బీఆర్ఎస్తో అన్ని వర్గాలకు మేలు
తెలంగాణ రాష్ర్టాన్ని సాధించమే కాకుండా దేశంలోనే అగ్రగామిగా నిలిపిన మహోన్నత వ్యక్తి సీఎం కేసీఆర్. ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం శుభ పరిణామం. జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించిన కేసీఆర్‌ను సబ్బండ వర్గాలు స్వాగతిస్తున్నాయి. 75 ఏండ్లు పాలించిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కనీసం సాగునీరు, విద్య, వైద్యం, రవాణా, విద్యుత్ లాంటి అవసరాలు కూడా తీర్చలేదు. దేశ సహజ వనరులను పెట్టుబడిదారులకు అప్పగిస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక, కర్షకులను అణిచివేస్తున్నది. మనం కేసీఆర్ వల్ల దేశంలోని అన్ని వర్గాలకు మేలు జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే యాదవుల జీవితాలు బాగుపడ్డాయి. సీఎం కేసీఆర్ ముందు చూపు ఉన్న వ్యక్తి కనుకనే కుల వృత్తులకు ప్రాణం పోస్తున్నారు.
– పోచబోయిన శ్రీహరి యాదవ్, గొర్ల కాపరుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
దేశ రాజకీయాలను శాసిస్తారు..
దేశ ప్రజలు సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. సీఎం కేసీఆర్‌కు ఉన్న రాజకీయ అనుభవం ఇప్పుడు దేశానికి ఎంతో అవసరం. ఎనిమిదేండ్లలోనే తెలంగాణను అభివృద్ధిలో మొదటి వరుసలో నిలిపిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కింది. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి దేశంలో అమలు జరిగితే భారతదేశం అభివృద్ధిపథంలో నిలుస్తుందని నా నమ్మకం. బీఆర్ఎస్ పార్టీ దేశ రాజకీయాలను శాసించడం ఖాయం.
– చొప్పరి సాగర్ముదిరాజ్, ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు, మద్దూరు
తెలంగాణలో అభివృద్ధి పరుగులు
ఆర్థికమాంద్యంలో దేశం కొట్టుమిట్టాడుతున్నది. ప్రస్తుతం దేశంలో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదు. ప్రజలంతా తమ జీవితాలు మార్చే నాయకుడు కావాలని కోరుకుంటున్నారు. అందుకే సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ను విస్తరించి బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేశారు. తెలంగాణలో అభివృద్ధి పరుగులు పెడుతున్నది. కాళేశ్వరంతో నీళ్లు పారిస్తున్నారు. రైతులు ధాన్యపు సిరులు పండిస్తున్నారు. ప్రజల సంక్షేమాన్ని ఒకవైపు, అన్ని మౌలిక వసతులు కల్పిస్తూ మరోవైపు అభివృద్ధి చేస్తూ సీఎం కేసీఆర్ తెలంగాణను ఆదర్శంగా తీర్చిదిద్దారు. అందుకే దేశప్రజలంతా సీఎం కేసీఆర్‌ను దేశరాజకీయాల్లోకి రావాలని స్వాగతిస్తున్నారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) నాయకులు, కార్యకర్తలంతా దేశాభివృద్ధిలో భాగస్వాములమవుతాం.
– నర్సింహులు, ఏఎంసీ డైరెక్టర్, గజ్వేల్
సీఎం కేసీఆర్‌తోనే సమస్యల పరిష్కారం
సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తేనే దేశ ప్రజల సమస్యల పరిష్కారమవుతాయి. తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో నెంబర్ వన్‌గా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది. ఆయన జాతీయ రాజకీయాల్లోకి రావాలని దేశంలోని ప్రజలందరూ కుల, మత, ప్రాంతాలకతీతంగా కోరుకుంటున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న అవినీతి పాలనను అంతమొందించాలంటే అది సీఎం కేసీఆర్‌కే సాధ్యం. అందుకే దేశ రాజకీయాల్లోకి రావాలని అన్ని వర్గాల ప్రజలు స్వాగతం పలుకుతున్నారు.
– ఇమ్మయ్య, జిల్లా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ సభ్యుడు, చౌటకూరు
దేశానికి దిక్సూచి
తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్ దేశానికి దిక్సూచిగా మారారు. ప్రజాసంక్షేమం కోసం ఆయన చేస్తున్న పథకాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. దేశంలోని అన్ని రాష్ర్టాల మేధావులు మెచ్చుకుంటున్నారు. ఎంతో మంది కేసీఆర్ లాంటి నాయకుడు దేశానికి అవసరమని అంటున్నారు. రైతే రాజు అన్న నానుడిని నిజం చేస్తూ ప్రవేశపెట్టిన రైతు పథకాలను అనేక రాష్ర్టాల ప్రజలు ప్రశంసిస్తున్నారు. మా దగ్గర కూడా అమ లుచేయాలని అక్కడి ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నారు. పేదల కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారు. అన్ని రాష్ర్టాలకు సీఎం కేసీఆర్ రోల్ మాడల్‌గా మారారు. – దాస్ యాదవ్, అమీన్పూర్
దేశ రాజకీయాలను ప్రక్షాళన చేయగల సమర్థుడు సీఎం కేసీఆర్
దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించగల సత్తా, దేశరాజకీయాలను ప్రక్షాళన చేయగల సామర్థ్యం సీఎం కేసీఆర్‌కు ఉంది. ఇందుకోసం నెలకొల్పిన (బీఆర్ఎస్)కు ప్రతి రాష్ట్రంలో నీరాజనాలు పలుకుతున్నారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో బీఆర్ఎస్ మంచి ఫలితాలు సాధిస్తుందన్న నమ్మకం ఉంది. మన రాష్ర్టానికి చెందిన నేత పీఎం అభ్యర్థిగా ఎదగారు. ఇప్పుడు దేశం సీఎం కేసీఆర్ వైపు చూస్తున్నది. మన రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రతి ఒక్కరూ ఆకర్షితులవుతున్నారు. సీఎం కేసీఆర్ వేసిన ముందడుగుకు ప్రతి అడుగుగా మేముండాలని భావిస్తున్నాం.
– గటాటి భద్రప్ప, వీరభద్రస్వామి దేవాలయ మాజీ చైర్మన్, బొంతపల్లి, గుమ్మడిదల మండలం.
సీఎం కేసీఆర్ వెంటే జనం
టీఆర్ఎస్ పార్టీ ప్రారంభించిన నాడు చాలామందికి అనుమానాలు కలిగాయి. కానీ సీఎం కేసీఆర్ పార్టీని బలోపేతం చేస్తూ ఉద్యమాన్ని ఉధృతంగా కొనసాగించి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారు. రాష్ట్రంలో రైతుల కోసం రైతు బంధు ప్రవేశపెట్టి ఆదుకున్నారు. ఇప్పుడు రైతుబంధు ద్వారా లక్షలాది మంది రైతులు వరిపంటసాగు చేస్తూ రాష్ర్టాన్ని ధాన్యాగారంగా మార్చారు. రాష్ర్టాభివృద్ధిని చూసి దేశంలోని ఇతర రాష్ర్టాల ప్రజలు సీఎం కేసీఆర్‌ను స్వాగతిస్తున్నారు. దేశ ప్రజల పిలుపు మేరకే సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్లడానికి టీఆర్ఎస్ను బీఆర్ఎస్ పార్టీగా విస్తరించారు.ఇక భవిష్యత్‌లో బంగారు తెలంగాణలాగే బంగారు భారతదేశం కావడం ఖాయం.
– కల్యాణ్కర్ నర్సింగరావు, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) సీనియర్ నాయకుడు
కేసీఆర్ విజన్‌తో దేశంలో విప్లవాత్మక మార్పులు
సీఎం కేసీఆర్ విజన్‌తో దేశంలో విప్లవాత్మక మార్పులు రావడం ఖాయం. జాతీయ రాజకీయాల్లో రాణించే సత్తా, పట్టుదల, చాతుర్యం ఒక్క సీఎం కేసీఆర్‌కు మాత్రమే ఉంది. ప్రస్తుత దేశస్థితిగతులపై అవగాహన ఉన్న ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్. దేశంలోని వనరులు, దేశ పురోగతికి తీసుకుంటున్న చర్యలు, 70 ఏండ్లలో జరిగిన నష్టంపై సీఎం కేసీఆర్ పలు సందర్భాల్లో మాట్లాడడం అందరినీ ఆలోచింపజేస్తున్నది. తెలంగాణ సాధనకు శాంతియుతంగా పోరాటం చేయడంతో పాటు అందరినీ మెప్పించి, ఒప్పించి మద్దతును కూడగట్టిన విషయం సీఎం కేసీఆర్‌లో ఉన్న చతురతకు నిదర్శనం. పట్టుదలతో ఒడిదుడుకులను తట్టుకుని పద్నాలుగేండ్లు సుధీర్ఘ కాలం టీఆర్ఎస్ వేదికగా పోరాటం చేయడం ఆయనలోని కార్యదీక్షను సూచిస్తుంది. తెలంగాణ మాడల్‌ను కోరుకుంటున్న దేశ ప్రజలు రానున్న రోజుల్లో బీఆర్ఎస్ను ఆదరిస్తారు, సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రం గాల్లో అభివృద్ధి చేసి ముందు వరుసలో ఉంచారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తారనే విశ్వాసం దేశప్రజలకు ఉంది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించడం ఖాయం.
– విజయ్ బుజ్జి, ఏఎంసీ వైస్‌చైర్మన్, నారాయణఖేడ్
దేశానికి, ప్రజలకు మేలు జరుగుతుంది
దేశం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలంటే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలి. దేశంలోని అన్ని రాష్ర్టాల ప్రజలు, వారి స్థితిగతులపై సీఎం కేసీఆర్‌కు స్పష్టమైన అవగాహన ఉన్నది. వారి పరిస్థిలను బట్టి జీవనోపాధి కల్పించగలరు. సరైన సమయంలో సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ (బీఆర్ఎస్)ను ప్రకటించారు. మేము పూర్తి మద్దతు తెలుపుతున్నాము. దేశంలోని అన్ని రాష్ర్టాల నాయకులు కూడా టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ఏర్పాటును స్వాగతిస్తున్నారు. బీజే పీ, కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలైనా ఆశించిన స్థాయిలో దేశం అభివృద్ధి చెందలేదు. ఈ విషయాన్ని ప్రజలు గుర్తించారు. తెలంగాణలో పేదల కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారు. జాతీ య రాజకీయాల్లో బీఆర్ఎస్ కీలక ప్రాత పోషించనున్నది.
– శెట్టి శివరాజ్, కొడకంచి సర్పంచు, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు (జిన్నారం)