మనోహరాబాద్/ నిజాంపేట/ రామాయంపేట రూరల్/ మెదక్ రూరల్/ చేగుంట/ చిలిపిచెడ్/ తూప్రాన్, జూన్ 8 : పల్లె ప్రగతితో పల్లెలు ఆదర్శ గ్రామాలుగా మారుతున్నాయని మెదక్ జడ్పీ చైర్పర్సన్ హేమలతాశేఖర్‌గౌడ్ అన్నారు. మనోహరాబాద్ మండలం పాలాటలో పర్యటించి, స్వచ్ఛతపై మ హిళలకు అవగాహన కల్పించారు. నూతనంగా నిర్మిస్తున్న పం చాయతీ భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ… ఇంటింటికీ తప్పనిసరిగా ఐదు మొక్కలను నాటి సంరక్షించాలన్నారు.
పల్లె ప్రగతిలోనే కాకుండా ప్రతి రోజూ ఇంటితోపాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూ చించారు. కార్యక్రమంలో ఈఈ పీఆర్ సత్యనారాయణ, ఏఈ పీఆర్ నర్సింహులు, ప్రత్యేకాధికారి నరేందర్‌గౌడ్ ఉ న్నారు. మనోహరాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో 6వ రోజు పల్లె ప్రగతి పనులు కొనసాగాయి. నిజాంపేట మండ లంలో అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో పల్లెప్రగతి పనులు జోరుగా కొనసాగుతున్నాయి. ఎంపీవో రాజేందర్ పనులను పరిశీలించారు. పల్లె ప్రగతి పనులపై నిర్లక్ష్యం వహించొద్దని డీపీవో తరుణ్ అన్నారు. అల్లాదుర్గం మండలంలోని మాందాపూర్, ముస్లాపూర్, బహిరన్‌దిబ్బ గ్రామాల్లో పల్లె ప్రగతి పనులను పరిశీలించారు.
పల్లె ప్రగతి లో భాగంగా స్థలాలను గుర్తించి, మొక్కలను నాటాలని జడ్పీ సీఈవో శైలేశ్ అన్నారు. హవేళీఘనపూర్ మండలం బూర్గుప ల్లిలో పనులను పరిశీలించారు. ఆయన వెంట కార్యక్రమంలో ఎంపీపీ నారాయణరెడ్డి, సర్పంచ్ చెన్నాగౌడ్, ఎంపీడీవో శ్రీరామ్, ఏపీవో రాజ్‌కుమార్ ఉన్నారు. మెదక్ మండలంలో పల్లె పనులను ఎంపీడీవో శ్రీరాములు పరిశీలించారు. కోం టూర్లో పెండింగ్ పనులను పూర్తి చేయాలని తహసీల్దార్ శ్రీనివాస్ సూచించారు. నార్సింగి మండలంలోని వల్లూర్‌లో నర్సరీని ఎంపీపీ సబిత సందర్శించారు. పల్లె ప్రగతి పనులను పక్కాగా నిర్వహించాలని చిలిపిచెడ్ ఎంపీడీవో కృష్ణమోహన్ అన్నారు. తూప్రాన్ మండలం నాగులపల్లిలో డీఎల్పీవో శ్రీనివాసరావు వైకుంఠధామాన్ని పరిశీలించారు.
