోలు చేసేందుకు చర్యలు చేపట్టారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం చిన్న శంకరంపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మెదక్ జిల్లాలో 400 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, 40 లక్షల గోనె సంచులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. చివరి గింజ వరకూ కొంటామని, రైతు లు ఆందోళన చెందవద్దని సూచించారు. రైతుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ నిరంతరంగా కృషి చేస్తున్నారని, రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రభు త్వం పెద్దపీట వేస్తున్నదని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. సోలక్పల్లి, ఊట్ల, జిన్నారం, వావిలాల, నల్తూర్, గుమ్మడిదల, అన్నారం, నల్లవల్లి, కానుకుంట, రాంరెడ్డిబావి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఆయన ప్రారంభించారు. ఈ అవకాశాన్ని రైతన్నలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
మెదక్ జిల్లాలో 400పైగా కొనుగోలు కేంద్రాలు; ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి
మండల కేంద్రమైన చిన్నశంకరంపేటలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ మెదక్ జిల్లాలో 400పైగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. గోనె సంచుల కొరత లేదని, 40లక్షల గోనె సంచులు సిద్ధంగా ఉన్నాయన్నారు. లారీల కొరత లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులపై చిన్నచూపు చూస్తుందని ఆరోపించారు. రైతులకు మద్దతు ధర కల్పించేందుకే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందన్నారు. రైతుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీనివాస్, రైతుబంధు మండల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, సర్పంచ్ రాజిరెడ్డి, చైర్మన్లు అంజిరెడ్డి, సత్యనారాయణ, తహసీల్దార్ రాజేశ్వర్‌రావు, ఎంపీడీవో గణేశ్‌రెడ్డి, సర్పంచ్‌లఫోరం మండలాధ్యక్షుడు పూలపల్లి యాదగిరియాదవ్, మాజీ సర్పంచ్ కుమార్‌గౌడ్, ఏఎంసీ డైరెక్టర్ లతీఫ్, హవేళీఘనపూర్ మండలంలోని కార్యక్రమంలో ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, మెదక్ పీఎసీఎస్ చైర్మన్ హన్మంత్‌రెడ్డి, జడ్పీ వైస్‌చైర్మన్ లావణ్యారెడ్డి, జిల్లా పౌరసరఫరాల అధికారి గోపాల్, మండల కో-ఆప్షన్ సభ్యులు ఖాలేద్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్ చెన్నాగౌడ్, ఎంపీటీసీ అర్చనశ్రీనివాస్, రాజయ్య, సర్పంచ్‌లు రాజేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు నరేందర్‌రెడ్డి, రాంచంద్రారెడ్డి, సిద్దిరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి; ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకుని మద్దతు ధర పొందాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సూచించారు. కేంద్రాలకు తీసుకువచ్చే ధాన్యం తేమ శాతం చూసుకుని వెళ్లాలన్నారు. రైతులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని, వారి సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నదన్నారు. గుమ్మడిదల మండలంలోని కార్యక్రమాల్లో జడ్పీటీసీ కుమార్‌గౌడ్, ఎంపీపీ సిద్దిప్రవీణ, తహసీల్దార్ సుజాత, పీఏసీఎస్ చైర్మన్ నంద్యాల విష్ణువర్ధన్‌రెడ్డి, సర్పంచ్‌లు నర్సింహరెడ్డి, తిరుమలవాసు, బేకునీలమ్మ, డి.శంకర్, వాసవిదామోదర్రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు గోవర్ధన్‌రెడ్డి, సద్దివిజయభాస్కర్రెడ్డి, కొత్తపల్లి ప్రభాకర్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, ఆలేటి శ్రీనివాస్‌రెడ్డి, గటాటి భద్రప్ప, ఎంపీటీసీలు బీ.లక్ష్మి, పద్మాకొండల్రెడ్డి, పార్వతమ్మ, ఉపసర్పంచ్లు మొగులయ్య, శంకర్, గోవర్ధన్‌రెడ్డి, ప్రవళిక, జిన్నారం మండలంలోని కార్యక్రమాల్లో జడ్పీవైస్ చైర్మన్ ప్రభాకర్, ఎంపీపీ రవీందర్‌గౌడ్, తహసీల్దార్ దశరథ్, సర్పంచ్‌లు లావణ్యశ్రీనివాస్‌రెడ్డి, జనార్దన్, ఆంజనేయులు, శ్రీకాంత్‌రెడ్డి, శెట్టి శివరాజ్, ప్రకాశ్‌చారి, చిట్ల సత్యనారాయణ, ఖదీర్, ఎంపీటీసీ లావణ్యనరేశ్, స్వాతిప్రభాకర్రెడ్డి, ఐకేపీ ఏపీఎం నరేందర్, పీఏసీఎస్ చైర్మన్లు గోపాల్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, ఉపసర్పంచ్లు నవనీత్‌రెడ్డి, సంజీవ, వనజారెడ్డి, రవీందర్, రమేశ్, జీవన్, భవానీరమేశ్, మాజీ సర్పంచ్‌లు శివరాజ్, వెంకట్రామ్రెడ్డి, గోవిందరాజు, నాయకులు ఆకుల నవీన్‌కుమార్, నందకుమార్, శ్రీనివాస్‌గౌడ్, శ్రీధర్‌గౌడ్, ఐకేపీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర ;మార్క్‌ఫెడ్ డైరెక్టర్ జగన్మోహన్రెడ్డి
ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధా న్యం విక్రయించాలని మార్క్‌ఫెడ్ డైరెక్టర్ జగన్మోహన్రెడ్డి అన్నారు. రైతుల పంటలకు పూర్తి మద్దతు ధర చెల్లించేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నద ని తెలిపారు. ధాన్యం విక్రయించేందుకు వచ్చే రైతులు పట్టాపాసుబుక్కు, ఆధార్, బ్యాంక్ పాసుబుక్కు జీరాక్స్ కాపీలు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బాలయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ ప్రవీణ్, ఏఎంసీ మాజీ చైర్మన్లు మల్లికార్జున్‌గుప్తా, నారాయణ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు లక్షీకాంత్రెడ్డి, ప్రధాన కార్యద ర్శి శ్రీనివాస్, పట్టణాధ్యక్షుడు శ్రీధర్, తాలెల్మ సర్పంచ్ లింగాగౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.