మెదక్, జూన్ 1 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవానికి మెదక్ జిల్లాలో సర్వం సిద్ధమైం ది. కరోనా నేపథ్యంలో గత సంవత్సరం సాదాసీదాగా నిర్వహించిన రాష్ట్ర అవతరణ వేడుకలు ఈ సంవత్సరం వైభవంగా నిర్వహించనుండగా, యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. మెదక్ జిల్లాలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు రాష్ట్ర పశు సంవర్థక, పాడి అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ హాజరుకానున్నారు. ఉదయం 8:30 గంటలకు చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించనున్నారు.
అనంతరం 9గంటలకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో జాతీయ పతాకావిష్కరణ చేస్తారు. ఉదయం 9నుంచి 9:10గంటల వరకు గౌర వ వందనం స్వీకరించనున్నారు. 9:10నుంచి 9:20వరకు ముఖ్య అతిథి సందేశాన్ని ఇస్తారు. 9:20నుంచి 9:30గంటల వరకు తెలంగాణ అమరవీరుల తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు సన్మానం చేస్తారు. 9:30నుంచి 9:45 వరకు హైటీ కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం 4గంటలకు కవి సమ్మేళన కార్యక్రమం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో నిర్వహిస్తారు.
రాష్ట్ర అవతరణ వేడుకలను పురస్కరించుకోని మెదక్ క లెక్టరేట్ భవనాన్ని రంగు రంగుల విద్యుత్‌దీపాలతో అలంకరించారు. కలెక్టరేట్ ఆవరణలో షామీయాలు ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాట్లను మెదక్ కలెక్టర్ హరీశ్, అదనపు కలెక్టర్లు ప్రతిమాసింగ్, రమేశ్ పర్యవేక్షించారు.
సంగారెడ్డి కలెక్టరేట్, జూన్ 1: తెలంగాణ అవతరణ దినోత్సవం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 2న జరగనున్న అవతరణ వే డుకలకు హోంమంత్రి మహమూద్ అలీ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ఉదయం 8:40 గంటలకు కలెక్టరేట్ తెలంగాణ అమర వీరుల స్థూపం వద్ద శ్రద్ధంజలి ఘటిస్తారు. ఉదయం 8:50 గంటలకు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. ఉదయం 9 గంటలకు మంత్రి జాతీయ పతాకావిష్కరణ చేస్తారు.
ఆ తరువాత జిల్లా ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. ఉదయం 9:30గంటలకు హైటీ కార్యక్రమం ఉంటుంది. ఇదిలా ఉండగా, బుధవా రం కలెక్టరేట్లోని ఏర్పాట్లను జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హోంమంత్రి జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం ఉంటుందన్నారు. అదే రోజు సాయంత్రం 4గంటలకు కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కవి సమ్మేళనం నిర్వహించనున్నట్టు వెల్లడించారు. అదనపు కలెక్టర్ వెంట జిల్లా రెవెన్యూ అధికారి రాధికారమణి, ఆర్డీవో నగేశ్, పోలీసు అధికారులు పాల్గొన్నారు.