సిద్దిపేట, జూన్ 8 : మృగశిర కార్తెను పురస్కరించుకొని సిద్దిపేట పట్టణంలోని చేపల మార్కెట్కు బుధవారం వినియోగదారుల తాకిడి పెరిగింది. ఉదయం నుంచే చేపలు కొనేందుకు పెద్ద ఎత్తున జనం మార్కెట్కు వచ్చారు. దీంతో మార్కెట్ మొత్తం సందడిగా మారింది.
హుస్నాబాద్ టౌన్, జూన్ 8: చేపల కోసం జనం ఎగబడ్డారు. బుధవారం పట్టణంలో భారీగా చేపల విక్రయాలు జరిగాయి. స్థానిక మల్లెచెట్టు చౌరస్తా వద్ద చేపల మార్కెట్కు ఉదయం నుంచే జనం తరలివచ్చారు. ఒకదశలో ఆ ప్రాంతమంతా జనంతో కిక్కిరిసిపోయింది. మృగశిరకార్తె రోజు చేపలు తింటే ఆరోగ్యంగా ఉంటామని, ఆస్తమా లాంటి వ్యాధులు దూరమవుతాయనే నమ్మకం ప్రజల్లో ఉన్నది. బొమ్మె చేపలు కిలోకు రూ.400నుంచి రూ.500 వరకు విక్రయించగా, ఇతర చేపలు కిలోకు రూ.200 వరకు పలికాయి. రొయ్యలు సైతం కిలోకు రూ.400 చొప్పున పలికినప్పటికీ పెద్ద ఎత్తున కొనుగోలు చేసేందుకు జనం వెనుకాడలేదు.