తూప్రాన్, అక్టోబర్ 28 : భారతీయ జనతా పార్టీ మండలఅధ్యక్షుడు కొండా సిద్ధిరాములు యాదవ్ సస్పెన్షన్ వ్యవహా రం మండలంలో సంచలనంగా మారింది. తూప్రాన్ మున్సిపాలిటీలోని పడాలపల్లికి చెందిన బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు మట్టెల ఆంజనేయులు యాదవ్ తనను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించడంపై మండలాధ్యక్షుడు సిద్ధిరాములు యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. ఈ సందర్భంగా శుక్రవారం తూప్రాన్‌లోని లక్ష్మినరసింహా ఫంక్షన్ హాల్లో తన అనుచరు లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సిద్ధిరాములు మాట్లాడుతూ.. ప్రశ్నిస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా?, సస్పెండ్ చేసే అధికారం జిల్లా ఉపాధ్యక్షుడు ఆంజనేయులుకు లేదని పేర్కొన్నారు. పార్టీ శ్రేణులకు పంపిణీ చేయకుండా మెదక్ జిల్లా బీజేపీ కా ర్యాలయ ఆవరణలో గుట్టలుగా పార్టీ కరపత్రాలు, జెండాలు, కండువాలు, వాల్‌పోస్టర్లు, ఫేస్ మాస్క్‌లు వృథాగా పడేయడం జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీ సుకెళ్లినందున తనను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించడం కక్ష సాధింపు చర్యేనన్నా రు. తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. నేను ఇరవై ఏండ్లుగా పార్టీ కి సేవ చేస్తున్నానని, మీలాగా ఇతర పార్టీల నుంచి వలస రాలేదని ఆంజనేయులును ఉద్దేశించి అన్నారు. జిల్లా ఉపాధ్యక్షుడైన ఆంజనేయులును పార్టీలోకి తీసుకొచ్చింది తనేనని, తన నే సస్పెండ్ చేస్తావా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను సస్పెండ్ చేసే అధికారం జిల్లా ఉపాధ్యక్షుడికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. కార్యక్రమంలో నాయకులు అంజాగౌడ్, తాటి విఠల్, కార్తీక్‌గౌడ్, గట్టు అమర్గుప్త్తా, పోతరాజు నాగరాజు, ఆడెపు మధు, పిట్ల శేఖర్, కేశబోయిన మధు పాల్గొన్నారు.