చిన్నకోడూర్, అక్టోబర్ 9: బీఆర్ఎస్ పార్టీకి విరాళాలు వెల్లువలా వస్తున్నాయని టీఆర్ఎస్ (బీఆర్ఎస్) రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణ శర్మ అన్నారు. ఆదివారం చిన్నకోడూర్ మండలంలోని గంగాపూర్ యాదవ సంఘం సభ్యులు రూ.10 వేలు, విఠలాపూర్ యువజన సంఘం రూ.20 వేలు విరాళం ఇచ్చారన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు సంక్షేమ పథకాల అమలులో పూర్తిగా విఫలమయ్యాయన్నారు. సీఎం కేసీఆర్ పట్టుదలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారో అదే పట్టుదలతో దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు న్యాయం చేస్తారన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలోని ప్రజలకు అందివ్వాలనే లక్ష్యంతో టీఆర్ఎస్ను బీఆర్ఎస్పార్టీగా మార్పుచేస్తూ నిర్ణయం తీసుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కూర మాణిక్యరెడ్డి, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) మండల అధ్యక్షుడు కాముని శ్రీనివాస్, వైస్ ఎంపీపీ పాపయ్య, రైతు బంధు సమితి జిల్లా డైరెక్టర్ వెంకటేశం, గంగాపూర్ సొసైటీ చైర్మన్ కనకరాజు, సర్పంచు లింగారెడ్డి, టీఆర్ఎస్(బీఆర్ఎస్) యువజన విభాగం మండల అధ్యక్షుడు గుండెల్లి వేణు, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ఉమేశ్చంద్ర, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు శ్రీనివాస్, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) నాయకులు పాల్గొన్నారు.