మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేస్తున్నదని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. శనివారం హవేళీఘనపూర్ మండల పరిధిలోని పోచారం డ్యామ్‌లో ఆరు లక్షల రొయ్యపిల్లలు, పన్నెండు లక్షల నలభైఎనిమిది వేల చేపపిల్లలను అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్‌తో కలిసి వదిలారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వర్షాలు సమృద్ధిగా కురిసి చెరువులు నిండడం చేపల ఉత్పత్తికి ఎంతో దోహదపడుతుందన్నారు. చేపలు పట్టిన తర్వాత విక్రయించుకునేందుకు సబ్సిడీపై ద్విచక్రవాహనాలు అందజేశామన్నారు. గతంలో పక్కరాష్ర్టాల నుంచి చేపలను దిగుమతి చేసుకునే పరిస్థితి ఉండేదని, తెలంగాణ వచ్చాక మత్స్యసంపద పెరిగి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నామన్నారు.
-హవేళీఘనపూర్, అక్టోబర్ 22
హవేళీఘనపూర్, అక్టోబర్ 22: మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే సంకల్పంతో ప్రభుత్వం వందశాతం సబ్సిడీపై చేపలు, రొయ్య పిల్లలు అందజేస్తున్నదని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని పోచారం డ్యామ్‌లో 6 లక్షల రొయ్య, 12.48 లక్షల చేప పిల్లలు వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన మిష న్ కాకతీయతో చెరువుల్లో సమృద్ధిగా నీరు ఉండడంతో మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నా యి. చెరువులు నిండుగా ఉండడంతో చేపల ఉత్పత్తికి ఉప టయోగపడుతుందన్నారు. దీనిని మత్స్యకారులు సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు.
ఆ దిశగా ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి సబ్సిడీపై ద్విచక్ర వాహనాలు అందజేస్తున్నద్నరు. తెలంగాణకు అవసరమైన చేపలు ఉత్పత్తి చేసి ఇతర రాష్ర్టాలకు పంపించే స్థాయికి రాష్ట్రం చేరుకోవడం సీఎం కేసీఆర్ చొరవేనన్నారు. ప్రతి మత్స్యకారు డు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మెదక్ జిల్లాలో చేపల విత్తనోత్పత్తి చేసి మనమే పంపిణీ చేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. ఇప్పటికే జిల్లాలో పోచారం డ్యామ్, హల్దీ, ఘనపూర్ ప్రాజెక్టుల్లో చేపలు వదలడంతో మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు.
మత్స్యకారులు ఐక్యంగా ఉండి తమ సంఘాలను బలోపేతం చేసుకుని ఆర్థికంగా ఎదుగాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, మత్స్యశాఖ ఏడీ రజిని, మండల కో-ఆప్షన్ సభ్యుడు ఖాలేద్, సర్పంచ్ లు రాజు, యామిరెడ్డి, మంద శ్రీహరి, సాయిలు, రాజేందర్, చెన్నాగౌడ్, ఎంపీటీసీలు మంగ్యా, లక్ష్మణ్, సిద్దిరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు మేకల సాయిలు, నరేందర్‌రెడ్డి, నాగరాజు, రాంచంద్రారెడ్డి ఉన్నారు.