మెదక్/ సంగారెడ్డి, అక్టోబర్ 8:దేశ ప్రజల ప్రగతి కోసం జాతీయ రాజకీయాలపై దృష్టిపెట్టేందుకు ముందడుగు వేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. దేశాన్ని సైతం ప్రగతిపథంలో నడిపే దిశగా తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)ను భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)గా మార్చడంతో ప్రజలు స్వాగతం పలుకుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇక దేశప్రజలకు సైతం చేరుతాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర నిరంకుశ పాలనను పారదోలే సత్తా ఉన్న నాయకుడు కేసీఆర్ అని చెబుతున్నారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాలంటే అది కేసీఆర్‌తోనే సాధ్యమని, ఆయన జాతీయ రాజకీయాల్లోకి రావడాన్ని స్వాగతిస్తున్నారు.
కేసీఆర్ ఏది పట్టినా బంగారమే!
దేశ్‌కీ నేత కేసీఆర్.. ఆయన ఏది పట్టినా అది బంగారమే. ఎక్కడ అడుగిడినా ఘన విజయమే. బీఆర్ఎస్తో దేశంలో నవ శకం మొదలైంది. తెలంగాణ తరహాలో దేశం అభివృద్ధి సాధిస్తుంది. అన్నివర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతాయి. ముఖ్యంగా తెలంగాణ రైతాంగాన్ని ఏవిధంగానైతే ఆదుకున్నాడో, దేశ రైతాంగాన్ని ఆదుకోవడానికి కేసీఆర్ దేశ రాజకీయాల్లో అడుగిడుతున్నాడు. 24 గంటల ఉచిత విద్యుత్, ఇంటింటికీ తాగునీరు, సాగునీరు అందించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుంది. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథాకాలు తెలంగాణలో అమలవుతున్నాయి. అందుకే ఇక్కడి పథకాలను కేంద్రం కాపీ కొడుతోంది. మిషన్ భగీరథ ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రధాని మోదీ స్వయంగా ఆ పథకాన్ని ప్రశంసించాడు. కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనాన్ని ప్రపంచదేశాలు కొనియాడుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు కాలం చెల్లింది. సీఎం కేసీఆర్ యావత్ భారతదేశ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని, దేశ ప్రజల, నాయకుల ఆహ్వానం మేరకు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా ప్రకటించడంపై రైతులు, కార్మికులు, యువత, మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ ప్రధాని అయ్యే వరకు ప్రతి ఒక్కరమూ అవిశ్రాంతంగా పనిచేస్తామని ప్రతినబూనుతున్నాం. – గంగుమల్ల ఎలక్షన్‌రెడ్డి, ఫుడ్‌కార్పొరేషన్ మాజీ చైర్మన్
కారణ జన్ముడు
దేశాభివృద్ధి సీఎం కేసీఆర్‌తోనే సాధ్యం అవుతుంది. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి అభివృద్ధిలో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా నిలిపింది సీఎం కేసీఆర్. ఆయన కారణజన్ముడు. ప్రజా సమస్యలు గుర్తించి అన్న వర్గాలకు ఉపాధి కల్పిస్తున్నది ఆయనే. దేశంలోనూ అన్నివర్గాల ప్రజలను అభివృద్ధి బాటలోకి తీసుకువచ్చేది కూడా సీఎం కేసీఆర్ ఒక్కరే.
– వెంకటేశంగౌడ్, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు జిన్నారం
పేదల సంక్షేమమే కేసీఆర్ ధ్యేయం
పేదల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. విజయదశమి రోజు టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా పేరు మార్చడం హర్షణీయం. రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రాష్ర్టాన్ని ఆదర్శంగా నిలుపుతున్నారు. అలాగే కేసీఆర్ బీఆర్ఎస్తో దేశంలోని అన్ని వర్గాల ప్రజల కోసం పనిచేస్తారనడంలో సందేహం లేదు. కేంద్రం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై బీఆర్ఎస్ ఉద్యమిస్తుంది.
– లావణ్యరెడ్డి,జడ్పీవైస్ చైర్పర్సన్ మెదక్
దేశంలో మార్పు తథ్యం
బీజేపీని గద్దె దించగల ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్. ఆయన ముందుచూపు, ఆలోచనా విధానం వల్లే నేడు తెలంగాణలో రైతులు, ఉద్యోగులు, కార్మికులు, అన్ని వర్గాల వారు అభివృద్ధి ఫలాలు అందుకుంటూ సంతోషంగా ఉంటున్నారు. కేసీఆర్ దేశ రాజకీయాల్లో ఉంటే దేశ ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందుతాయి. బీఆర్ఎస్ ఏర్పాటుతో బీజేపీలో ప్రకంపనలు మొదలయ్యాయి. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడం వల్లే దేశంలో గొప్ప మార్పు వస్తుంది.
– చిన్నారపు ప్రభాకర్, సొసైటీ చైర్మన్, వరిగుంతం, కొల్చారం మండలం
దేశానికి బీఆర్ఎస్ కావాలి..
తెలంగాణ మోడల్ అభివృద్ధి దేశమంతటా జరగాలంటే ప్రజలు భారత్ రాష్ట్ర సమితిని ఆదరించాలి. రాష్ట్ర ప్రజలకు అందే ప్రయోజనాలు దేశ ప్రజలకు అందించేందుకు సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మా ర్పు చేశారు. దేశ రాజకీయాల్లో పూర్తిస్థాయి అవగాహన కేసీఆర్‌కే రానున్న రోజుల్లో ప్రజలు పట్టంకడుతారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు దేశ ప్రజలు ఆకర్షితులవుతున్నారు.
– తాళ్ల కుమార్‌గౌడ్,జిల్లా గ్రంథాలయ డైరెక్టర్, ఆర్సీపురం
నవ భారత నిర్మాత సీఎం కేసీఆర్
తెలంగాణ మాదిరిగా దేశాన్ని అభివృద్ధి దిశగా నడిపించగల సమర్థవంతమైన నాయకుడు సీఎం కేసీఆర్. రైతాంగ సమస్యలపై అపారమైన అనుభవం ఆయన సొంతం. తెలంగాణ వ్యాప్తంగా అమలు అవుతున్న సంక్షేమ పథకాలు దేశం అంతటా అమలు కావాలంటే కేసీఆర్ నాయకత్వం రావాలి. బీఆర్ఎస్ రానున్న రోజుల్లో అతిపెద్ద పార్టీగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. శక్తివంతమైన నవభారత నిర్మాణం బీఆర్ఎస్తేనే సాధ్యం.
– హన్మంత్‌రెడ్డి (బొల్లారం మున్సిపల్ కౌన్సిలర్)
దేశంలో పేద ప్రజలకు పథకాలు చేరాలి
దేశంలోని ప్రతి నిరుపేదకు ప్రభుత్వ పథకాలు అందాలంటే కేసీఆర్ వంటి గొప్పనాయకుడు దేశానికి ఎంతో అవసరం. తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న రైతు బంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్, తాగు, సాగు నీరు వంటి ఎన్నో పథకాలు, అన్ని రాష్ర్టాల్లో అందినప్పుడే రైతులు, అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందుతారు.
– మాసుల శ్రీనివాస్, ఎంపీపీ చేగుంట, జిల్లా ఎంపీపీల ఫోరం ఉపాధ్యక్షుడు
పేదల సంక్షేమంతోనే దేశాభివృద్ధి…
పేదల సంక్షేమంతోనే దేశాభివృద్ధి జరుగుతుంది. దేశంలో ఎన్నో రాష్ర్టాల్లో తాగు, సాగు నీటికి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి, పరిశ్రమలు ఏర్పాటుకు అవకాశాలు ఉన్నప్పట్టికీ ఆచరణలో అమలు చేయని నాయకత్వం లేకపోవడంతో, ఉపాధిలేక కొన్నిరాష్ర్టాల ప్రజలు ఇతర రాష్ర్టాలకు వలసలు వెళ్తున్నారు. పేదల సంక్షేమం, దేశాభివృద్ధి జరుగాలంటే కేసీఆర్ వంటి నాయకుడు దేశానికి అవసరం.
– మంచికట్ల శ్రీనివాస్,మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు, చేగుంట
దేశ ప్రజలకు మేలు జరుగుతుంది..
సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన భారత్ రాష్ట్ర సమితితో దేశ ప్రజలకు మేలు జరుగుతుంది. కేసీఆర్ దగ్గర ఉన్న పాలనాదక్షత మరే నాయకుడి వద్ద లేదు. కేంద్రంలో బీజేపీ తీసుకుంటున్న నిర్ణయాలతో పేద ప్రజల బతుకులు ఆగమవుతున్నాయి. ఈ తరుణంలో సీఎం కేసీఆర్ జాతీయ పార్టీగా టీఆర్ఎస్ను డిక్లర్ చేసి దేశ రాజకీయాల్లోకి వెళ్లడం మంచి నిర్ణయం. దేశం అభివృద్ధి చెందాలంటే కేసీఆర్‌లాంటి నాయకుడు కేంద్రంలో ఉండాలి.
– అంజయ్య, కటింగ్ షాపు యజమాని, ఆర్సీపురం
బీఆర్ఎస్ ఏర్పాటు చారిత్రాత్మకం
టీఆర్ఎస్ పార్టీని జాతీయ పార్టీగా ప్రకటిస్తూ సీఎం కేసీఆర్ భారత్ రాష్ట్ర సమితిగా ఏర్పాటు చేయడం చారిత్రాత్మక నిర్ణయం. ఒక్కడితో ప్రారంభమైన టీఆర్ఎస్ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. సాధించిన తెలంగాణ అభివృద్ధిలో ముందుంచారు. రాష్ర్టాన్ని ఆగ్రగామిగా నిలిపిన సీఎం కేసీఆర్ సంక్షేమ, అభివృద్ధి పథకాలను దేశవ్యాప్తంగా అమలుచేయడంతో పాటు దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారు.
– స్వరూపానరేందర్రెడ్డి, ఎంపీపీ వెల్దుర్తి