మెదక్ జిల్లా కేంద్రంతోపాటు పలు ప్రాంతాల్లో బుధవారం పొగమంచు కమ్ముకుంది. తెల్లవారుజామున 6గంటల నుంచి తొమ్మిది గంటల వరకు పొగమంచు కురవడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఉదయం 9 గంటలు దాటినా పొగమంచు వీడకపోవడంతో హెడ్లైట్లు వేసుకొని ప్రయాణించారు.
మెదక్ జిల్లా కేంద్రంతోపాటు, చిన్నశంకరంపేట, నర్సాపూర్‌లో, సంగారెడ్డి జిల్లా న్యాల్కల్లో బుధవారం తెల్లవారు జామున 6 గంటల నుంచి 8 గంటల వరకు రహదారులు, పంటపొలాలలను పొగమంచు కప్పేసింది. దీంతో వాహనదారులు పాదచారులు ఇబ్బంది పడ్డారు. పొగ మంచుతో రోడ్డు కనిపించక పోవడంతో కొందరు వాహనదారులు రోడ్డుపై తమ వాహనాలు నిలుపుకొన్నారు. 8గంటలు దాటిన పొగ మంచు విడవకపోవడంతో మరికొందరు తమ వాహనాలకు హెడ్ లైట్లు వేసుకుని ప్రయాణించారు.
– న్యూస్ నెట్వర్క్, సెప్టెంబర్ 27