మెదక్ మున్సిపాలిటీ/ తూప్రాన్/ రామాయంపేట, జూన్ 8 : పరిసరాలను ప్రతి ఒక్కరూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని మెదక్ మున్సిపల్ చైర్మ న్ చంద్రపాల్ అన్నారు. పట్టణ ప్రగతిలో భాగం గా 6వ రోజు బుధవారం 24, 25వ వార్డుల్లో మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, కౌన్సిలర్లు మేఘమాల రాంచరణ్‌యాదవ్, కృష్ణారెడ్డి, కమిషనర్ శ్రీహరి, డీఈ మహేశ్‌తో కలిసి పర్యటించారు. వార్డు సమస్యలను గుర్తించి సత్వరమే పరిష్కరించారు.
ప్రత్యేకాధికారులు వార్డుల్లో సమస్యలను గుర్తించాలన్నారు. వారివెంట ఆత్మ కమిటీ వైస్ చైర్మన్ వెంకటనారాయణ, కౌన్సిలర్ శ్రీనివాస్, ఏఈలు బాలసాయగౌడ్, సిద్ధేశ్వరి, శానిటరీ ఇన్స్పెక్టర్ చంద్రమోహన్, టీపీఎస్ దేవరాజు ఉ న్నారు. రామాయంపేటలో 5వ వార్డులో మున్సి పల్ చైర్మన్ జితేందర్‌గౌడ్, కమిషనర్ శ్రీనువాసన్ పర్యటించి, ర్యాలీ నిర్వహించారు.
వారివెంట కౌన్సిలర్ శోభ, ఆర్పీ రూప, మున్సిపల్ సిబ్బంది కృష్ణ, రమేశ్, ప్రసాదరావు, వర్క్ ఇన్స్పుక్టర్ శ్రీని వాస్, టీఆర్ఎస్ నేత కొండల్‌రెడ్డి ఉన్నారు. తూప్రాన్ పట్టణంలోని 2వ, 5వ వార్డుల్లో నిర్మిస్తున్న క్రీడా ప్రాంగణ పనులను ‘గడా’ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, తూప్రాన్ మున్సిపల్ చైర్మ న్ రాఘవేందర్‌గౌడ్‌తో కలిసి పశీలించారు.