మెదక్ మున్సిపాలిటీ, సెప్టెంబర్ 22 : పంట సాగులో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందని, రాష్ట్రంలో పం టసాగు పెరిగిందని, బీహార్, బెంగాల్, ఉత్తరప్రదేశ్ నుంచి కూలీలు వచ్చి ఉపాధి పొందుతున్నారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. గురువారం మెదక్ జిల్లా సాధారణ సర్వసభ్య సమావేశం జడ్పీ చైర్పర్సన్ ర్యాకల హేమలతా శేఖర్‌గౌడ్ అధ్యక్షతన జరిగింది. సమావేశానికి మంత్రితో పాటు ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి, కలెక్టర్ హరీశ్, అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వరి పం టతోపాటు ఇతర పంటల సాగు పెరిగిందన్నారు. 2021లో మెదక్ జిల్లాలో 5లక్షల 50వేల మెట్రిక్ టన్నులకు పైగా వరి పంట పండిందన్నారు. కోటీ 35లక్షల ఎకరాల్లో వరితోపాటు వివిధ పంటలు సాగు చేసినట్లు చెప్పారు. రైతులు పామాయిల్ సాగు చేసే విధంగా వ్యవసాయధికారులు చర్యలు తీసుకోవాలని, పామాయిల్‌కు వరి పంట కంటే డబుల్ ధర వస్తుందని తెలిపారు. యాసంగిలో విత్తన సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని మంత్రి వ్యవసాయాధికారులకు సూచించారు. వానకాలపు పంట కొనుగోలు కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఉపాధి హామీ నిధులు జిల్లాకు రూ.10కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు.
జిల్లా కేంద్రం మెదక్‌తో పాటు నియోజకవర్గాల కేంద్రాలను మెడికల్ హబ్‌గా మారుస్తామని మంత్రి అన్నారు. త్వరలోనే జిల్లాకు మెడికల్ కళాశాల రాబోతున్నదని, ఎంసీహెచ్ పక్కనే 400 పడకల దవాఖానను నిర్మించబోతున్నట్లు వెల్లడించారు. క్రిటికల్ కేర్‌కు రూ.23కోట్లు మంజూరు చేశారన్నారు. జిల్లాకు బీసీ మహిళా డిగ్రీ కళాశాల సైతం మంజూరు చేసినట్లు మంత్రి వెల్లడించారు. జిల్లాకు 57 పల్లె దవాఖానలు, 11 బస్తీ దవాఖానలు మంజూరయ్యాయని, తొందరగా ప్రారంభించాలన్నారు. ఆగస్టులో జిల్లాలో 1011 ప్రసవాలు జరుగగా, 809 ప్రసవాలు ప్రభుత్వ దవాఖానల్లోనే జరిగాయని డీఎంహెచ్‌వో వెంకటేశ్వర్లు మంత్రికి వివరించారు. మంత్రి ఆయనను అభినందించారు.
మెదక్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : ఎన్నో ఏం డ్లుగా పోడు భూములను సాగుచేస్తూ అటవీ హకు పత్రాలు పొందని గిరిజన, గిరిజనేతరులకు న్యాయం చేస్తామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. గురువారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో 85 గ్రామాల్లో 7,740 ఎకరాలకు సంబంధించి 4,503 క్లెయిమ్‌లు స్వీకరించి ఆన్లైన్లో పొందుపరిచామన్నారు. 85 పంచాయతీల్లోని 140 హాబిటేషన్లో 4,606 ఎకరాలకు సంబంధించి 2,776 క్లెయిమ్‌లు సకాలంలో వచ్చినా ఆన్లైన్లో వివరాలు కనిపించకపోవడంతో పొందుపరచలేకపోయారన్నారు. ఇందుకు సంబంధించి సమగ్ర వివరాలు మండలాల వారీగా ఎంపీడీవోలకు అందించాలని అటవీశాఖ అధికారికి సూచించారు. పోడు భూములు సాగు చేస్తున్న నిజమైన గిరిజన, గిరిజనేతరులకు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు అందించడంతో పాటు, ఇక ముందు అటవీ భూములు ఆక్రమణలు జరుగకుండా, వాటి పునర్జీవానికి అటవీ రక్షణ చట్టం అమలుపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ ర్యాకల హేమలతాశేఖర్‌గౌడ్, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి, కలెక్టర్ హరీశ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, అదనపు ఎస్పీ బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.
రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో వరితో పాటు ఇతర పంటల సాగు గణనీయంగా పెరిగిందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు అన్నారు. గురువారం మెదక్ జడ్పీ సమావేశ మందిరంలో చైర్పర్సన్ హేమలత అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. దీనికి మంత్రి హాజరై, మాట్లాడారు. పామాయిల్‌కు వరి కంటే డబుల్ ధర వస్తుందని, ఆ దిశగా రైతులను ప్రోత్సహించాలని వ్యవసాయాధికారులకు సూచించారు. మెదక్ జిల్లాలో లక్షా 60వేల కుటుంబాలుంటే, లక్షా 20 వేల ఆసరా పింఛన్లు వస్తున్నాయన్నారు. త్వరలో జిల్లాకు మెడికల్ కాలేజీ రాబోతున్నదని, 400 పడకలతో దవాఖానను నిర్మిస్తున్నట్లు వివరించారు. బీసీ మహిళా డిగ్రీ కళాశాల సైతం మంజూరు చేసినట్లు తెలిపారు.