చేగుంట, అక్టోబర్ 9 : అంగన్వాడీ కేంద్రాలు చిన్నారుల ఆరోగ్యానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. దీంతోపాటు గర్భి ణులు, బాలింతలకు పౌష్టికాహారం అందజేస్తున్నాయి. అంగన్ వాడీ టీచర్లు, ఆయాలు స్వయంగా న్యూట్రీషన్లుగా మారారు. అంగన్వాడీ కేంద్రాల్లో న్యూట్రీషన్ గార్డెన్ ఏర్పాటు చేస్తున్నారు. గార్డెన్ పెంపకంతో అంగన్వాడీ కేంద్రానికి వచ్చే బా లింతలు, గర్భిణులు, చిన్నపిల్లలకు పౌష్టికాహారం అందజేస్తున్నారు. గార్డెన్ పెంపకంతో ప్రతి ఒక్కరికీ పోషకాహారం అందుతున్నది. చేగుంట మండలపరిధిలోని రాంపూర్తోపాటు స్థానిక తండాల్లోని అంగన్వాడీ కేంద్రాల వద్ద ఉన్న ఖాళీ స్థలాల్లో న్యూట్రీషన్ గార్డెన్ పెంచుతున్నారు. ప్రభుత్వం మాతాశిశు ఆరోగ్య సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నది. ఇందులో భాగంగా బాలింతలు, గర్భిణులు, చిన్నపిల్లలకు పోషకాలతో కూడిన పౌష్టికాహారం అందజేయడానికి స్వయంగా ఆకు కూరలతోపాటు కూర గాయ లను పండిస్తున్నారు.
అంగన్వాడీ కేంద్ర పరిసరాల్లో రసాయన ఎరువులను వినియోగించకుండా కూరగాయలను పండించాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్థానిక సర్పంచ్ ప్రజల సహకారంతో అంగన్వాడీ కేంద్రం సమీపంలోని ఖాళీ స్థలంలో ఆకు కూరలు పెంచాలని ఆదేశించింది. అధిక పోషక విలువలు ఉన్న పాలకూర, బచ్చలకూర, తోట కూర, గోంగూర, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, చిక్కుడు, బెండ, గుమ్మడి, సోయాబీన్, పచ్చిమిర్చి, వంకాయ, టమాట, మునగ, నిమ్మ వంటి 15 రకాలకు పైగా పంటలను పండిస్తున్నారు. పండిన పంటలతో బాలింతలు, గర్భిణులు, చిన్నపిల్లలకు వంటలు వండి భోజనం పెట్టా లని అంగన్వాడీ టీచర్లను ఆదేశించింది. ఈ మేరకు అంగన్ వాడీ టీచర్లు చిన్నారులకు విద్యాబోధన చేస్త్తూనే.. స్వయంగా వంటలు చేసి, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందజే స్తున్నారు. సేంద్రియ ఎరువులతో పండించిన కూరలతో భోజనం పెట్టడంతో మహిళలతోపాటు చిన్నారులు సంపూర్ణ ఆరోగ్యవంతులవుతున్నారు. రాంపూర్ అంగన్వాడీ కేంద్రంలో నిర్వ హించిన న్యూట్రీషన్ ప్రదర్శనకు మండల, జిల్లా అధికారులు కితాబునిచ్చారు.
పౌషికాహారం అందించాలన్నదే లక్ష్యం
బాలింతలు, గర్భిణులు, చిన్నపిల్లలకు సంపూర్ణ పౌష్టికాహారం అందించాలన్నదే అంగన్వాడీ కేంద్రాల లక్ష్యం. ఖాళీ స్థలం లో రసాయనాలు లేకుండా సేంద్రియ ఎరువులతో పండించిన కూరగాయలతో సంపూర్ణ భోజనం అందజేస్తున్నాం. పోషక విలువలు ఉన్న ఆహారంతోనే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారు. ప్రభు త్వం మాతాశిశు సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నది. ఇందులో భాగంగా పౌష్టికాహారం అందజేస్తున్నాం.
– రాంకుమారి, అంగన్వాడీ టీచర్, రాంపూర్