మర్కూక్, సెప్టెంబర్ 22 : సీఎం కేసీఆర్ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి సంపద సృష్టించి, అన్నివర్గాల ప్రజలకు పంచుతున్నారని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని కల్యాణ మండపంలో లబ్ధిదారులకు ఆసరా పింఛన్లు, మహిళలకు బతుకమ్మ చీరలను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ అన్నారు. ఏటా సీఎం కేసీఆర్ తెలంగాణ ఆడబిడ్డలందరికీ చీరల పంపిణీ చేస్తున్నారన్నారు. రూ. 57 ఏండ్లు నిండిన అర్హులందరికీ సీఎం కేసీఆర్ పెద్దకొడుకులా రూ.2016 పింఛన్ ఇస్తున్నారన్నారు. లబ్ధిదారుల ముఖంలో సంతోషం కల్పించిన ఏకైక సీఎం కేసీఆర్ అన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ పాండుగౌడ్, జడ్పీటీసీ మంగమ్మ, గజ్వేల్ ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కరుణాకర్‌రెడ్డి, అదనపు కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్, ఆర్డీవో విజయేందర్‌రెడ్డి, ‘గడా’ ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, తహసీల్దార్ భవానీ, ఎంపీడీవో ప్రవీణ్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు కృష్ణయాదవ్, సర్పంచ్ అచ్చంగారి భాస్కర్, ఎంపీటీసీ చైతన్యశంకర్రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ ప్రతి కార్యకర్తకు అండగా నిలబడుతుందని, ప్రతిఒక్కరినీ కాపాడుకుంటుందని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని బయ్యారం గ్రామానికి చెందిన పార్టీ కార్యకర్త చింతకింది స్వామి రోడ్డు ప్రమాదం లో మృతిచెందారు. అతడికి పార్టీ సభ్య త్వం ఉండడంతో ప్రమాదబీమా రూ.2 లక్షల చెక్కును ఆయన భార్య శ్యామలకు ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కార్యకర్తలను కం టికి రెప్పాల కాపాడుకుంటారని, అందుకోసమే బీమా సౌకర్యాన్ని తీసుకొచ్చారన్నారు. ప్రమాద ఘటనలో మృతిచెందిన వారికి బీమా వర్తించడంతో చెక్కులను సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుల సహకారంతో అందజేశామన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మల్లేశం, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బెండే మధు, నాయకులు దయాకర్‌రెడ్డి, నవాజ్‌మీరా, రమేశ్‌గౌడ్, గ్రామ కమిటీ అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, కుమార్, మహిపాల్‌రెడ్డి, నర్సింహరెడ్డి, మోహన్‌బాబు పాల్గొన్నారు.