స్వచ్ఛత, పచ్చదనమే లక్ష్యంగా ప్రభుత్వం అమలుచేస్తున్న పల్లె, పట్టణ ప్రగతి మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. మెదక్ జిల్లా నర్సాపూర్ మండల పరిధిలోని పెద్దచింతకుంటలో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి , మనోహరాబాద్ మండలం దండుపల్లిలో మెదక్ జడ్పీ చైర్ పర్సన్ ర్యాకల హేమలతాశేఖర్‌గౌడ్, వెంకటాపూర్ అగ్రహారంలో గడా ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, సంగారెడ్డి జిల్లా పటాన్చెరు, జిన్నారం మండలం కొడకంచిలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ నెల 18వ తేదీ వరకు కొనసాగనున్న ఈ మహాయజ్ఞంలో భాగంగా మొదటి రోజు గ్రామసభలు, పట్టణ సమావేశాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఇంటి ఎదుట మొక్కలు నాటి, పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి సమస్యలు గుర్తించి పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. పిచ్చిమొక్కలు, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలిగించి, రోడ్లపై గుంతలను పూడ్చి, తాగునీటి పైప్లైన్ల లీకేజీలకు మరమ్మతులు చేపడుతామని తెలిపారు. అభివృద్ధి పనుల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములై ప్రగతి వేడుకను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం మద్దికుంట గ్రామాన్ని కలెక్టర్ హనుమంతరావు సందర్శించి పల్లెప్రకృతి వనం,నర్సరీ, క్రీడా ప్రాంగణం పనులను పరిశీలించారు.
పటాన్చెరు టౌన్, జూన్ 3: పట్టణ ప్రగతికి ప్రాధాన్యత ఇస్తున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పటాన్చెరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పట్టణ ప్రగతి వాహనాలను ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే మాట్లాడుతూ మూడు డివిజన్లలో అభివృద్ధి వేగవంతం అయ్యిందన్నారు. 10రోజుల పాటు నిర్వహించే పట్టణ ప్రగతి పనుల్లో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని సూచించారు.
ప్రతి ఇంటి ఎదుట మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతామన్నారు. కార్పొరేటర్లు ప్రజల మధ్య ఉండి పట్టణ ప్రగతిని విజయవంతం చేయాలని సూచించారు. మున్సిపల్ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, కార్పొరేటర్లు మెట్టు కుమార్‌యాదవ్, పుష్పానగేశ్, సింధూఆదర్శ్‌రెడ్డి, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ బాలయ్య, విజయ్ కుమార్ పాల్గొన్నారు.
రామాయంపేట, జూన్ 3: రామాయంపేట పట్టణంలోని పట్టణ ప్రగతిలో భాగంగా పారిశుధ్య పనులు జోరందుకున్నా యి. శుక్రవారం 8, 4వ వార్డుల్లో జరుగుతున్న పనులను చైర్మన్ పల్లె జితేందర్‌గౌడ్, కమిషనర్ శ్రీనివాస్, సిబ్బంది, కౌన్సిలర్లు గజవాడ నాగరాజు, దేమె యాదగిరి పరిశీలించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టణాల అభివృద్ధి కోసం పట్టణ ప్రగతిని ప్రవేశపెట్టాడని చైర్మన్ అన్నారు. కోనాపూర్లోఎంపీపీ నార్సింపేట భిక్షపతి, సర్పంచ్ చంద్రకళ ఆధ్వర్యంలో గ్రామ సభలో ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో మేనేజర్ శ్రీనివాస్ బిల్ కలెక్టర్ కాలేరు ప్రసాద్, కార్యదర్శి చంద్రహస్, దీపక్‌రెడ్డి, కోనాపూర్ వార్డు సభ్యులు ఉన్నారు.
మెదక్ మున్సిపాలిటీ, జూన్3: పట్టణ సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న పట్టణ ప్రగతి ఎంతో దోహదపడుతున్నదని మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ అన్నారు. పట్టణ ప్రగతి నాలుగో విడుత కార్యక్రమం శుక్రవారం ప్రారంభించారు. తొలి రోజు పట్టణం లో 32వార్డుల్లో వార్డు కమిటీ ఇన్చార్జిలు, వార్డు కౌన్సిలర్ల ఆధ్వర్యంలో సమావేశాలు ఏర్పాటు చేసి వార్డుల సమస్యలు తెలుసుకుని, వార్డుల్లో చేపట్టే కా ర్యక్రమాలు, పనులపై చర్చించారు.
వార్డుల్లో పర్యటించి అభివృద్ధి, మౌలిక సదుపాయాలు కల్పన, పారిశుధ్య పనులను పర్యవేక్షించారు. 31, 32వార్డుల్లో చైర్మన్, వైస్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్ ఆయా వార్డుల కౌన్సిలర్లతో కలిసి పట్టణ ప్రగతి సమావేశాలను ప్రారంభించి వార్డుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి వెంట మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రాగి అశోక్, మున్సి పల్ డీఈ మహేశ్, ఏఈ సిద్ధేశ్వరి, టీపీఎస్ దేవరాజ్, సానిటరీ ఇన్స్పెక్టర్ చంద్రమోహన్ పాల్గొన్నారు.

బొల్లారం, జూన్ 3: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నాలుగో విడత పట్టణప్రగతి కార్యక్రమాన్ని బొల్లా రం మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ కొలన్ రోజాబాల్రెడ్డి, కమిషనర్ రాజేంద్రకుమార్‌తో కలిసి 8వార్డులో ప్రారభించారు.
అనంతరం పట్టణ ప్రగతి మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా వార్డు సభను నిర్వహించారు. వార్డులోని ప్రజలకు పట్టణ ప్రగతి కార్యక్రమంపై అవగాహన కల్పించారు. పట్టణాభివృద్ధిలో ప్రాధాన్యత గల సమస్యలను పరిగణలోకి తీసుకుని పరిష్క రించే విధంగా కృషి చేయాలన్నారు. అనంతరం వార్డులో అధికారులతో కలిసి మొక్కలు నాటారు. మొదటి రోజు మున్సిపాలిటీ పరిధిలోని 22వార్డుల్లో పట్టణ ప్రగతి కార్యక్రమాలను వార్డు కమిటీల ఆధ్వర్యంలో అట్టహాసంగా ప్రారంభించారు. కార్యక్రమంలో ఆర్వో శ్రీధర్, శానిటరీ ఇన్స్పెక్టర్ వినోద్‌కుమార్, మెప్మా సభ్యురాలు సరిత, స్థానికులు రామ్మూర్తి పాల్గొన్నారు.
మున్సిపాలిటీ పరిధిలోని నాలుగో విడత పట్టణప్రగతి కార్యక్రమాన్ని టీఆర్ఎస్ జిల్లా సీనియర్ నాయకుడు, 16వ వార్డు కౌన్సిలర్ చంద్రారెడ్డి అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ మేరకు వార్డులో పర్యటించి వార్డు సభను నిర్వహించారు. వార్డులోని సమస్యల నివేదికను అధికారులకు స్థానికుల సమక్షంలో అందజేశారు.
ఈ సందర్భంగా చంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం పట్టణాభివృద్ధికి తోడ్పాటునందించేలా పట్టణప్రగతి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. పదిహేను రోజుల పాటు నిర్వహించే కార్యక్రమంలో వార్డుల్లోని సమస్యలను ప్రణాళికాబద్ధంగా పరిష్కరించుకునే అవకాశం ఉంటుందన్నా రు. కార్యక్రమంలో ఆర్వో శ్రీధర్, స్థానికులు సీతామహాలక్ష్మి, శేఖర్, బాలకృష్ణ, జైరాం, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

నర్సాపూర్, జూన్ 3 : నర్సాపూర్ మున్సిపాలిటీలోని ఆయా వార్డుల్లో శుక్రవారం 4వ విడుత పట్టణప్రగతి కార్యక్రమం ప్రారంభమైంది. మున్సిపల్ చైర్మన్ మురళీయాదవ్ పలు వార్డు ల్లో పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ నయిమోద్దీన్ 9వ వార్డులో కాలనీవాసులతో కలిసి పట్టణప్రగతి ర్యాలీని చేపట్టారు. ఆర్డీవో ఉపేందర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ చాముండేశ్వరి వార్డుల్లో ర్యాలీ చేపట్టారు.
ఆయా వార్డుల్లో కౌన్సిలర్లు వార్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి వార్డుల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మా ట్లాడుతూ వార్డుల్లోని సమస్యలను ప్రణాళికాబద్ధంగా పరిష్కరించుకోవాలని సూచించారు. పట్టణ వాసులు కార్యక్రమం లో భాగస్వాములై పట్టణ అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
అందోల్, జూన్3: వార్డుల్లో చేపట్టనున్న పట్టణప్రగతి పనులను పకడ్బందీగా నిర్వహించాలని మున్సిపల్ చైర్మన్ మల్లయ్య అన్నారు. పట్టణ ప్రగతిలో భాగం గా శుక్రవారం 17వ వార్డులో పర్యటించి సమస్యలు తెలుసుకుని స్థానికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభు త్వం పట్టణప్రగతి ద్వారా మౌలిక వసతులు కల్పించిందన్నారు.
ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలకు అవసరమైన సౌకర్యాలపై దృష్టి పెట్టాలన్నారు. నర్సరీల్లో మొక్కలు బాగా పెరిగేలా చూడటంతో పాటు హరితహారం మొక్కల ఎదుగుదలపై దృష్టి పెట్టాలని సూచించారు. కార్యక్రమంలో కమిషనర్ అశ్రిత్‌కుమార్, కౌన్సిలర్ సత్యనారాయణ పాల్గొన్నారు.
రామచంద్రాపురం, జూన్ 3 : పట్టణ ప్రగతితో కాలనీలన్నీ శుభ్రంగా మారుతున్నాయని ఆర్సీపురం డివిజన్ కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పానగేశ్ అన్నారు. డివిజన్లోని జ్యోతినగర్, కానుకుంటలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని శుక్రవారం కార్పొరేటర్ ప్రారంభించారు. అనంతరం ఆయా కాలనీల్లో మట్టికుప్పలు, డెబ్రీస్ని తొలగింపజేసి పరిసరాలను శుభ్రంగా మార్చా రు.
ఓపెన్ డ్రైన్స్లో దోమ మందుని పిచికారి చేయించారు. అనంతరం పట్టణప్రగతి బ్రోచర్‌ను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆర్సీపురం డివిజన్లో పట్టణప్రగతిని ముమ్మరంగా నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఉపకమిషనర్ బాలయ్య, ఇన్స్పెక్టర్ సంజయ్‌కుమార్, నాయకులు యాదయ్యగౌడ్, ప్రమోద్‌గౌడ్, మల్లేశ్, మల్కయ్య, రాజు, సురేశ్పటేల్ ఉన్నారు.
