పటాన్చెరు, సెప్టెంబర్ 15: వజ్రోత్సవాలకు పటాన్చెరు పట్టణంలో భారీ ఏర్పాట్లు చేపట్టారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో 15వేల మందితో ర్యాలీ నిర్వహించనున్నారు. ర్యాలీలో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, సేవా సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు, మహి ళా సంఘాలు, అంగన్వాడీలు, యువత, కార్మికులు, రైతులు పాల్గొననున్నారు. ఎమ్మెల్యే సూచనల మేరకు అధికారులు మైత్రీ మైదానంలో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ మల్టీపర్పస్ ఫంక్షన్‌హాల్, మున్నూరు కాపు భవనం, సంఘం ఫంక్షన్ హాల్లో భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. అదనపు కలెక్టర్ వీరారెడ్డి తహసీల్దార్ మహిపాల్‌రెడ్డితో కలిసి మైత్రీ మైదానంలో ఏర్పాట్లను పరిశీలించారు.
వజ్రోత్సవ ర్యాలీ ఏర్పాట్లు చూసిన కలెక్టర్ శరత్
వజ్రోత్సవాల ఏర్పాట్లను సంగారెడ్డి కలెక్టర్ శరత్, ఎస్పీ రమణకుమార్తో కలిసి పరిశీలించారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో వజ్రోత్సవాల ఏర్పాట్లను చూసి వారు సంతృప్తి చేందారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి ప్రజలు భారీగా వస్తున్నారని ఎమ్మెల్యే వివరించారు. దా దాపు 15వేల మందితో ర్యాలీ జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపా రు. ర్యాలీలో పాల్గోంటున్నవారికి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.