చిలిపిచెడ్, అక్టోబర్ 9 : ప్రభుత్వం ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో మిషన్ భగీరథ పథకం ప్ర తిష్టాత్మకంగా ప్రవేశపెట్టింది. కానీ, కొందరు గ్రామీణ ప్రజలు భగీరథ నీటిని వినియోగించుకోకపోవడంతో సంబంధిత అధికారులు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. చిలిపిచెడ్ మండలంలోని వివిధ గ్రామాల్లో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ప్రజలకు భగీరథ తాగునీటి వినియోగంపై అవగాహన కల్పిస్తూ.. భయం పోగొడుతున్నారు. తాగునీటితోపాటు నీటి సరఫరాలో సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచిస్తూ సమస్యలను తక్షణమే పరిష్కరిస్తున్నారు. మిషన్ భగీరథ నీటిలో సరైన పోషకాలు ఉంటాయని, భగీరథ నీటిని తాగడంతో ఆరోగ్యంగా ఉంటారని మైక్రో బయాలజిస్ట్ వివరి స్తున్నారు. మిషన్ భగీరథ తాగునీటిలో ఉన్న టీడీఎస్(నీటిలో మొత్తంగా కరిగి ఉన్న ఘనపదార్థాలు)పై ఆయా గ్రామాల ప్రజలకు ప్రయోగాత్మకంగా చూపించారు. భగీరథ నీటిని అనేక వి ధాలుగా ప్రయోగాత్మకంగా పరిశీలించి, మనిషి ఆరోగ్యానికి సరిపడే పోషకాలు కలవడంతోపాటు, పలు దఫాలుగా నీటిని శుద్ధి చేసిన తర్వాతే గ్రామాలకు పంపిణీ చేస్తామన్నారు.
మిషన్ భగీరథ నీటిలో టీడీఎస్ 150 నుంచి 300 వరకు ఉంటుందని, బోరు నీటిలో టీడీఎస్ 500 నుంచి 600 వరకు ఉంటుందన్నారు. బోరునీటిని తాగితే ఎముకల సంబంధిత వ్యాధులు వస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఫిల్టర్ నీటిలో టీడీఎస్ 30 నుంచి 60 వరకు ఉంటుందని, ఈ నీటిని తాగినా శరీరానికి ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. భగీరథ నీరు రంగు మారినా? తేడా కనిపించినా? నీటిని వేడి చేసుకొని తాగాలన్నారు. గ్రామాల్లోని వాటర్ట్యాంకులను మూడు రోజులకొకసారి కడిగి, బ్లీచింగ్ ఫౌడర్ కలపాలని సూచిస్తున్నారు.
పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తాం
చిలిపిచెడ్ మండలంలోని అన్ని గ్రామా ల్లో మిషన్ భగీరథ తాగునీటి సరఫరా ఉన్నది. ఆయా గ్రామాల్లో ప్రజలు ఎక్కువగా ఫిల్టర్ నీటిని, తండాలోని గిరిజను లు బోరునీటిని తాగుతున్నారు. అధికారు లు సైతం ఫిల్టర్ నీరు తాగుతున్నారు. భగీరథ తాగునీటిలో ఉన్న పోషకాలు, వాటి ప్రాముఖ్యత తెలియజేస్తూ ప్రతి గ్రా మంలో పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తాం. అధికారులు సైతం ‘భగీరథ’ నీటిని తాగుతూ ఆదర్శంగా ఉండాలి.
– అన్వేశ్రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ, చిలిపిచెడ్ మండలం