నిజాంపేట, అక్టోబర్ 8 : పూర్వం రోజుల్లో ప్రజలు వ్యవసాయ పొలాలు, ఇతర గ్రామాలకు వెళ్లాలంటే నడుస్తూనే గమ్యాలను చేరుకునేవారు. నిత్యం నడవడంతో శారీరకంగా, మానసికంగా ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. కాగా, రవాణా సాధనాలు అందుబాటులోకి రావడంతో ప్రజలు నెమ్మదిగా నడకను తగ్గించారు. సైకిల్, బైకులు, కారులు ఇతర రవాణా సాధనాల వినియోగం గణనీయంగా పెరిగింది. సైకిల్ తప్పా మిగతావన్నీ ఇంధనంతో నడిచే సాధనాలు. మానవుడి నిజ జీవితంలో రవాణా సాధనాలు అవసరంగా మారాయి. ప్రస్తు తం ఎక్కడికి పోవాలన్నా వాహనాలపై ఆధారపడడంతో శారీరక శ్రమ తగ్గి రోగాల బారిన పడుతున్నారు. సాంకేతిక జీవనంలో మానవుడు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురై అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఆహార అలవాట్లు, జీవనవిధానం, సాంకేతిక సాధనాలతో దైనందిన జీవితంలో శారీరక శ్రమ తగ్గింది. ఇప్పుడుప్పుడే ప్రజల్లో ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. యోగా, వ్యాయాయం, ఇతర పద్ధతులను పాటి స్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. నడకను నమ్ముకుంటే సంపూర్ణ ఆరోగ్యం దక్కినట్లే. నడక ప్రారంభిస్తే ఆరోగ్యంతో పాటు రోగాలు దరిచేరవు. నడక (వాకింగ్) అవసరం, దాని ప్రాముఖ్యత తెలుసుకోవడంతో చాలామంది ఉదయం పూట నడుస్తున్నారు. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు నడ వాలని వైద్యులు సూచిస్తున్నారు. పాదరక్షలు లేకుండా మట్టి రోడ్డు, ఇసుక దిబ్బలు, గడ్డి మైదానాల్లో నడిస్తే చాలా మం చిది. నడకతో శారీరక శ్రమ పెరిగింది, జీవన క్రియ ల్లో వేగం పెరిగి ఆరోగ్యంగా ఉండ వచ్చు. ప్రతిరోజూ ఉదయపు వేళ క్రమం తప్పకుండా నడవడం మంచిది. బరువు తగ్గాలనే ఆలోచనతో నడకను ప్రారంభించొద్దు. ప్రతిరోజూ క్రమం తప్పకుండా సాధారణ స్థాయిలో నడవడం ఉత్తమం.
నడకతో కలిగే ప్రయోజనాలు
మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.
దేహదారుఢ్యాన్ని పెంపొందిస్తుంది.
జీర్ణ శక్తి క్రియ మెరుగుపర్చడంతోపాటు మలబద్ధకం నివారించి, మధుమేహం, గుండె సంబంధ వ్యాధులు రానివ్వదు.
కీళ్ల నొప్పులు, వెన్నునొప్పి తగ్గుతుంది.
అధిక బరువు, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది.
ఉదయం పూట నడిస్తే జ్ఞాపకశక్తి పెరిగి, మెదడు చురుగ్గా పనిచేస్తుంది.
ఉదయం వేళ స్వచ్ఛమైన ప్రాణవాయువు(ఆక్సిజన్) పీల్చుకోవడంతో శరీర కణాలు ఉత్తేజితం చెందుతాయి.
రాత్రి భోజనం చేసిన తర్వాత కనీసం 10 నిమిషాల పాటు నడిస్తే గుండెపోటు సమస్యలు తగ్గడంతోపాటు
కడుపు ఉబ్బరం, ఎసిడిటీ సమస్యలు రావు.
శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడుతుది. శ్యాస సంబంధిత వ్యాధులు, నొప్పులు తగ్గుతాయి.
ఎముకల్లో కాల్షియం స్థాయి పెరిగి గట్టిపడుతాయి.
ఆరోగ్యంగా ఉంటున్నా
నడించేంత దూరం ఉన్నా నడలేక ప్రతిరోజూ ఉదయం నుంచి సాయం త్రం వరకు ఎక్కడికి వెళ్లిన బైక్‌పైనే వెళ్లేవాడిని. కొన్నిసార్లు నడవాలని ప్రయత్నిస్తే నడవలేక పోయాను. కొద్ది దూరం నడిచే సరికి ఆయాసం వచ్చేది. దీంతో ఆరోగ్యంపై దృష్టి పెట్టాను. ముందుగా నడక తర్వాత వ్యాయామం ఎంచుకున్న. స్నే హితుల సలహాతో మొదటి రోజు 10 నిమిషాలు, రెండో రోజు 20 నిమిషాల నడక ప్రారంభించి, ప్రస్తుతం గంట సేపు నడుస్తున్నాను. నడకతో నాకు అనారోగ్య సమస్యలు తగ్గి, పూర్తిగా ఆరోగ్యంగా ఉంటున్న.
– గుడ్ల శ్రీకాంత్, నిజాంపేట
వాకింగ్ అలవాటుగా మారింది
మొదట్లో నడకను ఇబ్బందిగానే ప్రారంభించాను. క్రమంగా నడకను అలవాటుగా మార్చుకున్నా. ప్రతి రోజూ ఉదయం ఐదు అయిందంటే చాలు స్నేహితులకు ఫోన్ చేసి గ్రౌం డ్కు రమ్మని చెబుతాను. రోజువారీ జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. సమస్యల తో ఏర్పడిన తీవ్ర మానసిక ఒత్తిడికి మంచి ఔషధం నడక. ఉదయం వేళ ప్రశాంతమైన వాతవరణంలో నడక మంచి అనుభూతిని ఇస్తుంది. ప్రతిరోజూ ఉదయం వేళ గ్రౌండ్‌కు వచ్చి నడుస్తుండడం అలవాటుగా మారింది.
– గాండ్ల పరమేశ్వర్, నిజాంపేట