శివ్వంపేట, సెప్టెంబర్ 15 : తెలంగాణ సచివాలయానికి బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని తీసుకున్న నిర్ణయంపై హర్షా తిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు ఉసిరికపల్లి గ్రామం లో సర్పంచ్, మాలమహానాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పోతరాజు బాబూరావు ఆధ్వర్యంలో గురువారం గ్రామస్తుల తో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ సూ చించినట్లు కొత్త పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల కోఆప్షన్ సభ్యుడు లాయక్, నాయకులు కృష్ణారావు, శ్రీనివాస్‌గౌడ్, భిక్షపతి, లక్ష్మీనారాయణ, జయంత్‌కుమార్, మల్లేశ్ ఉన్నారు.
రాజ్యాంగ నిర్మాతకు అరుదైన గౌరవం
మార్కెట్ కమిటీ చైర్మన్ యాదగిరి
రామాయంపేట, సెప్టెంబర్ 15 : రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బీఆర్ అంబేద్కర్‌కు సీఎం కేసీఆర్ అరుదైన గౌర వం కల్పించారని రామాయంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ యాదగిరి పేర్కొన్నారు. రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం సరైన నిర్ణయమన్నారు. ఈ మేరకు వ్యవసాయ మార్కెట్ కమిటీలో కమిటీ సిబ్బంది, డైరెక్టర్లతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం దళిత వర్గాలతోపాటు అన్ని వర్గాలను సంతోషపర్చిందన్నారు. పార్లమెం టుకు సైతం అంబేద్కర్ పేరు పట్టాలని కోరారు. కార్యక్రమం లో వైస్ చైర్మన్ రాజిరెడ్డి, డైరెక్టర్లు భిక్షపతి, రెడ్డిశెట్టి రవీందర్, బోనాల శ్రీనువాస్, వెంకటేశం, రైతులు పాతూరి సిద్దిరాములు, భాగయ్య తదితరులు పాల్గొన్నారు.