ఆసరా లబ్ధిదారులందరికి త్వరగా కార్డులు అందజేయాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్ ఆదేశించారు. కార్డుల పంపిణీ పురోగతి, పోడు భూములపై సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో విడివిడిగా ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మూడు రోజుల్లోగా పింఛన్ కార్డులు అందరికి అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. త్వరలో పోడు భూములపై ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో జిల్లా కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. అటవీ ప్రాంత గ్రామాలు, గ్రామ కమిటీలు, సబ్ డివిజన్ కమిటీలు, కార్యాచరణ తదితర అంశాలపై కలెక్టర్ ఆరా తీశారు. సమావేశాల్లో డీఆర్డీవో, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, డీపీఏంలు, అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఫిరంగి, జిల్లా అటవీ శాఖ అధికారి వెంకటేశ్వర రావు, ఆర్డీవోలు పాల్గొన్నారు.
సంగారెడ్డి కలెక్టరేట్, సెప్టెంబర్ 19: లబ్ధిదారులందరికి ఆసరా పింఛన్ కార్డులు వేగంగా పంపిణీ చేయాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ ఏ.శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో డీఆర్డీవో, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, డీపీఏంలతో నియోజకవర్గాల వారీగా ఆసరా పింఛను కార్డుల పంపిణీ పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గల ఆసరా పింఛన్‌దారులందరికీ కార్డులు ఇవ్వాలని సూచించారు. జాప్యం లేకుండా మూడు రోజులుగా పింఛను కార్డుల పంపిణీ పూర్తిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి, డీఆర్డీడీవో శ్రీనివాసరావు, జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీపీవో సురేశ్ మోహన్, పరిశ్రమల శాఖ జీఏం ప్రశాంత్ కుమార్, డీసీవో ప్రసాద్, అదనపు పీడీ సూర్యారావు, డీపీఏంలు పాల్గొన్నారు.
అనంతరం జిల్లాలోని పోడు భూములపై కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ త్వరలో రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆధ్వర్యంలో జిల్లా కో ఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. పోడు భూములకు సంబంధించి వచ్చిన దరఖాస్తులు, అటవీ ప్రాంత గ్రామాలు, ఏర్పాటు చేసిన గ్రామ కమిటీలు, సబ్ డివిజన్ కమిటీలు, కార్యాచరణ, చేసిన పనుల వివరాలు, పరిశీలన, విచారణ తదితర అంశాలపై కలెక్టర్ ఆరా తీశారు. ఆయా వివరాలను సంబంధిత అధికారులు కలెక్టర్‌కు వివరించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఫిరంగి, జిల్లా అటవీ శాఖ అధికారి వెంకటేశ్వర రావు, డీఆర్వో రాధికా రమణి, సంగారెడ్డి, జహీరాబాద్, ఆర్డీవోలు నగేశ్, రమేశ్ బాబు పాల్గొన్నారు.