శివ్వంపేట, సెప్టెంబర్ 24 : సీఎం కేసీఆర్ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తున్నారని ఎంపీపీ కల్లూరి హరికృష్ణ అన్నారు. శివ్వంపేటలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ బతుకమ్మ ఉత్సవాలు అన్ని గ్రామాల్లో విజయవంతం చేసేలా సర్పంచ్‌లు కృషి చేయాలన్నారు.
ఎమ్మె ల్యే పర్యటనలు జరిగినప్పుడు అధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు. శివ్వంపేటలోని ప్రభుత్వ దవాఖా నలో 24 గంటలపాటు ప్రజలకు వైద్య సేవలు అందుతా యని తెలిపారు. ‘మనఊరు-మనబడి’లో నిధులు మంజూ రయ్యాయని, సర్పంచ్‌లు ప్రత్యేక చొరవ తీసుకొని పాఠశాల ల్లో పనులు పూర్తి చేయాలని సూచించారు. రేషన్‌కార్డుల్లో పేర్ల తొలిగింపు, నమోదు చేసుకునే అవకా శం ఉందని, దీనిపై ప్రజలకు సర్పంచ్‌లు అవగాహన కల్పించాలన్నారు. 315, 316 సర్వేనంబర్లలో రైతులు ఎదుర్కొంటున్న స మస్యలకు త్వరలో శాశ్వత పరిష్కారం లభి స్తుందన్నారు.
శివ్వంపేటలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణానికి అనువైన స్థలం కేటాయిస్తాన్నారు. ఎమ్మెల్యే మదన్‌రెడ్డి స హకారంతో మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని, సర్పంచ్‌లు ప్రజలకు జవాబుదారీతనంగా పనిచేయాలని సూచించారు. మండలంలో చేపట్టిన అభివృద్ధి పనుల ను త్వరగా పూర్తి చేయాలని సర్పంచ్‌లు, అధికారులకు సూ చించారు. ఇటీవల లక్నోలో జరిగిన జాతీయ సదస్సుకు వెళ్లిన ఎంపీపీ హరికృష్ణను సన్మానించారు. సమావేశంలో వైస్ ఎంపీపీ రమాకాంత్‌రెడ్డి, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మన్సూర్, తహసీల్దార్ శ్రీనివాస్‌చారి, ఇన్చార్జి ఎంపీడీవో తిరుపతిరెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ కిషన్, పీఏసీఎస్ చైర్మన్ వెంకటరామిరెడ్డి, కోఆప్షన్ సభ్యులు లాయక్ పాల్గొన్నారు.