మెదక్ మున్సిపాలిటీ, అక్టోబర్ 27: ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థి ఈ విద్యా సంవత్సరం ముగిసే నాటికి చదవడం, రాయడం, లెక్కలు చేయడంలో విషయ పరిజ్ఞానం సమన్వయ పరచడంలో ఉపాధ్యాయు లు అంకితభావంతో పనిచేయాలని విద్యాశాఖ సంయుక్త కార్యదర్శి హరిత అన్నారు. ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ తొలిమెట్టు కార్యక్రమాన్ని చేపట్టిందని, దీన్ని ఉపాధ్యాయులు సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. గురువారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో తొలిమెట్టు, మనఊరు-మనబడి కార్యక్రమాల ప్రగతిని ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మ న్లు, ప్రధానోపాధ్యాయులు అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో సమీక్షించారు. ఈ సందర్భంగా హరిత మా ట్లాడుతూ ఆహ్లాదకరమైన వాతావరణంలో పాఠ్యాంశాలు బోధిస్తూ ప్రణాళికాబద్ధంగా బేసిక్స్ గణితంపై పట్టు సాధించేలా చూడాలని కోరారు. రాష్ట్రంలోని 5వేల పాఠశాలల్లో లైబ్రెరీ కార్నర్లు ఏర్పాటు చేసి పుస్తకాలు అందుబాటులో కి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. మనఊరు-మనబడి కార్యక్రమాన్ని సమీక్షిస్తూ నిధుల కొర త లేదని పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ, ప్రధానోపాధ్యాయుడు, సర్పంచ్, ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలు సమన్వయంతో పనిచేస్తూ జిల్లాలో గుర్తించిన 313 పాఠశాలల్లో శౌచాలయాలు, కిచెన్ షెడ్లు, ప్రహారీ వం టి మౌలిక సదుపాయల కల్పనకు కృషి చేయాలన్నారు. పనులు చేసి న వాటికి వెంటవెంటనే ఎంబీ రికా ర్డు చేసి ఎఫ్‌టీవోలో నమోదు చేసి పనులకు నిధులు మంజూరు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం నుంచే గాక ఉపాధి హామీ పథకం కింద ప్రహారీ నిర్మాణం వంటి పను లు చేపట్టవచ్చని పలువురు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు. రూ. 30లక్షల లోపు, రూ. 30లక్షలకు పైగా గల పనులు చేపట్టాల్సి ఉండ గా పనుల పురోగతి ఆశించిన స్థాయిలో జరగడం లేదని పనుల్లో వేగవం తం చేయాలన్నారు. రూ. 30లక్షలకు పైగా పనులు గల వాటికి వెంటనే టెండర్లు పిలిచి పనులను ప్రారభించాలని అధికారులకు సూచించారు. ఏమైన సాంకేతిక సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే రాష్ట్ర సాంకేతిక బృందం సహకారంతో పరిష్కారిస్తామన్నారు.
నైపుణ్యం పెంపొదించేలా కృషి చేయాలి: మెదక్ కలెక్టర్ హరీశ్
పిల్లల్లో లోటుపాట్లను గమనించి వారిలో కనీస ఆభ్యాసనపై నైపుణ్యం పెంపొందించేలా ఉపాధ్యాయులు కృషి చే యాలని కలెక్టర్ హరీశ్ అన్నారు. పాఠాలు చెబుతుంటే పిల్లలో అనుభూతి కలుగాలని, ఉత్సాహంతో మరింత తెలుసుకోవాలనే జిజ్ఞాన కలగాలని, ఆ దిశగా పక్కా ప్రణాళిక ప్రకా రం బోధించాలని సూచించారు. గణితం, సైన్స్ లాంటి బేసి క్ పాఠ్యాంశాలను ప్రయోగ రూపంలో చెబితే వారి మనస్సుకు హత్తుకుని నేర్చుకోవాలనే కూతూహలం ఉంటుందన్నారు. ఆ దిశగా ఉపాధ్యాయులు వృత్తిపై అంకితభావంతో పిల్లలకు పాఠాలు బోధించాలన్నారు. ఇందుకోసం సీనియ ర్ అధికారులకు శిక్షణసైతం ఇవ్వడం జరిగిందని, ఏ పాఠశాలలో లోటుపాట్లు ఉన్నాయో గుర్తించి ప్రత్యే క శ్రద్ధ కనబరుచాలని వివరించారు. మనఊరు-మనబడి కార్యక్రమం కింద గుర్తించిన పాఠశాలలో పనులు ఎంత వరకు జరిగాయి, సమస్య ఏమైనా ఉన్నాయా, చేసిన పనులకు ఎంబీ రికార్డులు చేశారా అనే విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తెచ్చి పరిష్కరించుకోవాలని విద్యాశాఖాధికారి రమేశ్‌కుమార్‌కు సూచించారు. సమీక్ష సమావేశంలో ప్రభుత్వ పరీక్షలు సంచాలకులు కృష్ణారావు, సమగ్రశిక్ష అదనపు సంచాలకు డు రమేశ్, తొలిమెట్టు రాష్ట్ర నోడల్ అధికారి సువర్ణా వినాయక్, రాష్ట్ర ఏఎంవో గోపాల్, మేనేజ్మెంట్ కమిటీ చైర్మ న్లు, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, మండల విద్యాధికారు లు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎగ్జిక్యూటీవ్ ఏజె న్సీలు పాల్గొన్నారు.