రామాయంపేట, జూన్ 13: నెల రోజులుగా ఇంట్లో ఉండి ఆటలాడిన చిన్నారులు సోమవారం తమ బ్యాగులను చంక లో పెట్టుకుని చదువుల బాటపట్టారు. ప్రభుత్వం ఎప్పటిలాగే జూన్ 13న విద్యా సంవత్సరం ప్రారంభించింది. సోమవారం బడికి వచ్చిన విద్యార్థులకు మెనూ ప్రకారం మధ్యాహ్నం సన్న బియ్యంతో భోజనంతో పాటు గుడ్డును కూడా పెట్టారు. ప్రభు త్వ నిబంధనల ప్రకారం హెచ్ఎంలు పేరెంట్స్ కమిటీలను పెట్టి పాఠశాలకు సహకరించాలని ప్రతి విద్యార్థిని ప్రభుత్వ పాఠశాలకు వచ్చేలా తమవంతు ప్రయత్నం చేయాలని తెలిపారు. ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వం పాఠశాలలో అన్ని వసతులతో పాటు ఆంగ్ల విద్యను కూడా ప్రారంబించిందన్నారు. ఈ తీర్మాణాలకు కమిటీలు ఒప్పందం చేసుకుని సంతకాలు చేశారు.
రామాయంపేట పట్టణంలోని గతంలోని ప్రైవేటు పాఠశాలలకు వెళ్తున్న 3, 5తరగతుల విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో పేర్లు నమోదు చేసుకున్నారు. సోమవారం పాఠశాల ప్రారంభం రోజునే బాలికల ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో ఏడుగురు విద్యార్థులు నూతనంగా అడ్మిషన్లను తీసుకున్నారు.
వెల్దుర్తి, జూన్ 13: పాఠశాలలు పునఃప్రారంభం కావడం తో సోమవారం విద్యార్థులు ఉత్సాహంగా పాఠశాలలకు వెళ్లా రు. మండలంలోని స్టేషన్ మాసాయిపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను జిల్లా పరిషత్ చైర్మన్ హేమలతశేఖర్గౌడ్, వెల్దుర్తి జడ్పీటీసీ రమేశ్గౌడ్తో కలిసి సందర్శించారు. పాఠశాలలో విద్యార్థులు సంఖ్య తక్కువగా ఉండడంపై ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లను, ఎంపీటీసీ నవనీతశ్రీను, సర్పంచ్ నర్సింలును అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల సంఖ్యను పెంచాలని, ప్రైవేటు విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు వచ్చేలా చూడాలన్నారు. పాఠశాల ఆవరణ చుట్టూ ప్రహారీ నిర్మాణం మంజూరు చేయాలని ఎంపీటీసీ, సర్పంచ్లు కోరగా స్పందించిన జడ్పీ చైర్మన్ పాఠశాల చుట్టూ ప్రహారీ నిర్మాణానికి నిధు లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.
చిలిపిచెడ్, జూన్ 13: మండలంలో ఉన్న పాఠశాలలు ప్రా రంభం కావడంతో ఆయా పాఠశాలలకు విద్యార్థులు హాజరయ్యారు. చిలిపిచెడ్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు నయాబ్ తహసీల్దార్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షురా లు లక్ష్మీదుర్గారెడ్డి, హెచ్ఎం విఠల్ స్కూల్కు వచ్చే విద్యార్థులకు పూవ్వలు ఇచ్చి స్వాగతం తెలిపారు.
కొల్చారం, జూన్13: కొల్చారం మండల వ్యాప్తంగా సోమవారం ప్రభుత్వ పాఠశాలలు పండుగ వాతావరణంలో ప్రారంభమయ్యాయి. ఈ నెల ప్రారంభం నుంచి బడిబాటలో ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరుగుతూ బడీడు పిల్లలను గుర్తించడంతో పాటు ప్రభుత్వ పాఠశాలకు రావాలని మొటివేట్ చేయడంతో విద్యార్థులు ప్రాంరంభం రోజే ఉత్సాహంగా పాఠశాలలకు రావడం కనిపించింది.
చేగుంట, జూన్ 13: ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు మెరుగైన విద్యా అందుతున్నదని మండల విద్యాధికారి బుచ్చనాయక్ పేర్కొన్నారు. సోమంవారం విద్యాధికారి బుచ్చనాయక్ పలు పాఠశాలను సందర్శించారు. నార్సింగిలో విద్యార్థులకు గులాబీ పూ లు ఇచ్చి తరగతి గదులకు ఆహ్వానించారు.