అల్లాదుర్గం, జూన్ 3 : పల్లె ప్రగతితో గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని మండల ప్రత్యేకాధికారి జైరాంనాయక్ అన్నారు. శుక్రవారం అల్లాదుర్గం మండలంలో ఐదో విడుత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని కాయిదంపల్లి, సీతానగర్, ముస్లాపూర్ గ్రామా ల్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లె ప్రగతిలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. అధికారులు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమం లో ఎంపీడీవో విజయభాస్కర్‌రెడ్డి, ఎంపీవో సయ్యద్ ఉన్నారు.
మనోహరాబాద్, జూన్ 3 : పల్లె ప్రగతిలో ప్రజలు భాగస్వాములు కావాలని గడా ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి అన్నారు. వెంకటాపూర్ అగ్రహారంలో చేపట్టిన పల్లె ప్రగతిలో పాల్గొని, గ్రామ సమస్యలు, అభివృద్ధి పనులపై ఆరా తీశారు. మనోహరాబాద్, కొనాయిపల్లి (పీటీ), గౌతోజిగూడెం, పోతారం, కాళ్లకల్ తదితర గ్రామాల్లో పల్లె ప్రగతిలో భాగంగా సర్పంచ్‌లు, పాలకవర్గ సభ్యులు గ్రామాల్లో పర్యటించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు మహిపాల్‌రెడ్డి, మల్లేశ్, ఎంపీటీసీ లావణ్య, లతావెంకట్గౌడ్, ఉప సర్పంచ్‌లు రాజుయాదవ్, రేణుకుమార్, స్థానిక నాయకుడు చంద్రశేఖర్ ముదిరాజ్ పాల్గొన్నారు.
కొల్చారం, జూన్ 3 : పల్లె ప్రగతితో పల్లెసీమలు పట్టుగొమ్మలుగా మారుతున్నట్లు ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్ అన్నారు. సం గాయిపేట, చిన్నాఘన్‌పూర్ గ్రామాల్లో గ్రామసభలు నిర్వహిం చారు. సంగాయిపేటలో క్రీడాప్రాంగణాన్ని పరిశీలించారు. ఎనగండ్లలో కార్యదర్శి శ్రీనివాస్ పను ల వివరాలు తెలిపారు. కొల్చా రం లో సర్పంచ్ ఉమ, కార్యదర్శి అం జయ్యతో కలిసి పర్యటించారు.
శివ్వంపేట, జూన్ 3 : గ్రామా లు అభివృద్ధి చేసేందుకే పల్లెప్రగతి దోహదపడుతుందని ఎంపీపీ హరికృష్ణ అన్నారు. దొంతి గ్రామంలో రూ.15లక్షల నిధులతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులను సర్పంచ్ ఫణిశశాంక్శర్మతో కలిసి ప్రారంభించారు. ప్రతి గ్రామం అభివృద్ధిలో పోటీపడాలన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ లక్ష్మీకుమార్, ఉపసర్పంచ్ సత్యనారాయణ, నేతలు రాజశేఖర్‌గౌడ్, షఫీయొద్దీన్ పాల్గొన్నారు.
రామాయంపేట రూరల్, జూన్ 3 : పల్లె ప్రగతి కార్యక్రమా న్ని విజయవంతం చేయాలని మండల ప్రత్యేకాధికారి శ్రీనిసరావు, ఎంపీడీవో యాదగిరిరెడ్డి కోరారు. కాట్రియాల గ్రామం లో గ్రామస్తులతో సమావేశం నిర్వహించి పల్లె ప్రగతిపై అవగాహన కల్పించారు. ఢి.ధర్మారం, దంతెపల్లి, పర్వతాపూర్, లక్ష్మాపూర్ గ్రామాల్లో పల్లె ప్రగతిపై అవగాహన కల్పించారు.
మనోహరాబాద్, జూన్ 3 : పల్లె ప్రగతితోనే పల్లెలు ఆదర్శం గా మారాలని సర్పంచ్ వెంకటేశ్వర్లు, ఉప సర్పంచ్ రేణుకుమార్ అన్నారు. జడ్పీ చైర్పర్సన్ దత్తత గ్రామం గౌతోజిగూడెంలో గ్రామసభ అనంతరం గ్రామస్తులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు పెంటమ్మ, భవాని, పద్మ, నాయకులు శ్రీనివాస్, ఆంజనేయులు ఉన్నారు.
చిన్నశంకరంపేట, జూన్ 3 : పల్లె ప్రగతిలో ప్రజలు భాగస్వాములు కావాలని జడ్పీటీసీ మాధవి పిలుపునిచ్చారు. వివిధ గ్రామాల్లో పల్లె ప్రగతి గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ మాధవి గవ్వలపల్లి గ్రామాన్ని సందర్శించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీడీవో గణేశ్‌రెడ్డి పాల్గొన్నారు.
చేగుంట, జూన్ 3 :పల్లె ప్రగతి పనులను విజయవంతం చేయాలని నార్సింగి జడ్పీటీసీ కృష్ణారెడ్డి కోరారు. చేగుంట, నా ర్సింగి మండలాల్లో పల్లె ప్రగతి గ్రామసభలను నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో సర్పంచ్‌లు ఎర్రం అశోక్, కుమ్మరి శ్రీనివాస్, ఎంపీటీసీలు సత్యనారాయణ, సుజాత, ఈవో నరేశ్, కార్యదర్శి ఎల్లం, నాయకులు బండి విశ్వేశ్వర్ పాల్గొన్నారు.
మెదక్ రూరల్/నిజాంపేట, జూన్ 3 : గ్రామాన్ని పరిశుభ్రం తో ఆదర్శంగా తీర్చిదిద్దాలని బాలానగర్ సర్పంచ్ కుమార్ అన్నారు. మెదక్ మండలంలో గ్రామసభలు నిర్వహించారు. పల్లెప్రగతితో గ్రామాల రూపురేఖలు మారుతున్నట్లు నిజాంపేట ఎంపీపీ సిద్ధిరాములు అన్నారు. నిజాంపేట మండలం నస్కల్లోగ్రామసభ నిర్వహించారు. సభలో పంచాయతీ కార్యదర్శి ప్రేమలత, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
వెల్దుర్తి/ చిలిపిచెడ్, జూన్ 3 : ప్రజాప్రతినిధులు పల్లెప్రగతి ర్యాలీలు నిర్వహించి, వార్డుల్లో పర్యటించి, సమస్యలను గుర్తించారు. మండల ప్రత్యేకాధికారి సుభాషిణీ బొమ్మారం, నాగ్సాన్పల్లి గ్రామాల్లో ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. ర్యాలీల్లో సర్పంచ్ భాగ్యమ్మ, ఈవో బలరాంరెడ్డి, మాజీ జడ్పీటీసీ ఆంజనేయులు, ఎంపీపీ స్వరూప, జడ్పీటీసీ రమేశ్‌గౌడ్ పాల్గొన్నారు.
చిలిపిచెడ్ మండలంలో పల్లెప్రగతి విజయవంతం చేయాల ని ఎంపీడీవో కృష్ణమోహన్ కోరారు. చిలిపిచెడ్, గౌతాపూర్ గ్రా మసభలు నిర్వహించి, చేపట్టనున్న పనులను వివరించారు.