కొల్చారం/చేగుంట/మెదక్ రూరల్,అక్టోబర్ 15 : కొల్చారం మండల పరిధిలో పోడుభూముల సర్వే అటవీశాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నది. 2017-18లో జరిగిన భూరికార్డుల సర్వేలో అటవీభూములను సాగు చేస్తున్న రైతుల వివరాలు అసంపూర్తిగా ఉంచారు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురి కావడంతో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పోడు భూముల సర్వే చేసి పట్టాలు ఇవ్వాలని నిర్ణయించింది. కలెక్టర్ ఆదేశాలతో కొల్చారంలో పోడు భూముల సర్వే నిర్వహిస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శి అంజయ్య తెలిపారు. కొల్చారంలో 84 మంది, వరిగుంతంలో 15 మంది రైతులు ఈ యాప్లో ఉన్నారని తెలిపారు. వారం రోజుల్లో పూర్తి సర్వే చేసి నివేదిక అందజేస్తామని తెలిపారు. పంచాయతీ కార్యదర్శి అంజయ్య, బీట్ ఆఫీసర్ శారద, సభ్యులు దోమకొండ సత్యనారాయణ, సిద్ధిరాములు, వెంకన్నగారి కృష్ణ పాల్గొన్నారు.
మెదక్లో..
తెలంగాణ ప్రభుత్వం పోడు భూముల సాగు చేస్తున్న రైతులకు హక్కులు కల్పించడానికి సర్వే నిర్వహిస్తునట్లు ఎంపీడీవో శ్రీరాములు తెలిపారు. మెదక్ మండలంలోని ఖాజీపల్లిగ్రామపంచాయతీలో సర్పంచ్ స్వప్న సిద్ధ్దిరాములు యాదవ్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించా రు.అనంతరం పాషాపూర్లో సర్వే నిర్వహించారు.
చేగుంటలో..
పోడు భూముల సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుటుందని చేగుంట ఎం పీడీవో ఆనంద్మేరీ, చెట్లతిమ్మాయిపల్లి సర్పంచ్ మోహన్ రాథోడ్ అన్నారు. మండలపరిధిలోని చెట్ల తిమ్మాయి పల్లిలో శనివారం పోడు భూముల సర్వేను అధికారులతో చేపట్టారు. ఫారెస్టు బీట్ ఆఫీసర్ చిరంజీవి, పంచాయతీ కార్యదర్శి రమేశ్ గ్రామస్తులు ఉన్నారు.