జాతీయ రాజకీయాలపై దృష్టిపెట్టేందుకు ముందడుగు వేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. దేశాన్ని సైతం ప్రగతి పథంలో నడిపే దిశగా తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ని విస్తరించి భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్చడంతో ప్రజలు స్వాగతం పలుకుతున్నారు. అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి అన్నిరంగాల్లో అగ్రపథాన నడుపుతున్నారని సబ్బండ వర్గాలు పేర్కొంటున్నాయి.తెలంగాణ రాష్ట్రంలో అమలవు తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు భవిష్యత్‌లో దేశప్రజలందరికీ చేరుతాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అన్ని వర్గాలు సుఖ సంతోషాలతో ఉండాలంటే అది కేసీఆర్‌తోనే సాధ్యమని, ఆయన జాతీయ రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నారు.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్, అక్టోబర్ 19
దేశం గర్వించదగ్గ పనులు చేసిన బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ దేశరాజకీయాల్లో చక్రం తిప్పడం ఖాయం. అంబేద్కర్ ఆశయాలు కేవలం కేసీఆర్‌తో సాధ్యం.ప్రజా సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేసేన గొప్ప నేత ఆయన. అన్నివర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కావాలంటే సీఎం కేసీఆర్ ప్రధాని కావాలే.. అప్పుడే దేశం ప్రగతి పథంలో దూసుకుపోతుంది. మోదీ మత రాజకీయాలు చేస్తున్నారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. దేశాన్ని నడిపించే గొప్ప నాయకత్వ ఉన్న నేత కేసీఆర్ సొంతం. జాతీయ రాజకీయాల్లో ఆయన ప్రధాన భూమిక పోషిస్తారు. బీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం సృష్టంచడం ఖాయం.
– కోదాది శ్రీనివాస్, మాలమహానాడు సిద్దిపేట జిల్లా వ్యవస్థాపక అధ్యక్షుడు
పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థ్ధానంలో నిలిపిన ఆపర చాణిక్యుడు సీఎం కేసీఆర్. తెలంగాణ మాదిరి దేశాన్ని కూడా అభివృద్ధి పథంలో నడిపించాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు. బీజేపీ పాలనలో దేశం వ్యవసాయ రంగంతో పాటు అనేక రంగాలు వెనుకబడి ఉన్నాయి. వ్యవసాయం, ఉపాధి రంగాలకు తగిన ప్రోత్సాహం లేకుండా పోయింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కొందరికే మేలు చేసేలా పాలన కొనసాగిస్తున్నది. దేశానికి సీఎం కేసీఆర్ లాంటి విజన్ ఉన్న నాయకుడు వస్తే దేశ అభివృద్ధి సాధించడం ఖాయం.భారత దేశానికి కేసీఆర్ లాంటి వ్యక్తి జాతీయ నాయకుడు కావాలి. అప్పుడే రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అమలు జరుగుతాయి.కేంద్రంలోని బీజేపీ పాలన గందరగోళంగా మారింది.తెలంగాణ అన్నిరంగాల్లోఅభివృద్ధి చేసిన వ్యక్తి సీఎం కేసీఆర్ మాత్రమేనని ప్రజలు స్వాగతిస్తున్నారు.
– కల్లూరి అనితాశ్రీనివాస్, ఎంపీపీ, రాయపోల్ మండలం
కేసీఆర్‌తోనే దేశంలో మార్పు సాధ్యమవుతుంది. కేసీఆర్ లాంటి గొప్ప నాయకుడు జాతీయ రాజకీయాల్లోకి రావడం అదృష్టం. ఉద్యమించే సత్తా, పరిపాలన అనుభవం ఉన్న కేసీఆర్ జాతీయ స్థాయిలో రాణించాలి. బీఆర్ఎస్కు మద్దతు తెలిపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. బీజేపీపై ప్రజలకు నమ్మకం పోతున్నది. కార్పొరేట్ శక్తుల కోసమే మోదీ సర్కార్ పని చేస్తున్నది. పేదల అభ్యున్నతి, సంక్షేమం కోసం ఏమాత్రం ఆలోచన చేస్తలేడు. మోదీని గద్దె దించి కేసీఆర్‌ను ఆ స్థానంలో కూర్చోబెడితే దేశం సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది.
-ఆగుళ్ల మల్లేశం, వీరభద్రీయ కులసంఘం జిల్లా అధ్యక్షుడు, ఆర్సీపురం
బీఆర్ఎస్తో సీఎం కేసీఆర్ సంచలనం సృష్టించబోతున్నారు. రాజకీయాలపై అపారమైన అనుభవం ఉన్న కేసీఆర్ దేశ రాజకీయాలకు వెళ్ల డం అదృష్టం. తెలంగాణలో అమలుచేస్తున్న సంక్షేమ పథకాలతో పేదల బతుకులు మారాయి. దేశంలోనూ ఇలాంటి సంక్షేమ పథకాలు అందాలంటే ప్రజలు బీఆర్ఎస్కు మద్దతు తెలిపి, కేసీఆర్‌ను ప్రధానిని చేస్తే సాధ్యమవుతుంది.
– ప్రమోద్‌గౌడ్, ఏఎంసీ డైరెక్టర్, ఆర్సీపురం
అందరికీ మంచి చేసే నాయకుడినే ప్రజలు ఆదరిస్తారు. తెలంగాణలో సీఏం కేసీఆర్ అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమమే ఇందుకు నిదర్శనం. బడుగు, బలహీన వర్గాలకు ఆయన పథకాలే శ్రీరామరక్ష. దేశాన్ని ప్రగతిపథం వైపు నడిపించాలన్నా, పేదలకు న్యాయం జరుగాలన్నా సీఎం కేసీఆర్ (బీఆర్ఎస్)తోనే సాధ్యం. బీజేపీకి ప్రత్యామ్నాయం బీఆర్ఎస్సే. బీఆర్ఎస్తోనే దేశానికి మంచిరోజులు వస్తాయి.
– గుండ్ల సుజాతామహేందర్రెడ్డి, కౌన్సిలర్, బొల్లారం
దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడానికి సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేయడం అభినందనీయం. రాజకీయ నీతిజ్ఞుడు సీఎం కేసీఆర్. దేశాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేయగల విజ్ఞానవంతుడు. దేశ రాజకీయాలు తెలిసిన మహా నేత సీఎం కేసీఆర్. బీఆర్ఎస్ పార్టీతో దేశంలో కొత్త శకం ప్రారంభమైనది. దీన్ని అందరూ స్వాగతిస్తున్నారు.
-ఎం.నరేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ యువనేత, గుమ్మడిదల మండలం
సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన బీఆర్ఎస్వైపు దేశ ప్రజలు ఆసక్తిగా చూస్తుండ్రు. కేంద్రంలో బీఆర్ఎస్ సత్తా చాటుతుంది. కేసీఆర్ లాంటి సత్తా గల నాయకుడు దేశానికి కావాలని ప్రజలు కోరుకుంటుండ్రు. రైతు బంధు, రైతు బీమా దేశమంతటా కావాలని కోరుకుంటుండ్రు. దేశంలో పేదల బతుకులు మారాలంటే ప్రజలు బీఆర్ఎస్కు పట్టంకట్టాలి. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడం గర్వకారణం.
– రవీందర్‌రెడ్డి, వెలిమెల కౌన్సిలర్, ఆర్సీపురం