మెదక్(నమస్తే తెలంగాణ)/జహీరాబాద్, అక్టోబర్ 11: 65వ జాతీయ రహదారి ముంబాయి, హైదరాబాద్ రోడ్టుకు అనుబంధంగా జహీరాబాద్ నుంచి చించోళి వెళ్లే రోడ్డును జాతీయ రహదారిగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆమోద ముద్ర చేసింది. సోమవారం ఢిల్లీలో జరిగిన స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ సమావేశంలో రోడ్డు విస్తరించేందుకు ఆమోదం తెలిపారు. రోడ్డు విస్తరణకు ఎన్ని నిధులు అవసరం అవుతుందని అధికారులు అంచనా వేశారు. జహీరాబాద్ ప్రాంత ప్రజలు చించోళి కలబుర్గా(గుల్బార్గా)వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడే వారు. కర్ణాటకలోని పలు ప్రాంతలకు వెళ్లేందుకు ఈ రోడ్డు ఎంతో ఉపయోగపడుతుంది. సీఎం కేసీఆర్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీర్ హరీశ్‌రావు, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్రావుల కృషితో జాతీయ రహదారిగా గుర్తింపు లభించింది. త్వరలో 55 కిల్లో మీటర్లు రోడ్డును విస్తరణ పనులు చేసేందుకు టెండరులు వేస్తారని అధికారులు తెలిపారు.
జహీరాబాద్- చించోళి రోడ్డుకు కేంద్రం గ్రీన్ సిగ్నిల్
మొగుడంపల్లి మండలంలోని గౌసాబాద్ తండా సరిహద్దు నుంచి కర్ణాటక రాష్ర్టా సరిహద్దు ప్రారంభమవుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జహీరాబాద్ నుంచి రాష్ట్ర సరిహద్దు వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నాలుగు లేన్లుగా రోడ్డు నిర్మాణం చేసింది. రాష్ట్ర సరిహద్దు నుంచి చించోళి జాతీయ రహదారి వరకు రోడ్డు విస్తరణ చేయలేదు. దీంతో కర్ణాటక రాష్ట్రం లో ఉన్న రోడ్డు గుంతల మయంగా ఉంది. జహీరాబాద్-చించోళి రోడ్డుకు జాతీయ రహదారిగా అభివృద్ధి చేసేందుకు ఆమోదించడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రహదారి విస్తరణతో బ్రిడ్జిలు, కాల్వర్టులు నిర్మాణం
జాతీయ రహదారిగా జహీరాబాద్-చించోళి రోడ్డు విస్తరణ చేసేందుకు సర్వే చేసిన జాతీయ రహదారి ఇంజినీరింగ్ అధికారులు ఎన్ని బ్రిడ్జిలు, ఎన్ని కల్వర్టులు అవసరం నిర్మాణం చేయవలసి ఉందో గుర్తించి, ప్రభుత్వనికి నివేదిక పంపించారు. జాతీయ రహదారిగా రోడ్డు నిర్మాణం చేస్తే ఎంతో భూ సేకరణ చేయాలని ఆంచనా వేశారు. జహీరాబాద్ నుంచి చిన్న హైదరాబాద్, హోతి(బి), గోవింద్పూర్, మన్నాపూర్, మొగుడంపల్లి గ్రామాల్లో డివైడర్లు నిర్మాణంతో పాటు విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసే ఆవకాశం ఉన్నది. మొగుడంపల్లి , గౌసాబాద్, గౌసాబాద్తండా రాష్ట్ర సరిహద్దు వరకు తెలంగాణ ప్రభుత్వం భూసేకరణ చేస్తుంది, కర్టాటక సరిహద్దు నుంచి చించోళి జాతీయ రహదారి వరకు అక్కడి ప్రభు త్వం భూ సేకరణ చేస్తుందని అధికారులు తెలిపారు. రోడ్డును జాతీయ రహదారి ఇంజినీరింగ్ అధికారులు మరో సారి సర్వే చేసి టెండరులు వేస్తారని తెలిపారు.
మెదక్-ఎల్లారెడ్డి జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్
మెదక్ నుంచి ఎల్లారెడ్డి వరకు 43.91 కిలోమీటర్ల జాతీయ రహదారి ఏర్పాటుకు తాజాగా కేంద్రం ఆమోదముద్ర వేసింది. 43.91 కిలోమీటర్ల మేర నిర్మాణానికి రూ.400 కోట్లు అంచనా వ్యయం కానున్నది. మెదక్ పట్టణ శివారులోని ఎల్లమ్మ గుడి వద్ద నుంచి ప్రధాన రహదారి మీదుగా ధాన్యన్చంద్ విగ్రహం, హవేళీఘనాపూర్ మండలం నుంచి ఎల్లారెడ్డి వరకు ఈ జాతీయ రహదారిని నిర్మించనున్నారు. ఇప్పటికే సర్వే పూర్తి చేసినట్టు ఎన్‌హెచ్ అధికారులు చెబుతున్నారు. మరో నెల రోజుల్లో టెండర్ల కసరత్తు పూర్తి చేస్తామని నేషనల్ హైవే అధికారులు తెలిపారు.