చేగుంట/ నిజాంపేట/ రామాయంపేట రూరల్, జూన్ 8 : ‘మన ఊరు-మనబడి’తో ప్ర భుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందుతున్నదని ఉపాధ్యాయులు ఇంటిం టికీ తిరుగుతూ తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని కరపత్రాలను పంపిణీ చేశారు. పాఠశాలలకు కొత్తగా వచ్చిన చిన్నారులతో సా మూహిక అక్షరాభ్యాసం చేయించి, మిఠాయి లు అందజేశారు. ప్రభుత్వ బడికి పిల్లలను పం పించాలని, ప్రభుత్వం పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, సన్నబియ్యంతో భోజనం, ఉచిత పుస్తకాలు, యూనిఫాం అందజేస్తున్నదన్నారు. చేగుంట మండలంలోని కర్నాల్‌పల్లి, చిన్నశివునూర్ గ్రామాల్లో నిర్వహించిన బడిబాటలో ఉప సర్పంచ్ పొన్నాల భూపతి, ప్రైమరీ స్కూల్ హెచ్ఎంలు సత్యనార్యాణ, ప్రభాకర్, వార్డు సభ్యులు చింతాకుల లక్ష్మి, అంగన్వాడీ టీచర్ కొంసాని శ్రీదేవి, నాయకులు కుమ్మరి నర్సింహులు, ఎస్ఎంసీ చైర్మన్ కృష్ణ, టీచర్లు సంపత్, కవిత, జగన్‌లాల్, రవీందర్, శర్మ ఉన్నారు.
‘మన ఊరు-మనబడి’తో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పడుతున్నదని నిజాంపేట ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు అన్నారు. నస్కల్ ప్రాథమిక పాఠశాలలో ‘మన ఊరు-మనబడి’ పనులను సర్పంచ్ కవితతో కలిసి ప్రారంభించారు. నస్కల్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు రూ.10.32 లక్షలు మంజూరైనట్లు తెలిపా రు. రూ.51 వేలతో కరెంట్ మరమ్మతు పనులను చేపట్టనున్నారు. కార్యక్రమంలో హెచ్ఎం సాగరిక, ఎస్ఎంసీ చైర్మన్ రమ్య, కార్యదర్శి ప్రేమలత ఉన్నారు. రామాయంపేట మండలం కోనాపూర్‌లో ప్రాథమికోన్నత పాఠశాల ఉపాద్యాయులు ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ బడుల్లో 1 నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం ప్రారంభిస్తున్నట్లు గ్రామస్తులకు వివరించారు. బడిబాలో హెచ్ఎం రవీందర్‌గౌడ్, టీచర్లు ఎస్బీఆర్ మహేశ్వరి, నాగేశ్వర్రావు ఉన్నారు.