మెదక్ మున్సిపాలిటీ/ మెదక్ రూరల్/ హవేళీఘనపూర్/ రేగోడ్/ చిన్నశంకరంపేట/ పాపన్నపేట/ టేక్మాల్/అల్లాదుర్గం, అక్టోబర్ 27 : బీజేపీ కుట్రలతో నీచమైన రాజకీయాలకు పాల్పడుతుందని మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ మండిపడ్డా రు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి పన్నిన కుట్రను నిరసిస్తూ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పిలుపు మేరకు గురువారం జిల్లా కేంద్రంలోని రాందాస్ చౌరస్తాలో రాస్తారోకో చేపట్టి, ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దహనం చేశారు. ధర్నాలో టీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి కృష్ణాగౌడ్, టీఆర్ఎస్వై అ ధ్యక్షుడు సందీప్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అశోక్, ఏఎం సీ మాజీ మధుసూదన్‌రావు, కౌన్సిలర్లు సమీయొద్దీన్, జయ రాజ్, శ్రీనివాస్, కిశోర్, మాజీ కౌన్సిలర్లు రమేశ్‌గౌడ్, కిషన్, ఏఎంసీ డైరెక్టర్ శంకర్, నేతలు దుర్గాప్రసాద్, శ్రీధర్‌యాదవ్, ప్రవీణ్‌గౌడ్, ప్రభురెడ్డి, కృష్ణ, అరవింద్‌గౌడ్, బాలరాజు, జుబేర్, ఉమర్, అనూప్, మహమ్మద్, కిరణ్ పాల్గొన్నారు.
మెదక్ మండలంలోని మంబోజిపల్లిలో ప్రధానీ మోదీ, అమిత్ షా దిష్టిబొమ్మలను దహనం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్(బీఆర్ఎస్) మండలాధ్యక్షుడు ఆంజాగౌడ్, ఉపాధ్యక్షుడు సాంబశివరావు, మెదక్ పీఏసీఎస్ చైర్మన్ హన్మంత్‌రెడ్డి, వైస్ ఎంపీపీ మార్గం ఆంజనేయులు, సర్పంచ్‌లు ప్రభాకర్, వికాస్కూమర్, వెంకటేశం, నాయకులు శ్రీనివాస్, జయరాంరెడ్డి, ఎలక్షన్రెడి, మోహన్, రాములు, రవీందర్ పాల్గొన్నారు.
హవేళీఘనపూర్‌లో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కార్యక్రమంలో కో-ఆప్షన్ సభ్యుడు ఖాలేద్, సర్పంచ్ రాజేందర్‌రెడ్డి, నాయకులు సాయిలు, శ్రీకాంత్, రాంచంద్రారెడ్డి, రమేశ్ ఉన్నారు.
రేగోడ్ మండల కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద బీజేపీ దిష్టి బొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు రవీందర్, నర్సింహులు, హన్మంత్, నాయకులు భాస్కర్, సురేందర్, తుకారాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.
చిన్నశంకరంపేట బస్టాండ్ వద్ద ఆందోళన చేపట్టారు. కార్యక్రమంలో రైతుబంధు మండలాధ్యక్షుడు లక్ష్మారెడ్డి, సర్పంచ్ లక్ష్మణ్, మాజీ సర్పంచ్ కుమార్‌గౌడ్, ఏఎంసీ డైరెక్టర్ లతీఫ్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ నగేశ్, నాయకులు ప్రభాకర్, శ్రీనివాస్, రమేశ్‌గౌడ్, హేమచంద్రం తదితరులు పాల్గొన్నారు.
పాపన్నపేటలోని సుభాశ్‌చంద్రబోస్ విగ్రహం వద్ద మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఏడుపాయల ఆలయ చైర్మన్ బాలాగౌడ్, సర్పంచ్ గురుమూర్తిగౌడ్, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు కిష్టాగౌడ్, నాయకులు బాబాగౌడ్, ఉప్పరి వెంకటేశ్, శ్రీనాథ్, ఆంటోని, బెస్త బాలరాజు, సొంగ దుర్గయ్య, సంగప్ప, ఫుల్సింగ్, క్యాసగళ్ల మహేందర్, రాజ్, కృష్ణ, ప్రసాద్, ఆంజనేయులు, తదితరులు ఉన్నారు.
టేక్మాల్, అల్లాదుర్గం మండలకేంద్రాల్లో టీఆర్ఎస్ శ్రేణులు బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
మోదీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని బీజేపీ నాయకులు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టడంతో మోదీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని టీఆర్ఎస్ నాయకుడు అశోక్‌గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ నయీమొద్దీన్ పేర్కొన్నారు. నర్సాపూర్ బస్టాండ్ సమీపంలో కేంద్ర ప్ర భుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్(బీఆర్ఎస్) మండలాధ్యక్షుడు చంద్రశేఖర్, పట్టణాధ్యక్షుడు భిక్షపతి, పీఏసీఎస్ చైర్మన్ రాజుయాదవ్, ఏఎంసీ డైరెక్టర్లు సూరారం నర్సింహులు, జ్ఞానేశ్వర్, నాయకులు నగేశ్, ఆంజనేయులుగౌడ్, సత్యంగౌడ్, సేనాధిపతి, రవి, అశోక్, రాకేశ్‌గౌడ్, నాగరాజుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
* శివ్వంపేట, పాంబండ, దొంతి గ్రామాల్లో జరిగిన కార్యక్రమాల్లో సర్పంచ్‌లు పత్రాల శ్రీనివాస్‌గౌడ్, తలారి శివులు, ఫణిశషాంక్శర్మ, నేతలు రాజశేఖర్‌గౌడ్, లాయక్ పాల్గొన్నారు.
కొల్చారం బస్టాండ్ వద్ద బీజేపీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎంపీపీ మంజుల, ఏడుపాయల ఆలయ మాజీ డైరెక్టర్ గౌరీశంకర్, ఏఎంసీ మాజీ డైరెక్టర్ రాజాగౌడ్, సర్పంచ్‌లు కరెంటు ఉమారాజాగౌడ్, నాగరాణీనర్సింహులు, నాయ కులు గ్యాస్ కృష్ణ, ఎండుగుల కృష్ణ, దుర్గాప్రసాద్‌గౌడ్, లంబా డి వినోద్, సంజీవరావు, వెంకటేశం, నాగయ్య, చిన్న రాము లు, ఆంజనేయులు, ప్రవీణ్, శ్రీధర్, కిష్టయ్య పాల్గొన్నారు.
చిలిపిచెడ్‌లో జరిగిన కార్యక్రమంలో టీఆర్ఎస్ మండ లాధ్యక్షుడు అశోక్‌రెడ్డి, ఎంపీపీ వినోదదుర్గారెడ్డి, వైస్ ఎంపీపీ విశ్వంభర స్వామి పాల్గొన్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన బీజేపీ గద్దలు టీఆర్ఎస్ను ఆగం చేస్తుంటే చూస్తూ ఊరుకునేది లేదని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రామాగౌడ్ అన్నారు. కౌడిపల్లి మండలం వెంకట్రావుపేటలో జరిగిన ఆందోళనలో ఎంపీపీ రాజునాయక్, జడ్పీటీసీ అమర్‌సింగ్, నాయకులు కుత్బోద్దీన్, రాజు, దుర్గయ్య, బాబర్బాయ్, భిక్షపతి, గోపాల్, శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు. వెల్దుర్తిలో జరిగిన ధర్నాలో టీఆర్ఎస్ మం డలాధ్యక్షుడు భూపాల్‌రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ ఆంజనేయులు, నాయకులు నరేందర్‌రెడ్డి, గంగాధర్, కృష్ణాగౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, రమేశ్చందర్, అశోక్‌గౌడ్, వడ్ల నర్సింహు లు, సత్యంగౌడ్, శివరాములు, శాఖారం శ్రీను, కృష్ణ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తున్న బీజేపీ
దేశంలో మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూని చేయడమే గాకుండా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తు రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టాలని చూస్తున్నదని టీఆర్ఎస్ రామాయంపేట మండ లాధ్యక్షుడు బండారి మహేందర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ జితేందర్‌గౌడ్ పేర్కొన్నారు. రామాయంపేటలోని మెదక్ చౌరస్తాలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ యాదగిరి, పట్టణాధ్యక్షుడు గజవాడ నాగరాజు, పీఏసీఎస్ చైర్మన్ చంద్రం, నాయకులు దేమె యాదగిరి, అక్కన్నపేట నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
తూప్రాన్ పటణంలోని నర్సాపూర్ చౌరస్తా వద్ద ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో టీఆర్ ఎస్ మండలాధ్యక్షుడు బాబుల్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మెట్టు బాలకృష్ణారెడ్డి, సతీశ్‌చారి, పంజాల ఆంజనేయులు, ఎంపీపీ స్వప్నావెంకటేష్యాదవ్, మనోహరాబాద్ ఎంపీపీ నవనీతా రవి, నాయకులు చక్రవర్తి, బైరం సత్యలింగం, డాక్టర్ శ్రీనివాస్, చంద్రారెడ్డి, దామోదర్ రెడ్డి, బురాన్, ఎర్ర బాలకృష్ణ, బాలయ్య, దశరథ, అనిల్, షకీల్, షబ్బీర్, శ్రీధర్ పాల్గొన్నారు. నిజాంపేటలో జరిగిన ధర్నాలో ఎంపీపీ సిద్ధిరాములు, సర్పంచ్ అమరసేనారెడ్డి, నాయకులు రాజు, స్వామి, ముస్తాఫ పాల్గొన్నారు.
బీజేపీకి గుణపాఠం చెప్పాలి
ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రభుత్వా న్ని ఆస్థిరపరిచే కుట్రలకు పాల్పడుతున్న బీజేపీకి తగిన గుణపాఠం చెప్పేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధం కావాలి. ఎమ్మెల్యేలను డబ్బు సంచులతో కొనుగోలు చేసే బీజేపీని వచ్చే ఎన్నికల్లో ఘోరంగా ఓడించాలి. బీజేపీ 9 రాష్ర్టాల్లో ఇలాంటి కుట్రలు చేసి, అధికారంలోకి వచ్చిం ది. మోదీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి తెలంగాణపై విషం కక్కుతూ, అభివృద్ధి అంశాల్లో అన్యాయం చేస్తున్నా రు. బీజేపీ పెద్దలు తెలంగాణలోని ప్రజా ప్రభుత్వాన్ని అక్ర మ పద్ధతుల్లో కూల్చాలని ప్రయత్నిస్తున్నారు. బీజేపీ కుట్ర లు ఉద్యమ చరిత్ర ఉన్న తెలంగాణ రాష్ట్రంలో సాగవు.
– ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి