నర్సాపూర్, సెప్టెంబర్ 16 : తెలంగాణ రాష్ట్రం అభివృద్ధ్దిలో దేశానికే ఆదర్శంగా మారిందని ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నర్సాపూర్ పట్టణంలో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు ఎమ్మెల్యే ఆధ్వర్యం లో అట్టహాసంగా జరిగాయి. మొదటగా ఐబీ కార్యాలయ సమీపం నుంచి పట్టణ శివారులోని అల్లూరి సీతారామరాజు గిరిజన గురుకుల పాఠశాల వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో సుమారు 11 వేల మంది పాల్గొన్నారు. అనంతరం గిరిజన గురుకుల పాఠశాలలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, రాష్ట్ర లేబర్ వెల్ఫేర్ బోర్డ్ చైర్మన్ దేవేందర్‌రెడ్డి, అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మాట్లాడుతూ.. అహింసా మార్గంలో గాంధీజీ దేశానికి స్వాతంత్య్రం ఎలా తీసుకువచ్చారో, సీఎం కేసీఆర్ కూడా అహింసా మార్గంలోనే తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి దేశానికే ఆదర్శంగా నిలిచారన్నారు. 24 గంటల ఉచిత విద్యు త్, ఆసరా పింఛన్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్, రైతుబంధు, డబుల్ బెడ్రూం ఇండ్ల్లు తదితర పథకాల తో అన్నివర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. తెలం గాణలో జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేక బీజేపీ, కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్పై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్ర హం వ్యక్తం చేశారు. దేశాన్ని నాశనం చేస్తున్న బీజేపీ తెలంగా ణలోకి చొచ్చుకువస్తుందని, మతోన్మాద బీజేపీని బొందపెట్టా లని పిలుపునిచ్చారు. ఏ ఎన్నికల్లోనూ బీజేపీకి ఓటు వేయ కుండా తరిమికొట్టాలని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ నాయకులు చివరకు తెలంగాణ సాయుధ పోరాట చరి త్రను సైతం వక్రీకరించే చర్యలకు పాల్పడుతున్నారని విమ ర్శించారు. తెలంగాణ వజ్రోత్సవ ర్యాలీని విజయవంతం చేసిన అధికారులకు, నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.
సీఎం కేసీఆర్‌కు అండగా ఉండాలి: మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డి
తెలంగాణ సమైక్యతా వజ్రోత్సవాలతో ఊరూరా పండుగ వాతావరణం నెలకొన్నదని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి పేర్కొన్నారు. రాచరిక వ్యవస్థ నుంచి తెలంగాణ సమాజం ప్రజాస్వామిక వ్యవస్థలోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా వజ్రోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బీజేపీ నాయకులు తెలంగాణ చరిత్రను తెలుసుకో వాలని సూచించారు. విమోచనం, విలీనం అంటూ తెలం గాణ చరిత్రను వక్రీకరిస్తున్నారని విమర్శిచారు. వజ్రోత్సవాల ప్రాముఖ్యతను విద్యార్థులు తెలుసుకోవాలని సూచిం చారు. తెలంగాణ వజ్రోత్సవాలను మూడు రోజులపాటు నిర్వహిం చాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఈ నెల 16న నియోజకవర్గ స్థాయి ర్యాలీలు, సభలు, 17న జాతీయ పతాకం ఆవిష్కరణ, సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగే సభకు హాజరుకావడం, 18న జిల్లాస్థాయిలో సమరయోధులు, కవు లు, కళాకారులకు సన్మాన కార్యక్రమాలను చేపట్టాలని వివ రించారు. తెలంగాణ ప్రజల కష్టాలు తెలిసిన నాయకుడు కేసీఆర్ అన్నారు. బంగారు తెలంగాణ సాధనలో సీఎం కేసీఆర్‌కు ప్రజలు అండగా ఉండాలని సునీతారెడ్డి పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ అనసూయాఅశోక్గౌడ్, ఆత్మ కమి టీ చైర్మన్ వెంకట్‌రెడ్డి, ఆర్డీవో వెం కటఉపేందర్రెడ్డి, టీఆర్ఎస్ నా యకులు శ్రీధర్‌గుప్తా, అశోక్‌గౌడ్, భిక్షపతి, ప్రసాద్, అధికారులు, కౌన్సిలర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పీఏసీఎస్ చైర్మన్లు పాల్గొన్నారు.