కొల్చారం, అక్టోబర్ 28 : రైతులు పండించిన ధాన్యం చివరి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదని, అధైర్యపడొద్దని ఎంపీపీ మంజుల, జడ్పీటీసీ మేఘమాల పేర్కొన్నారు. మండలంలోని కొంగోడు, నాయిన్జలాల్పూర్, కొల్చారం, వరిగుంతం, చిన్నాఘన్‌పూర్ గ్రామాల్లో శుక్రవారం పీఏసీఎస్ చైర్మన్లతో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కిష్టాపూర్‌లో సర్పంచ్ గోదావరి, సొసైటీ చైర్మన్ నాగులగారి మల్లేశంగౌడ్ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులకు ఇబ్బందులు కలుగకుండా సీఎం కేసీఆర్ అనేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపా రు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతుకు అందుబాటులో ఉండేలా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాల్‌కు రూ.2,060, సాధారణ రకం క్వింటాల్‌కు రూ.1,960 మద్దతు ధరను ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. ధాన్యం తూకం వేసిన వారం రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయన్నారు. కార్యక్రమంలో మెదక్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చందాపురం సావిత్రీరెడ్డి, టీఆర్ఎస్(బీఆర్ఎస్) మండలాధ్యక్షుడు గౌరీశంకర్గుప్త్తా, సర్పంచ్ లు కరెంటు ఉమ, మంజుల, ఇందిరా, ఉప సర్పంచ్‌లు నిం గోల్ల చెన్నయ్య, లక్ష్మీనారాయణగౌడ్, ఎంపీటీసీ ఉదయ, ఆత్మ కమిటీ వైస్ చైర్మన్ శేఖర్, సొసైటీ చైర్మన్లు కృపాకర్‌రెడ్డి, నాగూరి మనోహర్, చిన్నారపు ప్రభాకర్, మంద నాగులు, వైస్ చైర్మన్ రాజాగౌడ్, డైరెక్టర్లు దోమకొండ దేవదాసు, లంబాడీ శ్రీను, బాల్‌రాజు, సీఈవోలు సాయిరెడ్డి, పార్తిగారి కృష్ణ, చిన్నారపు రాములు, కృష్ణ, నవీన్, టీఆర్ఎస్ నాయకులు వేమారెడ్డి, రాజాగౌడ్, లక్ష్మీపతి, సంతోశ్‌కుమార్ పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తాం
రేగోడ్, అక్టోబర్ 28 : మండలవ్యాప్తంగా ధాన్యం కొనుగో లు కేంద్రాలను త్వరలో ఏర్పాటు చేస్తామని పీఏసీఎస్ చైర్మన్ భాస్కర్‌రాజు తెలిపారు. రైతులు వడ్లను దళారులకు విక్రయిం చి మోసపోవద్దని సూచించారు. రేగోడ్, కొత్వాల్‌పల్లి గ్రామా ల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు.